iDreamPost
android-app
ios-app

వీడియో: వాయుగుండం దెబ్బకు కొబ్బరి చెట్లు ఎగిరిపడ్డాయ్

ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలను వణికించేస్తోంది మిచౌంగ్ తుఫాన్. ఇప్పటికే చెన్నై నగరమంతా అతలాకుతలం అవుతుంది. ఈ ధాటికి 8 మంది మరణించారు. వాయుగుండం తీరం దాటే సమయానికి తీర ప్రాంతమంతా అల్లోకల్లోలమైంది.

ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలను వణికించేస్తోంది మిచౌంగ్ తుఫాన్. ఇప్పటికే చెన్నై నగరమంతా అతలాకుతలం అవుతుంది. ఈ ధాటికి 8 మంది మరణించారు. వాయుగుండం తీరం దాటే సమయానికి తీర ప్రాంతమంతా అల్లోకల్లోలమైంది.

వీడియో: వాయుగుండం దెబ్బకు కొబ్బరి చెట్లు ఎగిరిపడ్డాయ్

బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం మిచౌంగ్ తుఫాన్‌గా మారింది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. ఈ తుఫాన్ దాటికి చెన్నై నగరమంతా అతలాకుతలం అయ్యింది. కుంభ వృష్టిగా వానలు పడుతున్నాయి. రోడ్డు, రహదారులు జలమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. పలు చోట్ల భారీగా వరద నీరు చేరి కార్లు కొట్టుకుపోయాయి. తీర ప్రాంతం అల్లకల్లోలంగా మారింది. అయితే మిచౌంగ్ తుఫాన్ బాపట్ల సమీపంలో తీరం దాటింది. అయినప్పటికీ వానలు కురుస్తూనే ఉన్నాయి. తుఫాన్ తీరాన్ని తాకిన సమయంలో 90-100 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచాయి. అయితే ఈ పరిస్థితి ఇంకా కొన్ని గంటల పాటు కొనసాగవచ్చునని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.

అయితే తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాలపై కూడా మిచౌంగ్ తుఫాన్ భారీ ప్రభావాన్ని చూపింది. నెల్లూరు, తిరుపతి, ప్రకాశం, బాపట్ల, కృష్ణా, ఉభయ గోదావరిలోని జిల్లాల్లో వానలు కురుస్తున్నాయి. ఈ వాయు గుండం దెబ్బకి ఈదరు గాలులతో వీస్తున్నాయి. చెట్లు కూలిపోవడమే కాదూ.. వాహనాలు కూడా ఎగిరి పడుతున్నాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది. సుడిగాలి.. చెట్లను వణికించేస్తోంది. నేలపై ఉన్న వాహనాలను గిరాటు వేస్తోంది. గోదావరి జిల్లాలో ఈదురు గాలులు బాగా వీస్తున్నాయి. గాలి సుడిగుండంగా మారి.. మనుషుల్నే కాదూ.. వస్తువులను, వాహనాలను, చెట్లను అందులోకి లాక్కుంటోంది. కొబ్బరి చెట్లు వేళ్లతో సహా లాక్కొంటోంది తుఫాన్.  ఈ తుఫాను ధాటికి చెన్నైలో ఎనిమిది మరణించారు. ఏపీలో పలు జిల్లాలకు రెడ్ ఎలర్ట్ జారీ చేసింది ప్రభుత్వం.