iDreamPost
android-app
ios-app

YS జగన్ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. చిత్తూరు జిల్లాలో 7వ రోజు హైలెట్స్!

Memantha Siddham Day-7: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా 'మేమంతా సిద్ధం' పేరుతో చేపట్టిన బస్సుయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ బస్సు యాత్ర బుధవారం ఏడవ రోజు చిత్తూరు జిల్లాలో కొనసాగింది.

Memantha Siddham Day-7: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా 'మేమంతా సిద్ధం' పేరుతో చేపట్టిన బస్సుయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ బస్సు యాత్ర బుధవారం ఏడవ రోజు చిత్తూరు జిల్లాలో కొనసాగింది.

YS జగన్ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. చిత్తూరు జిల్లాలో 7వ రోజు హైలెట్స్!

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ‘మేమంతా సిద్ధం’ పేరుతో బస్సు యాత్రను ప్రారంభించారు. సీఎం జగన్ చేపట్టిన ఈ బస్సు యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు.  ఇప్పటికే  కడప, నంద్యాల, కర్నూలు, అనంతపురం, శ్రీసత్య సాయి, అన్నమయ్య జిల్లాల్లో ఈ బస్సుయాత్ర విజయవంతగా సాగింది. బుధవారం ఏడో రోజు  చిత్తూరు జిల్లాలో సీఎం జగన్ బస్సు యాత్ర కొనసాగింది. మరి.. ఏడో రోజు మేమంత సిద్ధం యాత్ర వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

బుధవారం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించిన మేమంతా సిద్ధం బస్సుయాత్ర ఏడో రోజు కొనసాగుతోంది. ఈ యాత్రకు ప్రజల నుంచి అపూర్వ స్పందన వస్తుంది. ఈ యాత్రలో జనం పెద్ద సంఖ్యలో పాల్గొన్ని సీఎం జగన్ కి అపూర్వ స్వాగతం పలుకుతున్నారు. బుధవారం ఉదయం9 గంటలకు పుంగనూరు నియోజకవర్గం సదుం మండలం అమ్మగారి పల్లె నుంచి యాత్ర ప్రారంభమైంది. సదుం, కల్లూరు మీదుగా చంద్రగిరి నియోజవర్గం లోని దామల చెరువు వరకు కొనసాగింది.  అనంతరం పూతలపట్టు నియోజవర్గంలోని తలుపుల పల్లి మీదుగా తేనెపల్లికి చేరుకున్నారు.   సాయంత్రం 3 గంటలకు పూతలపట్టు బైపాస్  దగ్గర బహిరంగ సభలో పాల్గొన్ని సీఎం జగన్ ప్రసంగించారు.  అనంతరం శ్రీకాళహస్తి నియోజవర్గంలోని రేణిగుంట గరువరాజు పల్లెకు చేరుకుని రాత్రికి సీఎం జగన్ అక్కడే బస చేస్తారు. ఇక యాత్రలో భాగంగా సీఎం జగన్ కి అమ్మగారి పల్లిలో ప్రజానీకం ఘనస్వాగతం పలికారు. సదుం సర్కిల్ లో భారీగా  చేరుకున్న ప్రజలు, కార్యకర్తలు తీన్మార్ డ్యాన్స్ లతో సందడి చేశారు.

ఏడో రోజు బస్సుయాత్ర సందర్భంగా టీడీపీకి చెందిన పలువురు నేతలు సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. ఇక దారిపొడవును సీఎం జగన్ కి పెద్ద ఎత్తన ప్రజలు స్వాగతం పలికారు. పెరాలసిస్ తో బాధపడుతున్న ముఖేస్ అనే యువకుడి కుటుంబం సీఎం జగన్ ని కలసి తమ బాధను వ్యక్తం చేశారు. వారి పరిస్థితి అర్థం చేసుకుని ప్రభుత్వం ఆదుకుంటుందని సీఎం జగన్ భరోసా ఇచ్చారు. ఇక కల్లూరు  చేరుకున్న సీఎం జగన్ కి స్థానిక మహిళలు హారతలు ఇచ్చారు. దామల చెరువు వద్ద పదుల సంఖ్యలో గుమ్మడికాయలతో దిష్టి తీసి సీఎం జగన్ కి మహిళలు స్వాగతం పలికారు. అలానే సుమారు 20 క్రేన్లతో భారీ గజాలలు ఏర్పాటు చేసి సీఎం జగన్ కి స్వాగతం పలికారు. ఇలా ఏడో రోజు సీఎం జగన్ పర్యటన చిత్తూరు జిల్లాలో విజయవంతంగా సాగింది.