iDreamPost
android-app
ios-app

YSR Rythu Bharosa: మన ప్రభుత్వం వేసిన ప్రతీ అడుగు రైతుల అభివృద్ధి కోసమే: CM జగన్

వరుసగా ఐదో ఏడాది.. వైఎస్సార్‌ రైతు భరోసా పెట్టుబడి సాయం సొమ్మును రైతుల ఖాతాల్లో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జమ చేశారు. రబీ 2021–22, ఖరీఫ్‌–2022 సీజన్లకు గాను అర్హులైన రైతు కుటుంబాలకు సున్నా వడ్డీ రాయితీ సొమ్మును కూడా చెల్లించారు

వరుసగా ఐదో ఏడాది.. వైఎస్సార్‌ రైతు భరోసా పెట్టుబడి సాయం సొమ్మును రైతుల ఖాతాల్లో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జమ చేశారు. రబీ 2021–22, ఖరీఫ్‌–2022 సీజన్లకు గాను అర్హులైన రైతు కుటుంబాలకు సున్నా వడ్డీ రాయితీ సొమ్మును కూడా చెల్లించారు

YSR Rythu Bharosa: మన ప్రభుత్వం వేసిన ప్రతీ అడుగు రైతుల అభివృద్ధి కోసమే: CM జగన్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నవరత్నాల పేరుతో రాష్ట్రాంలరో నవశకం ప్రారంభించారు. అనేక అధ్భుతమైన పథకాలతో ప్రజల మదిలో ప్రత్యేక స్థానం పొందారు. అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా సీఎం జగన్..తన పాలనను సాగిస్తున్నారు. ఇప్పటికే పేద,బడుగు, బలహీన వర్గాల వారికి డీబీటీ ద్వారా వారి ఖాతాల్లో నిధులు జమ చేశారు. అలానే రైతులు, రైతు కూలీల అభివృద్ధికి సీఎం జగన్ కృషి చేశారు. తాజాగా వైఎస్సార్ రైతుభరోసా ఐదో విడత నిధులను విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుటుందని తెలిపారు.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి వైఎస్సార్ రైతు భరోసా పెట్టుబడి సాయం నిధులను రైతుల ఖాతాల్లోకి జమ చేశారు. క్యాంప్ కార్యాలయం నుంచి బటన్ నొక్కి నిధులను జమ చేశారు. వరుసగా ఐదో ఏడాది కూడా వైఎస్సార్ రైతు భరోసా ఆర్థిక సాయాన్ని రైతు ఖాతాల్లో జమ చేశారు. అదే విధంగా రబీ 2021–22, ఖరీఫ్‌–2022 సీజన్లకు గాను అర్హులైన రైతు కుటుంబాలకు సున్నా వడ్డీ రాయితీ సొమ్మును కూడా చెల్లించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం రైతుల చేసిన మంచి గురించి వివరించారు.

సీఎం జగన్ మాట్లాడుతూ.. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుటుంది. వరుసగా ఐదో ఏడాది కూడా రైతు భరోసా అందించాం. మొత్తంగా  53.58 లక్షల మంది రైతన్నల ఖాతాల్లో  రూ.1,078.36 కోట్ల జమ చేశాము. అదే విధంగా కౌలు రైతులు, అటవీ, దేవదాయ భూముల సాగు రైతులకు సాయం అందిస్తున్నాము. 57 నెల్లలో రైతు భరోసా  కింద అందించిన మొత్తం రూ.34,288 కోట్లు.  మన ప్రభుత్వం రైతులు, రైతు కూలీలు బాగుండాలని ప్రతీ అడుగు వేశాం.  వందశాతం రైతులకు  80 శాతం ఖర్చు రైతు భరోసా కింద కవర్ అయ్యింది.  పేద రైతుల పక్షపాత ప్రభుత్వం మనది. సున్నా వడ్డీ కింద కూడా రూ.215.98 కోట్లు విడుదల చేస్తున్నాం. అలానే ప్రతీ అడుగులనూ రైతన్నలకు తోడుగా నిలుస్తున్నాం.

ప్రతీ పథకం దాదాపుగా పేద రైతు కుటుంబానికి అందుబాటులో ఉంచడం జరిగింది. రైతు కష్టం తెలిసిన ప్రభుత్వంగా  ఈ ఐదేళ్లలో ణుందుకు సాగాము. 19 లక్షల మంది రైతులకు 9 గంటల పాటు నాణ్యమైన కరెంటు ఇస్తున్నాం.  గత ప్రభుత్వానికి, మన ప్రభుత్వానికి మధ్య తేడాను ప్రజలు గమనించాలి.  రైతులను బాబు ఘోరంగా మోసం చేశారు.   మనం ఈ ఐదేళ్లలో వైయస్సార్‌ రైతు భరోసా కింద రూ.34వేల కోట్లు ఇచ్చాం. ధాన్యం కొనుగోలుకోసం రూ.65 కోట్లు ఖర్చు చేశాం. ఇదికాక రూ.1.2 లక్షల కోట్లు రైతున్నలకు వివిధ పథకాలు ద్వారా అందించాం” అని సీఎం జగన్ అన్నారు. మరి.. సీఎం జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.