P Krishna
P Krishna
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సతీసమేతంగా లండన్ పర్యటనకు వెళ్లారు. ఇది ఆయన వ్యక్తిగత పర్యటన అని తెలిపారు. సీబీఐ కోర్టు సీఎం జగన్, విజయ్ సాయి రెడ్డి విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో యూకే పర్యటనకు ప్లాన్ సిద్దం చేసుకున్నారు సీఎం జగన్. సెప్టెంబర్ 2, శనివారం సీఎం జగన్ సతీమణి భారతి తో కలిసి లండన్ బయలుదేరారు. అక్కడ చదువుకుంటున్న తమ పిల్లలను కలిసేందుకు వెళ్లిన విషయం తెలిసిందే. తాజాగా ముఖ్యమంత్రి జగన్ నేడు ఏపీకి చేరుకుంటున్నారు. ఈ మేరకు అధికారులు, నేతలు అన్ని ఏర్పాట్లు చేశారు.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లండన్ పర్యటన ముగిసింది. తన కూతుళ్లను కలిసేందుకు సతీమణి భారతితో కలిసి శనివారం ఏపీ నుంచి లండన్ కి బయలుదేరారు. పర్యటన ముగించుకొని నేడు రాత్రికి ఏపీకి చేరుకోనున్నారు. ఈ మేరకు వైసీపీ నేతలు, అధికారులు అన్ని ఏర్పాట్లను సిద్దం చేసుకున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. ఏపీలో నేడు టీడీపీ బంద్ కి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. స్కిల్ డెవలెప్‌మెంట్ స్కామ్ లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ని అరెస్ట్ చేసి 14 రోజులు రిమాండ్ కి పంపిన విషయం తెలిసిందే. చంద్రబాబు అరెస్ట్ కి నిరసనగా నేడు టీడీపీ ఏపీ బంద్ కి పిలుపునిచ్చింది.
ఇక సీఎం జగన్ విషయానికి వస్తే.. ఆగస్టు 28, 1996 నాడు భారతితో వివాహం జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు కూతుళ్ళు. పెద్దమ్మాయి హర్ష, చిన్న కూతురు వర్ష. లండన్ లో గ్రాడ్యుయేషన్ చేసారు. మొదటి నుంచి మీడియాకు దూరంగా ఉండే జగన్ ఇద్దరు కూతుళ్లు.. చదువుల్లో నెంబర్ వన్ గా ఉంటూ వచ్చారు. లండన్ లో తమ కూతుళ్లను చూసేందుకు సమయం దొరికినపుడు జగన్ దంపతులు వెళ్లి చూసి వస్తుంటారు. గత ఏడాది తమ పెద్ద కూతురు హర్షా గ్రాడ్యూయేషన్ కాన్వకేషన్ లో జగన్ దంపతులు పాల్గొన్నారు. ఇనీడ్స్ నుంచి డిస్టింక్షన్ లో పాసైన తన కూతురు గొప్పతనాన్ని పొగుడుతూ ట్విట్ కూడా చేశారు సీఎం జగన్.