iDreamPost
android-app
ios-app

నిప్పు కణికల్లా మండుతున్న తెలుగు రాష్ట్రాలు! రాబోయే 4 రోజులు కీలకం!

Weather Report: సూర్యుడి ప్రతాపంతో అల్లాడి పోతున్న రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు చల్లని కబురు అందింది. వచ్చే నాలుగు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం చల్లబడుతుందని, అలానే పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

Weather Report: సూర్యుడి ప్రతాపంతో అల్లాడి పోతున్న రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు చల్లని కబురు అందింది. వచ్చే నాలుగు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం చల్లబడుతుందని, అలానే పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

నిప్పు కణికల్లా మండుతున్న తెలుగు రాష్ట్రాలు! రాబోయే 4 రోజులు కీలకం!

ఏప్రిల్ మొదటి వారమే సూర్యుడు దంచికొడుతున్నారు. ఈ బానుడి భగభగలకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉదయం 9 గంటలకే సూర్యుడి తన ప్రతాపం చూపిస్తున్నాడు. అలా ఉదయం 9,10 గంటల సమయంలో  కూడా బయటకు వచ్చే పరిస్థితి  ఉండటం లేదు. ఇలా ఆ ప్రాంతం, ఈ ప్రాంతం అని తేడా లేకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాల్లో ఎండలు అదరగొడుతున్నాయి. వేడి సెగలకు తట్టుకోలేక వృద్ధులు, పిల్లలు అల్లాడిపోతున్నారు. ఇలాంటి తరుణంలో రెండు తెలుగు రాష్రాలకు ఆయా వాతావరణ శాఖలు చల్లని కబురు అందించాయి. మరో నాలుగు రోజుల్లో రెండు రాష్ట్రాల్లో వాతావరణం చల్లబడుతుందని, అలానే కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడే సూచనలు ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో సూర్యుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఎవరిని బయటకు రానివ్వకుండ ఇళ్లకే పరిమితం చేస్తున్నాడు. ఇక ఈ సూర్యుడి ప్రతాపానికి బయటకు వచ్చేందుకు జనం వణికిపోతున్నారు. రెండు రాష్ట్రాల్లోనే  వివిధ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు చేరుకుంటున్నాయి. ఆదివారం పగటిపూట ఉష్ణోగ్రతలు చూస్తే ఏకంగా 7 జిల్లాల్లో 43 నుంచి 45 డిగ్రీలు మధ్య నమోదైంది. ఏప్రిల్ మొదటి వారంలోనే ఉష్ణోగ్రతలు ఇలా ఉంటే.. ఇక మే నెల నాటికి ఏంటంటూ ప్రజలు బెబేలెత్తిపోతున్నారు.

ఏపీలోని అనకాపల్లి, నంద్యాల, ప్రకాశం, పల్నాడు జిల్లాలో గరిష్టంగా 44.9 వరకు ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. అలానే తెలంగాణలో మంచిర్యాల, పెద్దపల్లి, రామగుండ వంటి ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 41 డిగ్రీల నుంచి 45 డిగ్రీల వరకు నమోదు అయ్యింది. ఈ ఎండలు, ఉక్కపోత నుంచి రెండు తెలుగు రాష్ట్రాల జిల్లాల ప్రజలకు ఉపశమనం లభించనుంది. వాతావరణ శాఖ వచ్చే  రానున్న నాలుగు రోజుల్లో వాతావరణం చల్లబడే అవకాశం ఉందని వెల్లడిచింది. వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించిది. ఇప్పటికే రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని చెప్పగా…తాజాగా మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ స్పష్టం చేసింది. సముద్ర మట్టానవికి 1.5 కి.మీ ఎత్తులో ద్రోణి కొనసాగుతోంది.

దీని ప్రభావంతో సోమవారం, మంగళవారం, అలానే 10,11వ తేదీల్లో వాతావరణం చల్లబడుతుందని ఐఎండీఏ చెప్పింది. అలానే తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో  రానున్న నాలుగు రోజుల్లో వర్షాలు కురవనున్నాయని తెలిపింది. ఏపీలో  రాయలసీమలో వానలు పడే అవకాశం ఉందని ఐఎండీఏ స్పష్టం చేసింది. ఇప్పటికే మార్చి ఆఖరి వారం నుంచి తీవ్రమైన ఎండ, వేడి, ఉక్కపోతలతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఈ వార్త ఆనందాన్ని ఇస్తోంది.  రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు మాత్రం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ రెండు మూడు రోజులు కాస్తా జాగ్రత్తగా ఉంటే.. రానున్నరోజుల్లో కాస్తా తాత్కాలిక ఉపశమనం పొందొచ్చని నిపుణులు అంటున్నారు. మరి.. మండే ఎండల్లో చల్లని కబురు చెప్పారంటూ కామెంట్స్ చేస్తున్నారు.