iDreamPost
android-app
ios-app

విజయవాడ: ఏ-కన్వెన్షన్‌లో YSR అవార్డుల ప్రదానోత్సం.. 7 రంగాల్లో

  • Published Nov 01, 2023 | 1:34 PM Updated Updated Nov 01, 2023 | 1:34 PM

రాష్ట్రవ్యాప్తంగా వివిధ రంగాల్లో విశిష్ట సేవలు చేసిన వారికి జగన్‌ సర్కార్‌ మూడేళ్ల నుంచి వైఎస్సార్‌ అవార్డులు ప్రదానం చేస్తోన్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా ఈ ఏడాది కూడా పలువురుకి అవార్డులు ప్రదానం చేశారు. ఆ వివరాలు..

  • Published Nov 01, 2023 | 1:34 PMUpdated Nov 01, 2023 | 1:34 PM
విజయవాడ: ఏ-కన్వెన్షన్‌లో YSR అవార్డుల ప్రదానోత్సం.. 7 రంగాల్లో

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వరుసగా మూడో ఏడాది కూడా వైఎస్సార్‌ అవార్డులు అందజేసింది. ఏపీ అవతరణ దినోత్సవం సందర్భంగా.. వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారికి గత మూడేళ్ల నుంచి వైఎస్సార్‌ లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్‌, అచీవ్‌మెంట్‌ అవార్డులను అందిస్తోంది. దీనిలో భాగంగా ఈ ఏడాదికి గాను 27 మంది వ్యక్తులు, సంస్థలకు బుధవారం నాడు ఈ పురస్కారం ప్రదానం చేశారు. ఏపీ అవతరణ దినోత్సవం సందర్భంగా విజయవాడ ఏ కన్వెనషన్‌ సెంటర్‌లో ఇందుకు సంబంధించిన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ అవార్డుల ప్రదానోత్సవానికి గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ ముఖ్య అతిథిగా హాజరుకాగా.. సీఎం జగన్‌ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఆయా రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారికి గవర్నర్‌, సీఎం చేతులు మీదుగా అవార్డులు ప్రదానోత్సం చేశారు.

వ్యవసాయం, ఆర్ట్‌ అండ్‌ కల్చర్‌, తెలుగు భాష-సాహిత్యం, క్రీడలు, వైద్యం, మీడియా, సమాజ సేవ వంటి వివిధ రంగాల్లో విశేషమైన సేవ చేసిన సుమారు 27 మంది వ్యక్తులు, సంస్థలకు అవార్డులు ప్రదానం చేశారు. వీటిలో 23 వైఎస్సార్‌ లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డులు కాగా.. మరో 4 వైఎస్సార్‌ అచీవ్‌మెంట్‌ అవార్డులు. గవర్నర్‌, సీఎం చేతులు మీదుగా ఈ అవార్డులను అందుకున్నారు.