Arjun Suravaram
Memantha Siddham Day-11: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా 'మేమంతా సిద్ధం' పేరుతో చేపట్టిన బస్సుయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ బస్సు యాత్ర సోమవారం పదకొండవ రోజు పల్నాడు జిల్లాలో కొనసాగింది.
Memantha Siddham Day-11: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా 'మేమంతా సిద్ధం' పేరుతో చేపట్టిన బస్సుయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ బస్సు యాత్ర సోమవారం పదకొండవ రోజు పల్నాడు జిల్లాలో కొనసాగింది.
Arjun Suravaram
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల సమరంలో దూసుకెళ్తున్నారు. ‘మేమంతా సిద్ధం’ పేరుతో బస్సు యాత్రను ప్రారంభించి ప్రజల్లోకి వెళ్లారు. సీఎం జగన్ చేపట్టిన ఈ బస్సు యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఇప్పటికే రాయలసీమ జిల్లాల్లో ఈ బస్సుయాత్ర విజయవంతంగా సాగింది. ఇప్పటికే దక్షిణ కోస్తా ప్రాంతాలైన నెల్లూరు, ప్రకాశం జిల్లాలో ఈ బస్సు యాత్ర పూర్తైంది. సోమవారం 11వ రోజు పల్నాడు జిల్లాలో సీఎం జగన్ చేపట్టిన మేమంత సిద్ధం బస్సు యాత్ర కొనసాగింది. మరి.. 11వ రోజు పల్నాడు జిల్లాలో జరిగిన మేమంత సిద్ధం యాత్ర వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించిన మేమంతా సిద్ధం బస్సుయాత్ర సోమవారం 11వ రోజూ పల్నాడు జిల్లాలో కొనసాగింది. సోమవారం ఉదయం 9 గంటలకు వెంకటాచలంపల్లి వద్ద నుంచి బస్సుయాత్ర ప్రారంభమైంది. అక్కడ ఉదయం 9.30 గంటలకు సామాజిక పింఛన్ లబ్ధిదారులతో జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొన్నారు. వారికి ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాల గురించి వివరించారు.
పెన్షన్ లబ్ధిదారులతో సీఎం జగన్ మాట్లాడుతూ.. “మీ బిడ్డకు అబ్దద్దాలు చెప్పడం రాదు. మోసాలు చేయడం రాదు. జనాభా ప్రకారం అత్యధిక పెన్షన్లు ఇస్తున్న రాష్టం మనదే. చంద్రబాబు మోసం చేసేందుకు ఎంతైనా ఇస్తానంటాడు. 2014లో చంద్రబాబు హామీలిచ్చి మోసం చేశారు.చంద్రబాబుకు ఓటు వేస్తే పులి నోట్లో తలపెట్టినట్లే. చంద్రబాబు చేసి పనితో అవ్వాతాతలు ఇబ్బంది పడ్డారు” అని సీఎం జగన్ తెలిపారు.
ఇక ఈ ముఖాముఖి కార్యక్రమం అనంతరం బొదనంపాడు, కురిచేడు, చింతల చెరువు మీదుగా వినుకొండ అడ్డరోడ్డుకు చేరుకున్నారు. కురిచేడుగ్రామంలో సీఎం సీఎం అంటూ స్థానిక ప్రజలు,వైసీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఇక ఈ యాత్రకు ఎండను సైతం లెక్క చేయకుండా సీఎం జగన్ బస్సు యాత్రకు భారీ సంఖ్యలో జనం హాజరయ్యారు. ఇక సీఎం జగన్ కి అడుగడుగునా జననీరాజనాలు పలికారు. దారి పొడవునా గజమాలలతో స్థానిక ప్రజలు, వైసీపీ నేతలు సీఎం జగన్ కి అపూర్వ స్వాగతం పలికారు.
ఇక వినుకొండ పట్టణంలోకి సీఎం జగన్ ఎంట్రితో ఆ ప్రాంతమంతా జనసునామి తలపించింది. వినుకొండలో రోడ్డు షో అనంతరం కనమర్లపూడి, శావల్యాపురం మీదుగా గంటావారిపాలెంకి చేరుకుని..అక్కడ రాత్రికి బస చేయనున్నారు. ఇక పల్నాడు జిల్లాలో సాగిన సీఎం జగన్ బస్సుయాత్రలో సంక్షేమ పథకాలు, వివిధ రకాలుగా సాయం పొందిన వారు సీఎం జగన్ ను కలిసి..తమ కృతజ్ఞతలు తెలియజేశారు. పలు గ్రామాల్లోని ప్రజలు సీఎం జగన్ కు పూలు చల్లుతూ, గజమాలతో ఆత్మీయ స్వాగతం పలికారు. ఇలా 11వ రోజు సీఎం జగన్ బస్సుయాత్ర పల్నాడు జిల్లాలో విజయవంతంగా సాగింది.