iDreamPost
android-app
ios-app

కర్నూలు: లా యూనివర్సిటీకి శంకుస్థాపన చేసిన CM జగన్‌

  • Published Mar 14, 2024 | 12:46 PM Updated Updated Mar 14, 2024 | 12:46 PM

National Law University: కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్న సీఎం జగన్‌ జాతీయ లా యూనివర్సిటీకి శంకుస్థాపన చేశారు. ఆ వివరాలు..

National Law University: కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్న సీఎం జగన్‌ జాతీయ లా యూనివర్సిటీకి శంకుస్థాపన చేశారు. ఆ వివరాలు..

  • Published Mar 14, 2024 | 12:46 PMUpdated Mar 14, 2024 | 12:46 PM
కర్నూలు: లా యూనివర్సిటీకి శంకుస్థాపన చేసిన CM జగన్‌

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేడు ఉమ్మడి కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముందుగా కర్నూలులో జాతీయ న్యాయ విశ్వ విద్యాలయానికి శంకుస్థాపన చేశారు. ఏపీలో ఇది రెండో జాతీయ లా యూనివర్సిటీ. కల్లూరు మండలం లక్ష్మీపురం జగన్నాథగుట్టపై ఈ లా యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నారు. సుమారుగా 150 ఎకరాల్లో.. రూ.1,011 కోట్ల రూపాయల వ్యయంతో దీన్ని నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్‌ భూమి పూజతో లా యూనివర్సిటీ భవన నిర్మాణ పనులను ప్రారంభించారు. లా వర్సిటీ పైలాన్‌​ ఆవిష్కరణ చేశారు.

అనంతరం సీఎం జగన్‌ మాట్లాడుతూ.. ‘‘అభివృద్ధి వీకేంద్రీకరణే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ ఉద్దేశం. హైదరాబాద్‌కు రాజధానిని తరలించే సమయంలోనే ఇక్కడ హైకోర్టు ఏర్పాటు చెయ్యాలని తీర్మానించాము. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తామని ఇది వరకే చెప్పాము. శ్రీబాగ్‌ ఒప్పందం ప్రకారం మా ప్రభుత్వం అడుగులేస్తుంది. శ్రీబాగ్ ఒడంబడికలో భాగంగా ఈ ప్రాంతానికి సరైన న్యాయం జరిగేందుకు నేషనల్ లా యూనివర్శిటి దోహదపడుతుంది. కర్నూలులో ఎన్‌హెచ్‌ఆర్‌సీ, లోకాయుక్త, హైకోర్టు భవనాలు నిర్మిస్తాం’’ అని తెలిపారు.

‘‘జాతీయ లా యూనివర్శిటి నిర్మాణానికి అడుగులు వేగంగా పడాలని కొరుతున్నాను. లా వర్సిటీ నిర్మాణం కోసం వెయ్యి కోట్లు కేటాయించాము. ఈ యూనివర్శిటితో పాటు న్యాయపరమైన అంశాలకు సంబంధించిన ఏపీ లీగల్ మొట్రాలజికల్ కమిషన్, లేబర్ కమిషన్, లేబర్ కమిషన్ , వ్యాట్ అప్పిలేట్ కమిషన్, వక్ఫ్ బోర్డు, మానవహక్కుల కమిషన్ ఏర్పాటు కానున్నాయని చెప్పడానికి సంతోషిస్తున్నాను. వీటి వల్ల ఈ ప్రాంతానికి మంచి జరగాలని కోరుతున్నాను’’ అన్నారు సీఎం జగన్‌.

నేడు సీఎం జగన్‌ ఉమ్మడి కర్నూలు జిల్లాలో పర్యటిస్తారు. లా యూనివర్సిటీ కార్యక్రమం ముగిశాక.. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో నంద్యాల జిల్లా బనగానపల్లెకు ప్రయాణం అవుతారు. ఆ తర్వాత అక్కడ ఏర్పాటు చేసిన వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం పథకం నగదు జమ కార్యక్రమంలో పాల్గొంటారు. మొత్తం 4, 19, 583 మంది ఖాతాల్లో రూ. 629.37 కోట్ల రూపాయలు జమ చేస్తారు. దాని కన్నా ముందు.. సభావేదిక వద్దకు చేరుకొని ఈబీసీ నేస్తం ఫొటో గ్యాలరీని ప్రారంభిస్తారు సీఎం జగన్‌. ఆతర్వాత బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం లబ్ధిదారుల ఖాతాల్లోకి బటన్‌ నొక్కి నగదు జమ చేస్తారు. కార్యక్రమం ముగిశాక మధ్యాహ్నాం 2.30గం ప్రాంతంలో.. ఓర్వకల్‌ ఎయిర్‌ పోర్టుకు చేరుకుని గన్నవరం బయలుదేరుతారు.