iDreamPost
android-app
ios-app

CM Jagan: సీఎం జగన్ గుడ్ న్యూస్.. వారి ఒక్కొక్కరి ఖాతాల్లో రూ. 20 వేలు జమ

  • Published Dec 28, 2023 | 1:46 PM Updated Updated Dec 28, 2023 | 1:51 PM

ఆంధప్రదేశ్ లోని సుమారు 11 లక్షల మంది ఖాతాలో రేపు డబ్బులు జమ చేయనున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. భీమవరం పర్యటనలో భాగంగా బటన్ నొక్కి డబ్బులు జమ చేయనున్నారు. ఆ వివరాలు..

ఆంధప్రదేశ్ లోని సుమారు 11 లక్షల మంది ఖాతాలో రేపు డబ్బులు జమ చేయనున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. భీమవరం పర్యటనలో భాగంగా బటన్ నొక్కి డబ్బులు జమ చేయనున్నారు. ఆ వివరాలు..

  • Published Dec 28, 2023 | 1:46 PMUpdated Dec 28, 2023 | 1:51 PM
CM Jagan: సీఎం జగన్ గుడ్ న్యూస్.. వారి ఒక్కొక్కరి ఖాతాల్లో రూ. 20 వేలు జమ

అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజా సంక్షేమమే తన ప్రధాన ఏజెండగా.. ముందుకు సాగుతున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందేలా అనేక సంక్షేమ పథకాలను తీసుకువచ్చారు. అసమానతలు లేని సమాజం రావాలంటే.. అది కేవలం చదువు వల్లనే సాధ్యమవుతుందని భావించిన సీఎం జగన్.. అందుకోసం అనేక రకాల కార్యక్రమాలు ప్రవేశపెట్టారు. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చారు. అలానే వాటి రూపు రేఖలు మార్చడం కోసం నాడు నేడు కార్యక్రమాన్ని ప్రారంభించారు. వీటితో పాటు చదువుకునే విద్యార్థులకు ఆర్థిక సాయం అందజేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా గుడ్ న్యూస్ చెప్పారు సీఎం జగన్. రేపు అనగా శుక్రవారం నాడు వారి ఖాతాలో డబ్బులు జమ చేయనున్నారు. ఆ వివరాలు..

జగనన్న విద్యాదీవెన పథకం కింద జూలై-సెప్టెంబర్ త్రైమాసికానికి సంబంధించిన నిధులను రేపు అనగా శుక్రవారం నాడు లబ్ధిదారుల ఖాతాలో జమ చేయనున్నారు సీఎం జగన్. రేపు భీమవరం పర్యటనలో భాగంగా.. బటన్ నొక్కి ఆ డబ్బులను వారి ఖాతాల్లో జమ చేయనున్నారు. నేరుగా తల్లుల ఖాతాలో ఈ మొత్తం జమ కానుంది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని సుమారు 11 లక్షల మంది పేద విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. ఇక ఈ పథకం కోసం జగన్ సర్కార్ రూ.15,593 కోట్లు ఖర్చు చేస్తోంది.

సీఎం జగన్ పేద విద్యార్థులను ఆదుకోవడం కోసం.. జగనన్న విద్యా దీవెనతో పాటుగా వసతి దీవెన కింద.. హాస్టళ్లలో ఉంటూ చదువుకునే పేద విద్యార్థుల భోజన, వసతి ఖర్చుల కోసం ఇబ్బందిపడకుండా ఏటా రెండు విడతల్లో ఆర్థిక సాయం చేస్తోన్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్‌ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్‌ తదితర కోర్సులు చదువుకునే వారికి రూ.20 వేల చొప్పున ఆర్థిక‌ సాయం అందిస్తున్నారు.

తాజాగా విడుదల చేస్తున్న మొత్తంతో కలిపి.. ఇప్పటివరకు వైసీపీ ప్రభుత్వం.. జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన కింద రూ.15,593 కోట్లు ఖర్చుచేసింది. మొత్తం మీద నాలుగేళ్లలో విద్యారంగంపై జ‌గ‌న్ ప్రభుత్వం దాదాపుగా రూ.69,289 కోట్లు ఖర్చుచేసినట్లు అధికారులు వెల్లడించారు. ఇక ఈ త్రైమాసికానికి సంబంధించిన నిధులను ఈ నెల 29న విద్యార్దుల తల్లుల ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 11 లక్షలకు పైగా తల్లుల కాతాల్లో ఈ మొత్తాన్ని జమ చేయనున్నారు. ఈ మేరకు భీమవరంలో సీఎం జగన్ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్ల పై అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.