iDreamPost

పరిచయస్థుడితో ఫంక్షన్‌కు వెళ్లిన మహిళ.. ఆటోలో పోలీస్ స్టేషన్‌కు మృతదేహం

రాజేశ్వరికి 32 సంవత్సరాలు. భర్త లేకపోవడంతో కూతురితో కలిసి ఒంటరి జీవితాన్ని గడుపుతోంది. ఇంతలో ఓ ఫంక్షన్‌కు వెళదామని రెడీ అయ్యి... ఓ పరిచయస్థుడికి కాల్ చేసింది. ఇద్దరు కలిసి ఆటోలో బయలు దేరారు కానీ..

రాజేశ్వరికి 32 సంవత్సరాలు. భర్త లేకపోవడంతో కూతురితో కలిసి ఒంటరి జీవితాన్ని గడుపుతోంది. ఇంతలో ఓ ఫంక్షన్‌కు వెళదామని రెడీ అయ్యి... ఓ పరిచయస్థుడికి కాల్ చేసింది. ఇద్దరు కలిసి ఆటోలో బయలు దేరారు కానీ..

పరిచయస్థుడితో ఫంక్షన్‌కు వెళ్లిన మహిళ.. ఆటోలో పోలీస్ స్టేషన్‌కు మృతదేహం

ఈ ఫోటోలో ఉన్న మహిళ పేరు రాజేశ్వరి. ఆమె వయస్సు 32 సంవత్సరాలు. చిన్న వయస్సులోనే మాంగళ్యం దూరమైంది. కూతురితో ఒంటరిగా జీవనం సాగిస్తుంది. చిన్న దుకాణం పెట్టుకుని బతుకుతోంది. ఓ రోజు శుభకార్యానికి బయలు దేరింది. చక్కగా రెడీ అయ్యి.. ఓ వ్యక్తికి ఫోన్ చేసింది. తనను ఫంక్షన్‌కు తీసుకెళ్లాలంటూ కోరింది. ఇద్దరు కలిసి ఆటోలో బయలు దేరారు. కానీ ఆమె ఫంక్షన్‌కు వెళ్లలేదు. ఆమె మృతదేహాంతో కలిసి అదే ఆటోలో పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు పిలిచిన ఆ వ్యక్తి. ఆమెను తానే చంపేశానంటూ పోలీసులకు లొంగిపోయాడు. ఇంతకు అతడు ఎవరంటే..ఆమెతో ఇటీవల సన్నిహితంగా మెలుగుతున్న గోపాల్. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

పొందూరు మండలం తాడివలస సమీపంలోని చినబొడ్డేపల్లి గ్రామంలో నివసిస్తోంది అమలాపురపు రాజేశ్వరి. భర్త గుప్తేశ్వరరావు మూడేళ్ల కిందట అనారోగ్యంతో మృతి చెందాడు. ఆమెకు ఓ కూతురు. కుమార్తెతో కలిసి అదే గ్రామంలో తల్లిదండ్రులతో కలిసి ఉంటుంది. కిరాణా షాపు పెట్టుకుని జీవనం సాగిస్తోంది. రెండు నెలల కిందట బొడ్డేపల్లి రైల్వేట్రాక్‌ పనుల కోసం.. నరసన్నపేట మండలం ఉర్లాం గ్రామానికి చెందిన అముజూరు గోపాల్‌ ఆ ప్రాంతానికి వచ్చాడు. తరచుగా ఆమె దుకాణానికి రావడంతో ఇద్దరికి పరిచయం ఏర్పడింది. వివాహేతర సంబంధానికి దారి తీసింది. మంగళవారం సంతకవిటి మండలంలోని వాల్తేరులో శుభకార్యానికి వెళ్లడానికి సిద్ధమైంది రాజేశ్వరి. గోపాల్‌కు ఫోన్ చేసి.. ఇద్దరం కలిసి వెళదామని చెప్పింది.

గోపాల్ ఆటో తీసుకుని చిన బొడ్డేపల్లికి వచ్చాడు. ఇద్దరు కలిసి ఆటోలో బయలు దేరారు. అయితే మార్గమధ్యంలో ఏదో విషయంపై గొడవ పడ్డారు ఇద్దరు. తాడివలస సమీపాన ఇద్దరి మధ్య వివాదం నెలకొంది. అయితే గోపాల్ తన వెంట తెచ్చుకున్న చాకుతో రాజేశ్వరి మెడపై పలుమార్లు దాడి చేశాడు. దీంతో రాజేశ్వరి అక్కడిక్కడే మృతి చెందింది. ఆమె మృతదేహాన్ని తీసుకుని అదే ఆటోలో గోపాల్‌ స్థానిక పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి లొంగిపోయాడు. నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు ఆముదాల వలస పోలీసులు. హతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. నిందితుడు గోపాల్‌తో కలిసి హత్య జరిగిన ప్రాంతానికి వెళ్లి దర్యాప్తు చేపట్టారు. హత్యకు గల కారణాలు విచారిస్తున్నారు. అయితే ముందే అతడు చాకు తెచ్చుకోవడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గతంలోనే వారికి గొడవ జరిగిందని, రాజేశ్వరిని చంపేయాలన్న ఉద్దేశంతోనే ఈ చర్యకు నిందితుడు దిగినట్లు తెలుస్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి