YS Jagan: ఎలక్షన్ కౌంటింగ్ కి ముందే జగన్ సంచలన నిర్ణయం.. కీలక నేతలకు పిలుపు!

దేశ ప్రజలందరి చూపు ఏపీ రాష్ట్రంలోని ఎన్నికల ఫలితాలపైనే ఉంది. ఈ నేపథ్యంలోనే రేపు కౌంటింగ్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కౌంటింగ్ కి ముందే ముఖ్యమంత్రి వైఎస్ జగన్  మోహన్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.

దేశ ప్రజలందరి చూపు ఏపీ రాష్ట్రంలోని ఎన్నికల ఫలితాలపైనే ఉంది. ఈ నేపథ్యంలోనే రేపు కౌంటింగ్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కౌంటింగ్ కి ముందే ముఖ్యమంత్రి వైఎస్ జగన్  మోహన్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.

రేపు దేశ వ్యాప్తంగా ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో అందరి చూపు కేంద్రంలో ఎవరు అధికారంలోకి వస్తారు అనే దానిపై కంటే.. ఏపీ ఫలితాలపైనే ఉంది. ఇక  ఫలితాలు వెలువడేందుకు కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. ఇక గంటలు గడుస్తున్న కొద్ది ఏపీ ఎన్నికల ఫలితాలపై అందరిలో ఉత్కంఠ పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంచల నిర్ణయం తీసుకుంటున్నారు. ఇప్పటికే పలువురు పార్టీ ముఖ్య నేతలను సీఎం జగన్ కలిసినట్లు సమాచారం. ఈ క్రమంలోనే పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

దేశ ప్రజలందరి చూపు ఏపీ రాష్ట్రంలోని ఎన్నికల ఫలితాలపైనే ఉంది. కారణంగా ఇక్కడ ఎన్నికలు జరిగిన తీరు..పోలైన ఎన్నికల శాతం. దేశంలోనే అత్యధికంగా ఏపీలో పోలింగ్ నమోదైంది. ఇది ఇలాంటి ఎగ్జిట్ పోల్స్ కూడా ఉంచాయి. ఎవరి అంచనాల ప్రకారం వారు పార్టీలకు సీట్లు ఇచ్చారు. కానీ ఎక్కువ  సంస్థలు మరోసారి వైఎస్సార్ సీపీ అధికారంలోకి వస్తుందని  తెలిపాయి. ఇది ఇలాంటే రేపు కౌంటింగ్ జరగనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్  మోహన్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. జూన్ 1న విడుదలైన ఎగ్జిట్ పోల్స్ అంచనాల పైన పార్టీ నేతలు జగన్ తో చర్చించారు. తాను గతంలో చెప్పిన ఫలితాలే రాబోతున్నాయని సీఎం జగన్ స్పష్టం చేశారు.  ఎన్నికల కౌంటింగ్ పై పార్టీ ముఖ్యనేతలకు పలు సూచనలు చేశారు. అదే సమయంలో ఎలక్షన్ రిజల్ట్ పై అంచనాలు..భవిష్యత్ కార్యాచరణ పైన సీఎం జగన్ దిశా నిర్దేశం చేశారు.

సీఎం వైఎస్ జగన్ కౌంటింగ్ వేళ ఈ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను జగన్ సీరియస్ గా తీసుకోలేదని సమాచారం. ఆయన మే13న జరిగిన  ఎన్నికలపై వరుసగా రెండు రోజులు సమీక్ష చేశారని సమాచారం.  అంతేకాక పలుమార్గాల్లో సమాచారం సేకరించి.. లోతుగా అధ్యయనం చేశారని టాక్. ఆ తరువాత ఒక నిర్ణయానికి వైఎస్ జగన్ వచ్చార తెలుస్తోంది. ఇటీవలే ఐప్యాక్ టీంతో జరిగిన సమావేశంలో గత ఎన్నికల కంటే ఎక్కువ సీట్లు ఈసారి సాధిస్తామని చెప్పిన విషయం తెలిసిందే. కౌంటింగ్ దగ్గర పడుతున్న ఇప్పటికీ జగన్ అదే అంచనాతో ఉన్నారు. ఎలాంటి ఆందోళన, అపోహలు అవసరం లేదని…ఖచ్చితంగా వైఎస్సార్ సీపీనే భారీ విజయం నమోదు రాబోతోందని జగన్ విశ్వాసం వ్యక్తం చేశారు.

రేపు ఎన్నికల ఫలితాలు వస్తుండటంతో…గెలిచిన పార్టీ ఎమ్మెల్యేలతో 6న తాడేపల్లిలో మీటింగ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కౌంటింగ్ తరువాత ప్రతీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్దులతో సహా అందరూ తాడేపల్లిలో అందుబాటులో ఉండాలని సీఎం జగన్ సూచించారు. అదే విధంగా ఇప్పటికే జూన్ 9న వైఎస్  జగన్ మోహన్ రెడ్డి రెండో సారి సీఎంగా ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు చేశారు ఆ పార్టీ నేతలు.  అలానే వేదికను కూడా విశాఖలోని ఏయూ గ్రౌండ్ గా ఖరారు చేశారు. దీంతో..అటు జగన్ విశ్వాసం..ఇటు ఎన్నికల ఫలితాల వేళ వైసీపీ శ్రేణుల్లో ఉత్కంఠ కొనసాగుతోంది.

Show comments