iDreamPost
android-app
ios-app

ఈ యుద్ధంలో చంద్రబాబు సహా అందరూ ఓడాల్సిందే : CM జగన్

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విశాఖ నుంచి ఎన్నికల శంఖారావం పూరించారు. భీమిలి నియోజవర్గం సంగివలస బహిరంగ సభలో చంద్రబాబుపై సీఎం జగన్ నిప్పులు చెరిగారు. చంద్రబాబుతో సహా అందరూ ఓడాల్సిందే అంటూ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు.

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విశాఖ నుంచి ఎన్నికల శంఖారావం పూరించారు. భీమిలి నియోజవర్గం సంగివలస బహిరంగ సభలో చంద్రబాబుపై సీఎం జగన్ నిప్పులు చెరిగారు. చంద్రబాబుతో సహా అందరూ ఓడాల్సిందే అంటూ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు.

ఈ యుద్ధంలో చంద్రబాబు సహా అందరూ ఓడాల్సిందే : CM జగన్

ఎన్నికల సమర శంఖరావాన్ని వైసీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి  వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పూరించారు. విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గంలోని సంగివలసలో నిర్వహించిన సభ నుంచి ఎన్నికల రణరంగంలోకి దిగారు. ఇక వైఎస్సార్ సీపీ తలపెట్టిన ఈ సభ జనసంద్రంగా మారింది. ఇక ఈ సభలో నుంచి సీఎం జగన్ పార్టీ శ్రేణులకు, కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. అంతేకాక తన ప్రభుత్వం పరిపాలన విధానం గురించి విరవరించారు. అదే సమయంలో చంద్రబాబుపై కూడా తీవ్ర స్థాయిలో విరుచకపడ్డారు. రాబోయే ఎన్నికలు నిజానికి అబద్దానికి మధ్య జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.

భీమిలో నిర్వహించిన సభ నుంచి సీఎం జగన్ కీలక ప్రసంగం చేశారు.ఈ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, ఈ యుద్ధంలో 175కి 175 సీట్లు గెలుపే మన లక్ష్యమన్నారు. ఈ యుద్ధంలో చంద్రబాబు సహా అందరూ ఓడాల్సిందేనని సీఎం తెలిపారు. మరో 25 ఏళ్ల పాటు మన జైత్ర యాత్రకు శ్రీకారం చుడుతున్నామని సీఎం పేర్కొన్నారు. తమ మేనిఫెస్టోలో 99 శాతం హామీలను నెరవేర్చామని, చేసిన మంచిని నమ్ముకునే.. మీ బిడ్డ ఎన్నికలకు వెళ్తున్నాడుని సీఎం పేర్కొన్నారు. మరో 75 రోజుల్లోనే ఎన్నికలు. అబద్దానికి, నిజానికి మధ్య జరుగుతున్న యుద్ధం ఇదని ఆయన అన్నారు. గతంలో చంద్రబాబు 10 శాతం హామీలు కూడా నెరవేర్చలేదని, తమ మేనిఫెస్టో లోని ప్రతి హామీని నెరవేర్చామని ఆయన  స్పష్టం చేశారు. 56 నెలల కాలంలోనే సంక్షేమం, అభివృద్ధి చేసి చూపించామని, లంచాలు, వివక్ష లేకుండా పారదర్శకంగా పాలన చేశామని సీఎం జగన్ పేర్కొన్నారు.

ఇక మన ప్రభుత్వం ప్రతి గ్రామంలో విలేజ్ క్లినిక్, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తీసుకొచ్చాం. నాడు నేడు ద్వారా ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చాం. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. పేద పిల్లలకు ఇంగ్లీష్ చదువును అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. 3,527 ప్రొసీజర్లకు ఆరోగ్యశ్రీ ని విస్తరించామని సీఎం తెలిపారు. ఒక్క వైద్య రంగంలోనే 53 వేల కొత్త నియామకాలు చేపట్టామని పేర్కొన్నారు. అందుకే నేడు ఎక్కడ చూసినా వైఎస్ జగన్ మార్కే కనిపిస్తోందని, నామినేటెడ్ పదవుల్లో సగం పదవులు బలహీనవర్గాలకే ఇచ్చాం. స్థానిక సంస్థల పదవుల్లో సామాజిక న్యాయానికి పెద్దపీట వేశామని సీఎం జగన్ స్పష్టం చేశారు. తమ ప్రభుత్వంలో లంచాలు, వివక్ష లేకుండా రూ. 2 లక్షల 53 వేల కోట్లు నేరుగా లబ్ధిదారుల ఖాతాలో వేశామని సీఎం జగన్ పేర్కొన్నారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ..” అక్కచెల్లెమ్మలకు మేలు చేసిన ప్రభుత్వం మాది. 31 లక్షలకు పైగా ఇళ్ల పట్టాలు ఇచ్చాం. మీ జగన్ రైతు భరోసా ద్వారా రైతులను ఆదుకున్నాడు. సకాలంలో ఎరువులు, విత్తనాలు అందుతున్నాయంటే మీ జగనే గుర్తుకొచ్చేది. రైతులకు ఉచిత విద్యుత్, సున్నా వడ్డీ అందుతున్నాయంటే మీ జగనే గుర్తుకొచ్చేది. గత పదేళ్ల మీ బ్యాంకు ఖాతాలను చెక్ చేసుకోండి. చంద్రబాబు హయాంలో ఒక్క రూపాయి అయినా పడిందా ?. డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని అక్కచెల్లెమ్మలను చంద్రబాబు మోసం చేశారు. అన్నింటిలోనూ చంద్రబాబు మోసమే కనిపిస్తుంది. దళితులుగా ఎవరైనా పుట్టాలని అనుకుంటారా అని చంద్రబాబు అన్నారు” సీఎం జగన్ తెలిపారు.

ఇక ప్రజలను ఉద్దేశించి సీఎం జగన్ మాట్లాడుతూ.. మీరు వేసే ఓటు, పేదరికం నుంచి బయటకు చీసుకొచ్చే ఓటని చెప్పండి. ఎన్నికల ముందు ప్రతిపక్షాలు మోసపూరిత హామీలు ఇస్తాయని , మీ బిడ్డకు అబద్దాలు చెప్పడం, మోసాలు చేయడం తెలియదని సీఎం జగన్ అన్నారు. ఒంటరి పోరాటానికి నేను సిద్ధం.. మీరు సిద్ధమా? అంటూ ప్రతిపక్షాలకు సీఎం జగన్ సవాల్ విసిరారు. దుష్టచతుష్టయాన్ని.. గజదొంగల ముఠాని ఓడించడానికి మీరు సిద్ధమా? ప్రజలను ఉద్దేశించి తెలిపారు. దుష్టచతుష్టయం సోషల్ మీడియాలో చేసే దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టాలని, మన టార్గెట్ 175 కు 175 అసెంబ్లీ, 25 కు 25 ఎంపీ స్థానాలు గెలవడమేనని సీఎం పేర్కొన్నారు.