iDreamPost
android-app
ios-app

అమ్మ బాధని చూస్తూ తట్టుకోలేక.. కొడుకు దారుణం! ఇదెక్కడి ఘోరం!

చేతికి అందివచ్చిన పిల్లలు మరో ప్రాంతానికి వెళ్లిపోతే తల్లిదండ్రులు బాధపడతారు కానీ.. వారి భవిష్యత్తుకు అడ్డు కాకూడదని ఆలోచ చేస్తారు. పండక్కి, పబ్బానికి ఇంటికి వచ్చిన బిడ్డల్ని తన చేతి గోరు ముద్దులతో తినిపించనిదే తనివి తీరదు తల్లికి. కానీ అలాంటి తల్లికి ఇప్పుడు..

చేతికి అందివచ్చిన పిల్లలు మరో ప్రాంతానికి వెళ్లిపోతే తల్లిదండ్రులు బాధపడతారు కానీ.. వారి భవిష్యత్తుకు అడ్డు కాకూడదని ఆలోచ చేస్తారు. పండక్కి, పబ్బానికి ఇంటికి వచ్చిన బిడ్డల్ని తన చేతి గోరు ముద్దులతో తినిపించనిదే తనివి తీరదు తల్లికి. కానీ అలాంటి తల్లికి ఇప్పుడు..

అమ్మ బాధని చూస్తూ తట్టుకోలేక.. కొడుకు దారుణం! ఇదెక్కడి ఘోరం!

బంధాల్లో తల్లి, కొడుకుల బంధం కాస్త డిఫరెంట్. వారి మధ్య ఎంత ప్రేమ ఉంటుందో.. అన్ని గొడవలు కూడా జరుగుతుంటాయి. అప్పుడే గొడవ పడుతుంటారు.. అప్పుడే కలిసి పోతుంటారు. అలాగే కొడుకు కళ్ల ముందు ఉన్నంత వరకు.. ధీమా ఉండే తల్లి.. ఉద్యోగాలు, చదువులు అంటూ మరో ప్రాంతానికి వెళితే తల్లడిల్లి పోతుంది. ఇష్టం లేకపోయినా.. వారి భవిష్యత్తుకు అడ్డు కాకూడదని తన మనస్సును రాయి చేసుకుని పంపిస్తుంది. పండుగ ఎప్పుడు వస్తుందా.. మళ్లీ తన చేతులతో కొడుక్కి గోరు ముద్దలు ఎప్పుడెప్పుడు తినిపించాలా అని ఎదురు చూస్తూ ఉంటుంది. అలాగే కుమారుడు కూడా దూరభారంగా వెళ్లినా.. మనస్సంతా ఇంటిపైనే ఉంటుంది. ముఖ్యంగా అమ్మ చేతి వంటను మిస్ అవుతున్నామని, ఆమె ఒడిలో తలపెట్టి పడుకోవాలని, ముచ్చట్లు చెప్పాలని అనుకుంటాడు.

అలాంటి తల్లి.. ఒక్కసారిగా మంచాన పడితే.. ఏం చేయాలో తోచక.. ఓ యువకుడు అర్థాంతరంగా తనువు చాలించాడు. తల్లి గురించి ఆలోచిస్తూనే.. ఆమెను ఒంటరి చేసి వెళ్లిపోయాడు. వివరాల్లోకి వెళితే.. తూర్పు గోదావరి జిల్లా మండ పేట మండలానికి చెందిన తమ్మన పూడి ఆంజనేయులు, చంద్ర సేన దంపతులకు కుమారుడు భువన్, కూతురు ఉన్నారు. కూతురికి పెళ్లి చేసి పంపగా.. కుమారుడు భువన్.. హైదరాబాద్‌లో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. తన సంపాదనలో కొంత ఇంటికి పంపేవాడు. హాయిగా సాగిపోతున్న జీవితంలో ఒక్కసారిగా పెను మార్పు చోటుచేసుకుంది. భువన్ తండ్రి అనారోగ్య సమస్యలతో చనిపోయాడు. దీంతో మానసికంగా కుంగిపోయింది ఆ కుటుంబం.

అంతలో తానే ఇలా అయిపోతే.. తల్లిని, కుటుంబాన్ని మంచిగా చూసుకోవాలన్న బాధ్యత ఎరిగి.. వెంటనే హైదరాబాద్ వచ్చి ఉద్యోగంలో చేరాడు. కేపీహెచ్‌బీలో ఉన్న ఓ బాయ్స్ హాస్టల్లో ఉండేవాడు. అక్కడి నుండే ఉద్యోగానికి వెళ్లేవాడు. మళ్లీ తేరుకుంటున్నాం అనుకునే సమయంలో మరో కుదుపు. తల్లి పక్షవాతానికి గురైందని తెలిసి.. తట్టుకోలేకపోయాడు. అంతే తల్లిని అలా చూడాలని అనుకోలేదో.. ఏమో తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు భువన్. తన రూమ్మేట్స్ అంతా బయటకు వెళ్లాక.. గది తలుపులు బిగించుకుని.. ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎంత సేపటికి భువన్ గదిలో నుండి బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన పక్క రూమ్మేట్స్ వెళ్లి చూడగా.. ఫ్యాన్సుకు వేలాడుతూ కనిపించడంతో వార్డెన్‌కు ఫోన్ చేసి సమాచారం అందించారు. వెంటనే పోలీసులకు సమాచారం వెళ్లింది. పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు. ధైర్యం చెప్పాల్సిన కుమారుడు ఇలా అయ్యే సరికి ఆ తల్లి ఇంకెంత మానసిక వేదన అనుభవిస్తుందో..? ఇప్పుడు ఆమెను చూసెదెవ్వరు..?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి