YSR పెన్షన్ కానుక పెంపును ప్రారంభించిన CM జగన్!

YSR Pension: విశ్వసనీయతకు అర్థం చెబుతూ, మానవత్వానికి ప్రతిరూపంగా, పెన్షన్లు క్రమంగా రూ.3000 వరకూ పెంచుకుంటూ పోతామని ఇచ్చిన హామీని సీఎం జగన్ నిలబెట్టుకున్నారు. నేడు కాకినాడ నగరంలో పెన్షన్ పెంపు కార్యక్రమాన్ని ప్రారంభించారు.

YSR Pension: విశ్వసనీయతకు అర్థం చెబుతూ, మానవత్వానికి ప్రతిరూపంగా, పెన్షన్లు క్రమంగా రూ.3000 వరకూ పెంచుకుంటూ పోతామని ఇచ్చిన హామీని సీఎం జగన్ నిలబెట్టుకున్నారు. నేడు కాకినాడ నగరంలో పెన్షన్ పెంపు కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తనదైన పరిపాలనతో ప్రజల మదిలో సుస్థిర స్థానం సంపాదించారు. పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను అందిస్తూ..వారి కుటుంబాల్లో సంతోషాలు నింపారు. ఇక సీఎం జగన్..రాష్ట్రాభివృద్ధి, సంక్షేమ పథకాలు..రెండిటిని జోడెద్దెలుగా పరిగెత్తిస్తున్నాడు. ఇక విశ్వసనీయతకు, మాట ఇస్తే నిలబెట్టుకోవడంలో తండ్రీకి తగ్గ తనయుడిగా సీఎం జగన్ నిలిచారు. తాజాగా అవ్వా,తాతలకు ఇచ్చే పెన్షన్ విషయంలో కూడా ఇచ్చిన మాటలను నిలబెట్టుకున్నారు సీఎం జగన్. వైఎస్సార్ పెన్షన్ ను రూ.3000 వేలకు పెంచి.. ఈ నెల నుంచి అమలు చేస్తున్నారు. ఈ పెన్షన్ పెంపు కార్యక్రమాన్ని కాకినాడి వేదికగా సీఎం  జగన్ ప్రారంభించారు.

బుధవారం కాకినాడలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటించారు.  సీఎం జగన్ రాకతో కాకినాడ నగరం జనసంద్రమైంది. రోడ్ షో  ప్రజలు పూలు జల్లుతూ సీఎంకి ఘనంగా స్వాగతం పలికారు. కాకినాడలోని రంగరాయ మెడికల్ కాలేజ్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వెఎస్సార్ పెన్షన్  కానుకను ప్రారంభించారు. పెన్షన్ల మొత్తం రూ.1,967.34 కోట్ల మెగా చెక్ ను ఆవిష్కరించారు. అలానే కాకినాడ నగరంలో రూ.94 కోట్లతో నిర్మించిన పలు అభివృద్ధి పనులను వర్చువల్ విధానం ద్వారా ప్రారంభించారు. 66.34 లక్షల మందికి ఈ పెన్షన్ అందుతుంది. ఈ పెన్షన్ కోసం నెలకు రూ.2వేల కోట్లను ప్రభుత్వం ఖర్చు చేస్తుంది.

ఇక ఈ కార్యక్రమంలో సీఎం జగన్ మాట్లాడుతూ తమ ప్రభుత్వం పరిపాలన గురించి వివరించారు. అంతేకాక పెన్షన్ కోసం ప్రభుత్వం ఖర్చు చేస్తున్న నిధుల గురించి తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం  రూ.3 వేల పెన్షన్ పెంచామని తెలిపారు. పేదల జీవితాల్లో ఆనందం రావాలని, తమను తాము పోషించుకోలేని పరిస్థితి ఏ కుటుంబానికి రాకూడదని సీఎం జగన్ తెలిపారు. ఇక తమ ప్రభుత్వం 66.34 లక్షల మందికి మంచి జరిగేలా పెన్షన్ అందిస్తున్నామన్నారు. పెన్షన్ కోసం దాదాపుగా నెలకు రూ.2 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని, పండుగైనా, సెలవైనా ఒకటో తేదీనే ఠక్కున పెన్షన్ అందిస్తున్నామని సీఎం పేర్కొన్నారు.

ఇక ఇదే సమయంలో ప్రతిపక్ష చంద్రబాబుపై కూడా సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. బాబు పాలనలో పెన్షన్ కేవలం రూ.1000 మాత్రమే ఉండేదని, ఎన్నికల ముందు మీ జగన్ హామీ ఇవ్వకుండా ఉంటే చంద్రబాబు పెన్షన్ పెంచేవాడా? అని ప్రశ్నించారు. అర్హత ఉంటే చాలు కులం, మతం, పార్టీ చూడకూండా అందరికీ పెన్షన్ ఇస్తున్నామని సీఎం తెలిపారు. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో పెన్షన్ రూ.58 వేలు మాత్రమే ఇచ్చారని, మన ప్రభుత్వానికి తేడా గమనించాలని సీఎం జగన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అమ్మఒడి, రైతు భరోసా వంటి ఎన్నో పథకాలు చంద్రబాబు ప్రభుత్వంలో లేవని, మన ప్రభుత్వం వచ్చాకే ప్రారంభమయ్యాయని తెలిపారు. మరి.. సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రసంగంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments