iDreamPost
android-app
ios-app

విశాఖ ఫిషింగ్ హార్బర్ ఘటన.. అసలు నిజాలు వెల్లడించిన పోలీసులు

విశాఖ ఫిషింగ్ హార్బర్ ఘటనకు సంబంధించి సీపీ రవిశంకర్ పూర్తి వివరాలు వెల్లడించారు. ప్రెస్ మీట్ లో ఆయన నిందితులు ఎవరనే విషయంపై పూర్తి క్లారిటీ ఇచ్చారు.

విశాఖ ఫిషింగ్ హార్బర్ ఘటనకు సంబంధించి సీపీ రవిశంకర్ పూర్తి వివరాలు వెల్లడించారు. ప్రెస్ మీట్ లో ఆయన నిందితులు ఎవరనే విషయంపై పూర్తి క్లారిటీ ఇచ్చారు.

విశాఖ ఫిషింగ్ హార్బర్ ఘటన.. అసలు నిజాలు వెల్లడించిన పోలీసులు

విశాఖ ఫిషింగ్ హార్బర్ ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ నెల 19న జరిగిన ఈ అగ్ని ప్రమాద ఘటనలో దాదాపు 30 బోట్లు కాలిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై వెంటనే స్పందించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలను పూర్తిగా ఆర్పివేశారు. విషాదం ఏంటంటే? ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోయినా.. బోట్లు అన్నీ తగలబడిపోయాయి. దీంతో ఆ బోట్లు యజమానులు గుండెలు పగిలేలా ఏడ్చారు. అనంతరం పోలీసులు ఈ ఘటనను సీరియస్ గా తీసుకుని ఈ అగ్ని ప్రమాద ఘటనకు అసలు కారణం ఏంటనే దిశగా విచారణ మొదలు పెట్టారు.

ఈ నేపథ్యంలోనే లోకల్ బాయ్ నానిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. అనంతరం అతడిని అదుపులోకి తీసుకుని మూడు రోజుల తర్వాత విడుదల చేశారు. అయితే ఈ ఘటనపై పోలీసులు మరింత లోతుగా విచారణ చేపట్టారు. ఇందులో భాగంగానే అక్కడే ఉన్న కొన్ని సీసీ కెమెరాలను సైతం పరిశీలించారు. అయితే ఈ అగ్ని ప్రమాద ఘటనకు ముందు బోటుల్లో నుంచి నాని అనే వ్యక్తితో పాటు అతని బంధువైన వెంకటేష్ బయటకు వచ్చి బైక్ పై వెళ్లిపోయారు. ఈ దృశ్యాలన్నీ అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఇక పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి తాజాగా ప్రెస్ మీట్ పెట్టి అసలు నిజాలు వెల్లడించారు.

సీపీ రవిశంకర్ మాట్లాడుతూ.. విశాఖ ఫిషింగ్ హార్బర్ అగ్ని ప్రమాద ఘటనలో వాసుపల్లి నాని, అతని మామ అయిన వెంకటేష్ లను ప్రధాన నిందితులుగా చేర్చాం. ఆ రోజు వీళ్లు అక్కడ పార్టీ చేసుకున్నారు. ఈ క్రమంలోనే మద్యం మత్తులో తాగిన సిగరెట్ పక్క బోటులో విసిరేశారు. దీంతో మెల్లగా మంటలు అంటుకుని బోట్లన్నీ దగ్ధమయ్యాయి. ఇక అందులో డీజిల్. నైలాన్ వలలు ఉండడంతో ఆ మంటలు మరింత వేగంగా విస్తరించి మిగతా బోట్లకు అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో దాదాపు 30 బోట్లు పూర్తిగా తగలబడిపోగ, 19 బోట్లు పాక్షికంగా దగ్ధంమయ్యాయని సీపీ రవిశంకర్ వెల్లడించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి