iDreamPost
android-app
ios-app

మహిళలకు జగన్ సర్కార్ గుడ్‌న్యూస్.. అకౌంట్లోకి రూ.18750

  • Published Mar 05, 2024 | 7:43 AM Updated Updated Mar 05, 2024 | 7:43 AM

YSR Cheyutha Funds Release: ఏపీలో ఇప్పటి వరకు పలు సంక్షేమ పథకాలకు నిధులు విడుదల చేస్తున్న క్రమంలో తాజాగా సీఎం జగన్ మహిళలకు మరో శుభవార్త తెలిపారు.

YSR Cheyutha Funds Release: ఏపీలో ఇప్పటి వరకు పలు సంక్షేమ పథకాలకు నిధులు విడుదల చేస్తున్న క్రమంలో తాజాగా సీఎం జగన్ మహిళలకు మరో శుభవార్త తెలిపారు.

మహిళలకు జగన్ సర్కార్ గుడ్‌న్యూస్.. అకౌంట్లోకి రూ.18750

ఏపీలో త్వరలో ఎన్నికల జరగబోతున్నాయి. రాబోయే ఎన్నికల్లో గెలుపు మరోసారి తమ ఖాతాలో వేసుకోవడానికి వైసీపీ అన్ని విధాలుగా సిద్దమవుతుంది. తాము చేసిన అభివృద్ది, సంక్షేమ పథకాల గురించి ‘గడప గడపకు మన ప్రభుత్వం’ అనే కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యల పరిష్కారానికి నిధులు మంజూరు చేస్తున్నారు. అంతే కాదు ప్రజలకు తమ ప్రభుత్వం చేస్తున్నా అభివృద్ది గురించి ప్రజా ప్రతినిధులు వివరిస్తున్నారు. ఈ కార్యక్రమం మంచి సక్సెస్ అయ్యిందని.. ప్రజలు తమపై పూర్తి విశ్వాసం ఉంచారని అధికార పార్టీ నేతలు అంటున్నారు.  మరోవైపు ప్రతిపక్ష నేతలు అధికార పార్టీపై పలు విమర్శలు గుప్పిస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు. తాజాగా ఏపీ ప్రజలకు మరో గుడ్ న్యూస్ చెప్పారు సీఎం జగన్. వివరాల్లోకి వెళితే..

ఏపీ సీఎం జగన్ మహిళలకు మరో శుభవార్త చెప్పారు. ఇటీవల వరుస సంక్షేమ పథకాలు అమలు చేస్తూ వస్తున్న ఆయన మరో సంక్షేమ పథకం నిధులు రిలీజ్ చేసేందుకు సిద్దమయ్యారు. అదే వైఎస్సార్ చేయూత పథకం నిధులు. వైసీపీ చేయూత నిధులు జమ కార్యక్రమాన్ని మార్చి 7న రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనుంది. అనకాపల్లి పిసినికాడలో జరిగే బహిరంగ సభలో సీఎం జగన్ బటన్ నొక్కి లబ్దిదారుల ఖాతాల్లో నగదు జమ చేస్తారు. ఈ మేరకు షెడ్యూల్ ఖరారయ్యింది. జగన్ సభకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పథకం కింత ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ కులాలకు చెందిన 45 నుంచి 60 ఏళ్ల లోపు మహిళల ఖాతాల్లో రూ.18,750 చొప్పున జమ చేయనున్నారు.

ఇప్పటికే మూడు విడతలుగా ఇవ్వగా.. చివరి విడత నిధులను 7న జమ చేయనున్నారు. ఆదాయపు పన్ను చెల్లించని, 3 ఎకరాల తడి భూమి లేదా 10 ఎకరాల పొడి భూమి మించని వారు ఈ పథకానికి అర్హులు. ఇక చేయూత పథకం ద్వారా 31 లక్షల 23 వేల 466 మంది మహిళలు లబ్దిదారులుగా ఉండగా.. ఇప్పటి వరకు ఈ పథకం ద్వారా 14,129 కోట్లు అందించారు. వైఎస్సార్ చేయూత లబ్దిదారులకు నిధులను మహిళలకు వాలంటీర్లు అందించనున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు 78.94 లక్షల మందికి వైఎస్సార్ ఆసరా ద్వారా ఏపీ ప్రభుత్వం డ్వాక్రా రుణమాఫీ చేసింది.