iDreamPost
android-app
ios-app

ఆర్టీసీ ఉద్యోగులకు సీఎం వైఎస్ జగన్ శుభవార్త! ప్రతినెలా జీతంతో పాటు అవి కూడా..

  • Published Dec 12, 2023 | 9:58 AM Updated Updated Dec 12, 2023 | 11:49 AM

తెలంగాణలో ఎన్నికలు ముగిశాయి.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇక ఏపీలో మరో నాలుగు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి.. ఈ నేేపథ్యంలోనే అధికార, ప్రతిపక్ష పార్టీలు ఓటర్లను ప్రసన్నం చేసుకునే దిశగా ముందుకు సాగుతున్నాయి.

తెలంగాణలో ఎన్నికలు ముగిశాయి.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇక ఏపీలో మరో నాలుగు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి.. ఈ నేేపథ్యంలోనే అధికార, ప్రతిపక్ష పార్టీలు ఓటర్లను ప్రసన్నం చేసుకునే దిశగా ముందుకు సాగుతున్నాయి.

ఆర్టీసీ ఉద్యోగులకు సీఎం వైఎస్ జగన్ శుభవార్త! ప్రతినెలా జీతంతో పాటు అవి కూడా..

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో ఎన్నికల జరగబోతున్నాయి. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలు వచ్చే ఎన్నికల్లో గెలుపు కైవసం చేసుకోవడానికి ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలు పెడుతున్నాయి. అధికార పార్టీ తాము చేసిన  సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్తే.. రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ని మరింత అభివృద్ది పథంలోకి తీసుకువెళ్తామని ఓటర్లకు భరోసా ఇస్తున్నారు. ఇక వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత గతంలో తాను ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ వస్తున్నారు. ముఖ్యంగా విద్య, వైద్య, వ్యవసాయ, మహిళా సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నారు. అంతేకాదు ప్రభుత్వ ఉద్యోగులకు సరికొత్త పథకాలు అమలు చేస్తూ వస్తున్నారు. గత ప్రభుత్వం చేయని పనులు తాము చేసి చూపిస్తున్నామని.. ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నామని అంటున్నారు. ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. వివరాల్లోకి వెళితే..

సంక్షేమ పథకాల అమలు విషయంలో ఏపీ ప్రభుత్వం ఎక్కడా తగ్గడం లేదు.  ఇప్పటి వరకు ఎన్నో సరికొత్త పథకాలు అమలు చేస్తూ వచ్చారు.  ఉద్యోగులకు సైతం వివిధ స్కీమ్స్ అమలు చేస్తున్నారు. తాజాగా ఏపీ సర్కార్ ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. జనవరి నుంచి జీతాలతో పాటు  అలవెన్సులను కూడా చెల్లించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలోనే ఆర్టీసీ ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారం పై ఫోకస్ పెట్టింది జగన్ సర్కార్. ఈ నేపథ్యంలనే ఆర్టీసీ ఎంప్లాయిస్ కి అలవెన్సుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. నైట్ అవుట్, డే అవుట్, ఓవర్ టైమ్ అలవెన్సులు ఆలస్యంగా చెల్లిస్తున్న విషయాన్ని దృష్టి ఉంచుకొని ఇకపై అలాటి జాప్యం చేయడానికి వీల్లేదని సీఎం జగన్ అధికారులతో అన్నట్లు వార్తలు వస్తున్నాయి. జీతంతో పాటు అన్ని అలవెన్సులు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు 2017 పీఆర్‌సీ బకాయిలు, స్టాఫ్ రిటైర్మెంట్ బెనిఫిట్ స్కీమ్ ట్రస్ట్ కి ఇవ్వాల్సిన డబ్బును ఉద్యోగులకు దశలవారీగా చెల్లించాలని నిర్ణయించినట్లు సమాచారం.

Good news forapsrtc employees

ఆర్టీసీ ఉద్యోగుల విషయంలో జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల తెలంగాణలో బీఆర్ఎస్ ఓటమికి ఒక రకంగా ఎంప్లాయీస్ కూడా కారణం అయి ఉండవొచ్చని ఏపీ సర్కార్ భావిస్తుంది. అందుకే ఉద్యోగులను మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. ఎన్నికల సమయంలో ఉద్యోగుల పాత్ర కీలకంగా ఉంటుందన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సీఎం జగన్ ఉద్యోగుల విషయంలో సానుకూలంగా ఉంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు మరో నాలుగు నెలల ఉంది.. ఈ నేపథ్యంలోనే ఏపీ సర్కార్ ఉద్యోగులకు అనుకూల నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా సీఎం జగన్ తీసుకున్న నిర్ణయంతో ఆర్టీసీ ఉద్యోగులు సంతోషంలో ఉన్నారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.