పిఠాపురంలో పవన్ పై పోటీగా చెప్పులు కుట్టే వ్యక్తి! ఈ తెగువకి హ్యాట్సాఫ్!

ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా..గురువారం నామినేషన్ల గడువు ముగిసింది. ఇదే సమయంలో రాష్ట్రంలో ప్రధాన పార్టీలతో పాటు పలువురు స్వతంత్ర అభ్యర్థులుగా కూడా నామినేషన్ వేశారు.

ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా..గురువారం నామినేషన్ల గడువు ముగిసింది. ఇదే సమయంలో రాష్ట్రంలో ప్రధాన పార్టీలతో పాటు పలువురు స్వతంత్ర అభ్యర్థులుగా కూడా నామినేషన్ వేశారు.

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సమరం తీవ్ర స్థాయిలో ఉంది. సమ్మర్ వేడిని మించి.. ఇక్కడి పొలిటికల్ హీట్ ఉంది. ఏపీలోని రాజకీయ వేడి ముందు వేసవికాలం వేడి కూడా తక్కువే అనిపింస్తుంది. మే 13 పోలింగ్, జూన్ 4న ఫలితాలు రానున్నాయి. వచ్చే ఎన్నికల్లో గెలిచి మరోసారి అధికారంలోకి రావాలని వైఎస్సార్ సీపీ భావిస్తుంది. అదే సమయంలో ఎలాగైనా జగన్ విజయాన్ని అడ్డుకోవాలని ప్రతిపక్ష కూటమి భావిస్తోంది. ఈ క్రమంలోనే అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. ఇక ఎన్నికల ప్రక్రియలో భాగంగా..గురువారం నామినేషన్ల గడువు ముగిసింది. ఇదే సమయంలో రాష్ట్రంలో ప్రధాన పార్టీలతో పాటు పలువురు స్వతంత్ర అభ్యర్థులుగా కూడా నామినేషన్ వేశారు. ఇందులో పిఠాపురం నుంచి చెప్పులు కుట్టుకునే వ్యక్తి నామినేషన్ దాఖలు చేసి.. అందని తనవైపు తిప్పుకునేలా చేశాడు. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

దేశం మొత్తం మీద ఎన్నికలు జరుగుతున్న అందరి చూపు మాత్రం ఏపీపైనే ఉంది. అందుకు కారణంగా ఇక్కడ రాజకీయం నువ్వానేనా అన్నట్లు సాగుతోంది. అలానే ఇదే సమయంలో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల ఏ పార్టీ గెలుస్తుందనే అంశంతో పాటు మరో విషయం గురించి ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. అదే కాకినాడ జిల్లాలోనే పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి ఎవరు గెలుస్తారా? అనే ఆసక్తి ఉంది. అందుకు కారణం.. ఇక్కడి నుంచి జనసేన పార్టీ అధ్యక్షుడు, సినీ నటుడు పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్నారు. అలానే వైసీపీ తరపు నుంచి ప్రస్తుతం కాకినాడ ఎంపీ వంగా గీత పోటీ చేస్తున్నారు.

ఈ నియోజవర్గాన్ని ఇరు పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎవరికి వారే గెలుపు ధీమాను వ్యక్తం చేస్తున్నారు. ఇలా హేమాహేమీలు పోటీ చేస్తున్న ఈ పిఠాపురం నియోజవర్గంలో గురువారం ఓ ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. వంగా గీతా, పవన్ కల్యాణ్ లతో పాటు ఇక్కడి నుంచి ఓ వ్యక్తి కూడా స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి దిగారు. ఆయన బ్యాగ్రౌండ్ తెలిసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కొందరు అయితే ఆయన ధైర్యాన్నికి అభినందనలు తెలుపుతున్నారు. ఇక అతడు ఎవరు, ఆ విషయాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

కాకినాడ జిల్లా పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి చెప్పులు కుట్టే వ్యక్తి  ఏడిద భాస్కరావు ఎన్నికల బరిలో నిల్చారు. గురువారం స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. భాస్కర్ ఇంటర్ వరకు చదువును ఆర్థిక సమస్యల కారణంగా చదువు మానేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయన స్థానిక ప్రభుత్వ కాలేజీ ముందు చెప్పులు కుడుతు జీవనం సాగిస్తున్నాడు. ఈ చెప్పు కుట్టడం ద్వారా వచ్చిన సంపాదన తో కుటుంబాన్ని పోషిస్తున్నారు భాస్కర్ రావు. ఇలా పాదరక్షలు కుడుతూనే ఎంఏ రాజనీతి శాస్త్రంపై  అధ్యయనం చేయడం విశేషం. ఆయన వద్ద రూ.20 వేల నగదు మాత్రమే ఉంది. మొత్తంగా అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్న పిఠాపురం నియోజవర్గంలో పోటీ చేస్తూ.. భాస్కర్ రావు అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నారు. ఇక ఆయన ధైర్యాన్నికి  పలువురు హ్యాట్సాఫ్ చెబుతున్నారు.

Show comments