Arjun Suravaram
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి యూత్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే ఎన్నో సందర్భాల్లో అది నిరూపితమైంది. తాజాగా భీమిలీ సభలో కూడా అవే సీన్లు రిపీట్ అయింది. జగన్ పొలిటికల్ గేమ్ స్టార్ చేస్తే ఎలా ఉంటుందో ఈ సభ చూస్తే అర్థమవుతుంది.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి యూత్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే ఎన్నో సందర్భాల్లో అది నిరూపితమైంది. తాజాగా భీమిలీ సభలో కూడా అవే సీన్లు రిపీట్ అయింది. జగన్ పొలిటికల్ గేమ్ స్టార్ చేస్తే ఎలా ఉంటుందో ఈ సభ చూస్తే అర్థమవుతుంది.
Arjun Suravaram
ఆంధ్రప్రదేశ్ లో మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. రానున్న ఎన్నికల కురుక్షేత్ర యుద్ధంలో 175 స్థానాలు అసెంబ్లీ స్థానాలు, 25 లోక్ సభ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ఉత్తరాంధ్ర నుంచి ఎన్నికల శంఖరావాన్నే పూరించేందకు వైఎస్సార్ సీపీ అధ్యక్షులు, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సిద్దమయ్యారు. అసలు జగన్ మోహన్ రెడ్డి ఆట మొదలు పెడితే ఎలా ఉంటుందో ఈ సభ ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచింది. ఇప్పటి వరకు అధికారిక కార్యక్రమాలు, ప్రారంభోత్సవాలపై సీఎం జగన్ సభలు జరిగాయి. కానీ నేడు భీమిలి నుంచి ఎన్నికల సమర శంఖరావాన్ని సీఎం జగన్ పూరించారు. ఆయనకు జనాల్లో ఉన్న క్రేజ్ ఏ రేంజ్ ఉందో తెలిసేందుకు ఈ సభ ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచింది. సీఎం జగన్ సభ జనసంద్రంగా మారింది.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ప్రజల్లో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రత్యర్థులు ఎన్ని విమర్శలు చేసిన, ఆయనను తిట్టేందుకు ఎన్ని సభలు నిర్వహించిన పెద్దగా స్పందన లేదు. అయితే సీఎం జగన్..ప్రత్యర్థులపై ఎప్పుడూ ఫోకస్ చేయలేదు. ప్రజలకు మంచి చేస్తే వారే మరోసారి ఆశీర్వదిస్తారని బలంగా నమ్మారు. అలానే ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు ఎంత దూరమైన వెళ్లడం, ఎందాకైనా పోరాడటం చేయడం సీఎం జగన్ నైజం. అదే ప్రజల్లో, యువతలో ఆయనకు పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ను క్రియేట్ చేసింది.
అయితే సీఎం జగన్ ఎప్పుడూ ఎన్నికలపై ఫోకస్ చేసి.. సభలు నిర్వహించ లేదు. ఆయన ఎన్నికల విషయంలో అసలు ఇప్పటి వరకు ఆటనే స్టార్ చేయలేదు. అందుకే ప్రత్యర్థి పార్టీలైన టీడీపీ, జనసేనలు ఇప్పటి వరకు పెద్ద సభలు అని చెప్పుకుంటూ అట్టర్ ఫ్లాప్ గా సభలు నిర్వహించుకున్నాయి. ఇక ఆ పార్టీల సభలను అమోఘం, అద్భుతం అంటూ వీరికి ఎల్లో మీడియా తెగ భజన చేసింది. అయితే ఇది సింహం యుద్ధంలోకి అడుగు పెట్టనంత వరకేనని, ఒక్కసారి అడుగు పెడితే పరిస్థితులు వేరే ఉంటాయని చాలా మంది రాజకీయ విశ్లేషకులు చెప్పారు. అచ్చం అదే పరిస్థితి భీమిలి సభలో కనపడింది.
ఈ సభతో సీఎం జగన్ ఎన్నికల శంఖరావాన్ని పూరించనున్నారు. అందుకే కోసం వైసీపీ నాయకులు ఈ సభను భారీ ఎత్తున నిర్వహించేందుకు సన్నాహాలు చేశారు. ఇక జనాల్లో జగన్ కి ఉన్న క్రేజ్.. ఇక్కడ కనపడింది. భీమిలీ సభ మొత్తం జనసంద్రంగా మారింది. ఇక్కడ జనసునామీ ఏమైనా వచ్చిందా అన్నట్లు ప్రజలు భారీగా చేరుకున్నారు. ప్రజల్లో జగన్ కి ఉన్న క్రేజ్ ఈ సభతో మరోసారి కనిపించింది. జగన్ ఆట మొదలు పెడితే మాములుగా ఉండదు అనేదానికి ఈ సభే ఉదాహరణ.
ఇక ఈ సభ ద్వారా టీడీపీ ,జనసేన కుట్రలను చిత్తు చేసేలా శ్రేణులకు సీఎం జగన్ దిశా నిర్దేశం చేయనున్నారు. పార్టీని స్థాపించిన నాటి నుంచే సీఎం జగన్ కి ప్రజల్లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్. ఉపఎన్నికలు మొదలు సీఎం అయ్యే వరకు సీఎం జగన్ ఎన్నో రికార్డులు సృష్టించారు. సింహం వేట, సీఎం జగన్ పొలిటికల్ ఆట మొదలు పెడితే అది వేరేలెవేల్ ఉంటుందని ఈ సభను చూసిన వారు అభిప్రాయ పడుతున్నారు. మరి.. సీఎం జగన్ సభ.. జనసునామీని తలపించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.