iDreamPost
android-app
ios-app

YS జగన్ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. శ్రీకాకుళం జిల్లా 22వ రోజుహైలెట్స్!

Memantha Siddham Day-22: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా 'మేమంతా సిద్ధం' పేరుతో చేపట్టిన బస్సుయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఈ బస్సు యాత్ర బుధవారం 22వ రోజు శ్రీకాకుళం జిల్లాలో సాగింది. నేటితో సీఎం జగన్ చేపట్టిన బస్సుయాత్ర ముగిసింది.

Memantha Siddham Day-22: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా 'మేమంతా సిద్ధం' పేరుతో చేపట్టిన బస్సుయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఈ బస్సు యాత్ర బుధవారం 22వ రోజు శ్రీకాకుళం జిల్లాలో సాగింది. నేటితో సీఎం జగన్ చేపట్టిన బస్సుయాత్ర ముగిసింది.

YS జగన్ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. శ్రీకాకుళం జిల్లా 22వ రోజుహైలెట్స్!

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి త్వరలో జరగనున్న ఎన్నికల రణరంగంలో దూసుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే ‘మేమంతా సిద్ధం’ పేరుతో ఎన్నికల ప్రచారంతో ప్రతిపక్షాలకు చెమటలు పట్టిస్తున్నారు. సీఎం జగన్ చేపట్టిన బస్సు యాత్రకు అపూర్వ స్పందన లభించింది. ఈయాత్ర ద్వారా తాను అందించిన సంక్షేమ పథకాలను, పాలన గురించి ప్రజలకు వివరించి.. అలానే వారి సమస్యలు తెలుసుకుని పరిష్కారం చూపిస్తున్నారు. ‘మేమంతా సిద్ధం’యాత్రకు అన్ని జిల్లాల ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. బుధవారం 22వ రోజు శ్రీకాకుళం జిల్లాలో సీఎం జగన్ చేపట్టిన ‘మేమంత సిద్ధం’ బస్సు యాత్ర కొనసాగింది. మొత్తంగా 22 రోజుల పాటు 2100 కిలో మీటర్ల మేర సీఎం జగన్ బస్సు యాత్ర సాగింది.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  మేమంత సిద్ధం బస్సుయాత్రలో భాగంగా బుధవారం ఉదయం అక్కివలస నుంచి  బయలు దేరారు.  అంతేకాక నేటితో  22 రోజుల పాటు సాగిన బస్సు యాత్ర ముగిసింది. ఇక బుధవారం ఉదయం 9 గంటలకు అక్కివలస నుంచి ప్రారంభమైన బస్సుయాత్ర ఎచ్చెర్ల, శ్రీకాకుళం బైపాస్, నరసన్న పేట బైపాస్ , కోటబొమ్మాళి, కన్నెవలస మీదుగా పరశురాంపురం జంక్షన్  వద్దకు చేరుకుంది. అక్కడ భోజన విరామం అనంతరం కె.కొత్తూరు మీదుగా టెక్కలి వద్దకు చేరుకున్నారు. సాయంత్రం 3 గంటలకు అక్కడ నిర్వహించే బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొన్ని ప్రసంగించారు.

YS jagan bus yatra

ఇక 22వ రోజు సీఎం జగన్ బస్సు యాత్రకు  దారిపొడవునా జై జగన్ అంటూ  జనం నినాదాలు చేశారు. దారిపొడవునా సీఎం జగన్ కి మహిళలు హారతలు పట్టారు. అభిమాన నేతను చూసేందుకు ఎండను సైతం లెక్కజేయకుండా జనం తరలి వచ్చారు. అక్కవరం సభలో సీఎం జగన్ అదిరిపోయే స్పీచ్ ఇచ్చారు. సీఎం మాట్లాడుతూ.. “అక్కవరంలో సిక్కొలు సింహాలు కనిపిస్తున్నాయి. సిక్కొలు జనంసింహాల్లా కదలివచ్చారు. జగన్ కి ఓటేస్తే పథకాలన్నీ ముందుకే వెళ్తాయి. అదే చంద్రబాబుకు వేస్తే మాత్రం పథకాలకు ముగింపే అవుతుంది. మూడు పార్టీల కూటమి మోసాలకు చెంపచెళ్లు మనేలా సమాధానం చెప్పాలి. ఇవి ఎమ్మెల్యేలను ఎన్నుకునేందుకు జరిగే ఎన్నికలు మాత్రమే కాదు. పేద ప్రజల గుండెచప్పుడే ఈ సిద్ధం సభ. ఈ యాత్ర వైఎస్సార్ సీపీ జైత్రయాత్రకు సంకేతం. ఇక్కడి జనసునామి చూస్తుంటే 25కు 25 ఎంపీలు,  175కు 175 ఎమ్మెల్యే స్థానాలు గెలవడం ఖాయం” అని సీఎం జగన్ అన్నారు.

మొత్తంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి చెపట్టిన ఈ బస్సుయాత్ర  22 రోజుల పాటు కొనసాగింది. ఈ 22 రోజుల పాటు 2100 కిలో మీటర్ల మేర ఈ బస్సుయాత్ర సాగింది. అలానే  ఈయాత్రలో 16 బహిరంగ సభల్లో సీఎం జగన్ పాల్గొన్నారు. 9చోట్ల భారీ రోడ్ షోల్లో నిర్వహించారు. ఇడుపులపాయలో ప్రారంభమై 86 నియోజవర్గాల మీదుగా మేమంత సిద్ధం బస్సుయాత్ర సక్సెస్ ఫుల్ గా సాగింది.