iDreamPost
android-app
ios-app

CM జగన్ సంచలన ప్రకటన.. అమ్మ ఒడి నగదు పెంపు! ఎంతంటే..

YS Jagan, Amma Vodi Scheme: ఏపీ ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన 'అమ్మ ఒడి' పథకం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ స్కీమ్ ద్వారా ఎంతో మంది విద్యార్థులు చదువుకునేందుకు ఆర్థిక సాయం అందుతోంది. తాాజాగా వైఎస్సార్ సీపీ మేనిఫెస్టో 2024 విడుదల సందర్భంగా అమ్మ ఒడి పథకంపై సీఎం వైఎస్ జగన్ సంచలన ప్రకటన చేశారు.

YS Jagan, Amma Vodi Scheme: ఏపీ ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన 'అమ్మ ఒడి' పథకం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ స్కీమ్ ద్వారా ఎంతో మంది విద్యార్థులు చదువుకునేందుకు ఆర్థిక సాయం అందుతోంది. తాాజాగా వైఎస్సార్ సీపీ మేనిఫెస్టో 2024 విడుదల సందర్భంగా అమ్మ ఒడి పథకంపై సీఎం వైఎస్ జగన్ సంచలన ప్రకటన చేశారు.

CM జగన్ సంచలన ప్రకటన.. అమ్మ ఒడి నగదు పెంపు! ఎంతంటే..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మేనిఫెస్టో 2024ను విడుదల చేశారు. శనివారం ఉదయం తాడేపల్లి వైఎస్సార్ సీపీ కేంద్రం కార్యాలయంలో ఈ మేనిఫెస్టోను సీఎం జగన్ విడుదల చేశారు. వైఎస్సార్ సీపీ విడుదల చేసే మేనిఫెస్టో గురించి అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. ఇప్పటికే 2019 ఎన్నికల్లో అన్ని పార్టీలకు భిన్నంగా వైఎస్ జగన్ మేనిఫెస్టోను ప్రకటించిన సంగతి తెలిసిందే. 2024  ఎన్నికలకు ఏ విధమైన మేనిఫెస్టోతో సీఎం జగన్ వస్తారని అందరూ ఎంతో ఆసక్తి ఎదురు చూశారు. ఈ క్రమంలోనే అనేక కీలక విషయాలను ప్రస్తావిస్తూ.. మేనిఫెస్టోను సీఎం జగన్ ప్రకటించారు. ఇందులో అమ్మ ఒడి విషయంపై కీలక ప్రకటన చేశారు. అమ్మ ఒడిని పెంచుతున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు.

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  2019 ఎన్నికల సమయంలో నవరత్నాల పేరుతో ప్రజల్లోకి వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో అనేక హామీలు ఇచ్చి.. అధికారంలోకి వచ్చిన తరువాత అమలు చేశారు. అలా తన 58 నెలల పాలన కాలంలో 99 శాతం ఇచ్చిన హామీలను నిరవేర్చిన ఘన సీఎం జగన్ కే చెందుతుంది. ఇక విద్యా, వైద్య రంగంలో సీఎం జగన్ తీసుకొచ్చిన సంస్కరణ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గతంలో ఏ పాలకుడు చేయని విధంగా విద్యా వ్యవస్థలో తనదైన మార్క్ ను చూపించారు సీఎం జగన్. సీఎం జగన్ విద్యారంగంలో ప్రవేశ పెట్టిన స్కీమ్స్ లో అతిముఖ్యమైనది అమ్మఒడి. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వానికి రానికి రానీ ఆలోచనను.. సీఎం జగన్ సృష్టించారు. ఈ స్కీమ్ ద్వారా ఎంతో మంది పేదల పిల్లల చదువుకు ఆర్థిక సాయం అందిస్తున్నారు. విద్యార్థుల తల్లుల ఖాతాల్లో  ఏడాదికి రూ.15 వేలను జమ చేస్తున్నారు. ఇలా తన ఐదేళ్ల పాలనలో సీఎం జగన్ సక్సెస్ ఫుల్ గా తన పథకాలను అమలు చేశారు.

తాజాగా 2024 ఎన్నికలకు సంబంధించి వైఎస్సార్ సీపీ మేనిఫెస్టోను సీఎం జగన్ విడుదలే చేశారు. ఈ సందర్భంగా ఆయన అనేక విషయాలను ప్రస్తావించారు. మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో అమ్మ ఒడి పథకంపై సీఎం జగన్ సంచలన ప్రకటన చేశారు. తాము అమ్మ ఒడి పథకం కింద ఇచ్చే నగదను పెంచుతున్నట్లు సీఎం జగన్ తెలిపారు. ఇప్పటి వరకు అమ్మ ఒడి పథకం కింద రూ.15 వేలు ఇస్తున్న సంగతి తెలిసిందే. మరో రెండు వేలు పెంచుతూ.. రూ.17 ఇస్తామని సీఎం జగన్ తెలిపారు. అలానే వైఎస్ఆర్ చేయూతను కొనసాగిస్తామని తెలిపారు. ఐదేళ్లలో రూ.1,50,000 వరకు పెంచుతామన్నారు.

అదే విధంగా కాపు నేస్తాన్ని రూ.1,20,000 వరకు, ఈబీసీ నేస్తం రూ.లక్షా ఐదు వేల వరకు పెంచుతామని ప్రకటించారు. అలానే  రెండు విడతల్లో పెన్షన్ రూ.3,500 వరకు పెంచుతామని సీఎం జగన్ తెలిపారు. వైఎస్సార్ సున్నా వడ్డీ కింద రూ.3 లక్షల రుణం, వైఎస్సార్ కళ్యామస్తు, వైఎస్సార్ షాదీ తోఫా కొనసాగింపు, అర్హులైన ఇళ్ల స్థలాలు లేని వాళ్లందరికీ ఇళ్లు ఇస్తామని సీఎం జగన్ తెలిపారు. మొత్తంగా పేదలకు ఇళ్లు, నాడు-నేడు, సామాజిక భద్రత ప్రధానాంశాలుగా వైఎస్సార్ సీపీ మేనిఫెస్టో ఉంది.