iDreamPost
android-app
ios-app

ప్రియురాలి టార్చర్ తట్టుకోలేక ప్రియుడు దారుణ నిర్ణయం..!

ప్రేమించుకున్నాం అంటే సరిపోదు. ఆ ప్రేమను గౌరవించి.. అతడికి సమస్య వచ్చినప్పుడు ప్రియురాలు, ఆమెకు ఇబ్బంది కలిగినప్పుడు ప్రియుడు.. ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే ఆ ప్రేమ సఫలీకృతమౌతుంది. అలా కాకుండా..

ప్రేమించుకున్నాం అంటే సరిపోదు. ఆ ప్రేమను గౌరవించి.. అతడికి సమస్య వచ్చినప్పుడు ప్రియురాలు, ఆమెకు ఇబ్బంది కలిగినప్పుడు ప్రియుడు.. ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే ఆ ప్రేమ సఫలీకృతమౌతుంది. అలా కాకుండా..

ప్రియురాలి టార్చర్ తట్టుకోలేక ప్రియుడు దారుణ నిర్ణయం..!

ప్రేమ ఎంత మధురం.. ప్రియురాలు అంత కఠినం అనేది ఈ ప్రేమికుడి విషయంలో రుజువు అయ్యింది. మనస్ఫూర్తిగా ఇష్టపడ్డ అమ్మాయి కారణంగా తనువు చాలించాల్సి వచ్చింది. అమ్మాయి,అబ్బాయి ప్రేమించుకున్నాక.. పెద్దలు ఒప్పుకుంటే అది పెళ్లి పీటలు ఎక్కుతుంది. ఈ ప్రేమప్రయాణంలో అబ్బాయి మనస్సు మారిపోయి.. ప్రియురాలికి హ్యాండ్ ఇచ్చిన దాఖలాలున్నాయి. అలాగే లవర్‌కు గుడ్ బై చెప్పి తల్లిదండ్రులు చూసిన సంబంధాలు చేసుకుని వెళ్లి పోయిన అమ్మాయిలు ఉన్నారు. కానీ నేడు తాము మగవాళ్లతో ఎందులో తీసుపోలేదని నిరూపించేందుకు అమ్మాయిలు మరింత మితిమీరుతున్నారు. రోజు రోజుకూ వీరిలో ఉన్న బేబీ అవతారం బయటకు వచ్చేస్తోంది. అంతేనా బాయ్ ఫ్రెండ్‌ను చిత్ర హింసలకు గురి చేస్తున్నారు.

ఈ వేధింపులు తాళలేక ప్రియుడు ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన విశాఖ పట్నం జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే గాజువాకలోని చిన గంట్యాడ శ్రీనివాస్ నగర్‌కు చెందిన కోసనం భాస్కర్ రావు బాబీ అనే యువకుడు ఏవీకే డిగ్రీ కాలేజీలో ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. జెమీమా అనే యువతి విజయవాడ కాలేజీలో నీట్‌కి ప్రిపేర్ అవుతుంది. గత కొంత కాలంగా బాబీ, జెమీమా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో తనను పెళ్లి చేసుకోవాలని జెమీమా కోరుతోంది. అందుకు ఇది సరైన సమయం కాదని బాబీ సర్దిచెప్పుకుంటూ వచ్చాడు. చివరకు అతడు పెళ్లి చేసుకోడన్న భయంతో.. అతడిని బెదిరించడం మొదలు పెట్టింది యువతి. పెళ్లి చేసుకోకపోతే.. నీపై కేసు పెడతానంటూ బెదిరిస్తూ వచ్చింది.

అట్రాసిటీ కేసు పెడతానని అనడంతో.. ఆందోళనకు లోనైన బాబీ విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. దీపావళి పండుగ రోజు బలవన్మరణానికి పాల్పడ్డాడు. తమ కొడుకు మరణానికి జెమీమా అనే యువతి కారణమని అతడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెళ్లి చేసుకోనని చెప్పడంతో యువతి భయపెట్టేందుకు ఏకంగా పోలీసు కేసు పెడతాననడంతో బాబీ పాయిజన్ తాగి ఆత్మహత్య చేసుకున్నాడని పేర్కొన్నారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. ఆ అమ్మాయిని విచారించే అవకాశాలున్నాయని సమాచారం.

Jojobet Girişmeritbetmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet girişgrandpashabetjojobet giriş