YS Jagan In Bheemili: ఈ అర్జునుడికి తోడు కృష్ణుడి లాంటి ప్రజలు ఉన్నారు: CM జగన్

ఈ అర్జునుడికి తోడు కృష్ణుడి లాంటి ప్రజలు ఉన్నారు: CM జగన్

YS Jagan In Bheemili: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమర శంఖారం పూరించారు. విశాఖపట్నం జిల్లా భీమిలి వేదికగా ఈ సభ జరిగింది. ఇక ఈ పబ్లిక్ మీటింగ్ లో సీఎం జగన్ తన పరిపాలన గురించి వివరిస్తునే చంద్రబాబు నాయుడిపై విరుచకపడ్డారు.

YS Jagan In Bheemili: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమర శంఖారం పూరించారు. విశాఖపట్నం జిల్లా భీమిలి వేదికగా ఈ సభ జరిగింది. ఇక ఈ పబ్లిక్ మీటింగ్ లో సీఎం జగన్ తన పరిపాలన గురించి వివరిస్తునే చంద్రబాబు నాయుడిపై విరుచకపడ్డారు.

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వాతావరణం మొదలైంది. అన్ని పార్టీలు గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి. 175 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా అధికార వైసీపీ దూసుకెళ్తోంది. ఇప్పటి వరకు అభ్యర్థులను ఖరారు చేసే పనిలో పడిన వైసీపీ అధిష్టానం..నేటి నుంచి ఎన్నికల సమరంలోకి దిగేసింది.  భీమిలో నిర్వహించిన సభ నుంచి ఎన్నికల సమరశంఖరావన్ని సీఎం జగన్ పూరించారు. ఇక ఈ సభ ద్వారా సీఎం జగన్  పార్టీ శ్రేణులకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. తాను అభిమాన్యుడని కాదని, అర్జునిడినంటూ సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ అర్జునుడికి కృష్ణుడి లాంటి ప్రజలు తోడు ఉన్నారని ఆయన చెప్పుకొచ్చారు.

విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గంలో సంగివలసలో భారీ బహిరంగ సభను వైఎస్సార్ సీపీ నిర్వహించింది. ఈ సభకు భారీ ఎత్తున పార్టీ శ్రేణులు, కార్యకర్తలు హాజరయ్యారు. ఇక ఈ సభలో సీఎం జగన్ అదిరిపోయే స్పీచ్  ఇచ్చారు. భీమిలిలో అటు సముద్రం, ఇటు జన సంద్రం కనిపిస్తోందని సీఎం అన్నారు.  “ఇక్కడ వచ్చిన ప్రతి అక్క చెల్లెమ్మల్లోనూ, ప్రతి అన్న, తమ్ముడిలోనూ అవ్వలోనూ నాకు సేనాధిపతులే కనిపిస్తున్నారు. ఇక ఈ ఎన్నికల సమరంలో ఇటువైపు పాండవ సైన్యం, అటువైపు కౌరవం సైన్యం ఉంది.  అక్కతడ పద్మ వ్యూహం పొంచి ఉంది.  అయితే ఆ పద్మవ్యూహంలో చిక్కుకుపోవడానికి ఇక్కడ ఉంది అభిమన్యుడు కాదు, అర్జునుడు. ఈ అర్జునుడికి తోడు కృష్ణుడి  లాంటి ప్రజలు తోడు ఉన్నారు.  ఈ  యుద్ధంలో చంద్రబాబుతో సహా అందరూ ఓడాల్సిందే. మరో 25 ఏళ్ల పాటు జైత్రయాత్రకు శ్రీకారం చుడుతున్నాం.

చంద్రబాబుకు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేదు. అందుకే దత్తపుత్రుడిని వెంట వేసుకుని తిరుగుతున్నాడు. గత  ఎన్నికల్లో  వచ్చిన 23 స్థానాలు కూడా టీడీపీకి రావు. మన మేనిఫెస్టోలు 99 శాతం హామీలను నిరవేర్చాం. 75 రోజుల్లో  ఎన్నికల యుద్ధం జరగబోతుంది.  ఆలోచన చేయండి. ప్రతి ఒక్కరి భుజస్కందాలపై బాధ్యత పెడుతున్నాను. ఈ యుద్ధం అబద్దానికి, నిజానికి మధ్య జరుగుతోంది. 56 నెలల కాలంలో సంక్షేమం, అభివృద్ధి చేసి చూపించాం. చంద్రబాబు ఏమి చేశాడో చెప్పానికి ఏమీ కనిపించదు. చేసింది ఏమి లేదు కాబట్టి ఆ పెద్ద మనిషి ఏమి చెప్పలేదు. మన ప్రభుత్వం అలా కాదు. ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చాం. ఇచ్చాపురం నుంచి కుప్పం వరకూ చంద్రబాబు చేసిందేమి లేదు. అదే మీ బిడ్డ ప్రతీ గ్రామానికి  సంక్షేమం అందించాడు. లంచాలు వివక్ష లేకుండా పారదర్శకంగా పాలన చేశాం.

నాడు నేడు ద్వారా ప్రభుత్వ బడుల రూపు రేఖలను మార్చాం. దిశ యాప్ ద్వారా మహిళలకు రక్షణ కల్పిస్తున్నాం. ప్రతి గ్రామనికి డిజిటల్ లైబ్రరీలు, బ్రాడ్ బ్యాండ్ లు తీసుకొచ్చాం. 14 ఏళ్ల చంద్రబాబు పాలనలో మంచి చేయాలనే ఆలోచన లేదు. ఎందుకంటే చంద్రబాబు, ఆయన బ్యాచ్ పెత్తందార్లు కాబట్టి. సకాలంలో ఎరువులు, విత్తనాలు అందుతున్నాయంటే గుర్తుకొచ్చేది మీ జగనే. రైతులకు ఉచిత విద్యుత్, సున్నావడ్డీ అందుతున్నాయంటే మీ జగనే గుర్తుకొచ్చేది. ఇక చంద్రాబాబు అయితే రుణమాఫీ చేస్తానని చెప్పి నిలువునా ముంచాడు. బీసీల తోకలు కత్తిరిస్తా ఖబడ్డార్ అని చంద్రబాబు అంటారు. అలా చేస్తే గ్రామాల్లో ఉన్న బీసీలు పట్టించుకుంటారా?. పేద సామాజిక వర్గాల అభ్యుతన్నతిలో చంద్రబాబు మార్క్ లేదు. అన్ని వర్గాల ప్రజలు మేలు చేసే ప్రభుత్వం మాది” అని సీఎం జగన్ తెలిపారు.

Show comments