SNP
ఏపీ ప్రజలకు జగన్ ప్రభుత్వం మరో గుడ్‌న్యూస్ చెప్పింది. 6 నెలల పాటు అందరికీ ఉచితంగా సేవలు అందించాలని డిసైడ్ అయింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మీ కోసం..
ఏపీ ప్రజలకు జగన్ ప్రభుత్వం మరో గుడ్‌న్యూస్ చెప్పింది. 6 నెలల పాటు అందరికీ ఉచితంగా సేవలు అందించాలని డిసైడ్ అయింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మీ కోసం..
SNP
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనను పరుగులు పెట్టిస్తున్నారు. ఒకవైపు సంక్షేమ పథకాలను అమలు చేస్తూనే, మరోవైపు విద్య, వైద్యం లాంటి వాటి మీద కూడా ఫుల్ ఫోకస్ చేస్తున్నారు. ఆయన కృషికి తగ్గట్లే అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర ప్రజలకు జగన్ సర్కారు మరో గుడ్‌న్యూస్ చెప్పింది. ఆరోగ్యానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్న ఏపీ ప్రభుత్వం 6 నెలల పాటు భారీ ఎత్తున వైద్య శిబిరాలను నిర్వహించనుంది. సర్కారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ రెండో దశ ఇవాళ్టి నుంచే స్టార్ట్ కానుంది. మంగళవారం నుంచి గ్రామాల్లో ఈ కార్యక్రమం మొదలు కానుంది. వారానికి రెండ్రోజులు చొప్పున మంగళ, శుక్రవారాల్లో ‘ఆరోగ్య సురక్ష’ నిర్వహిస్తారు.
పట్టణాలు, నగరాల్లో ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ రెండో దశ కార్యక్రమం బుధవారం నుంచి స్టార్ట్ కానుంది. ఫస్ట్ ఫేజ్‌లో భాగంగా సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్‌లో 50 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున వైద్య శిబిరాలను నిర్వహించిన విషయం విదితమే. సెకండ్ ఫేజ్‌లో భాగంగా ఏపీవ్యాప్తంగా ఆరు నెలల్లో 13,954 సురక్షా శిబిరాలు నిర్వహించేందుకు వైద్యారోగ్య శాఖ ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా గ్రామాల్లో 10,032.. పట్టణాలు, నగరాల్లో 3,922 చొప్పున శిబిరాలను నిర్వహించాలని ప్లాన్ చేశారు. జనవరి నెలలో 3,583 వైద్య శిబిరాల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు అధికారులు. ఏపీవ్యాప్తంగా ప్రతి మండలంలో వారానికి ఓ గ్రామం, మున్సిపాలిటీల్లో వారానికి ఒక వార్డు చొప్పున అన్ని ప్రాంతాలను కవర్ చేసేలా సురక్షా శిబిరాలను నిర్వహిస్తారు. ‘జగనన్న ఆరోగ్య సురక్ష’లో భాగంగా నిర్వహించే వైద్య శిబిరాల్లో స్థానిక మెడికల్ ఆఫీసర్స్‌తో పాటు స్పెషలిస్ట్ డాక్టర్స్, పారామెడికల్ ఆప్తాల్మిక్ అసిస్టెంట్స్ అందుబాటులో ఉంటారు.
ప్రజలకు వారి సొంత ఊళ్లలో ప్రత్యేక వైద్య సేవలు అందించేందుకు 543 జనరల్ మెడిసిన్, 645 గైనకాలజిస్ట్, 349 జనరల్ సర్జన్, 345 ఆర్థోపెడిక్స్, 378 మంది ఇతర స్పెషలిస్ట్ డాక్టర్స్‌ను నియమించారు. అలాగే కంటి సమస్యల స్క్రీనింగ్ కోసం 562 మంది పారామెడికల్ ఆప్తాల్మిక్ ఆఫీసర్స్‌ను ప్రభుత్వం నియమించింది. వైద్య శిబిరాల్లో అవసరమైన అన్ని రకాల మందులతో పాటు ఎమర్జెన్సీ మెడిసిన్స్‌ను కూడా అందుబాటులో ఉంటాయి. మెడికల్ టెస్టుల కోసం ఏడు రకాల కిట్లు ఈ శిబిరాల్లో అందుబాటులో ఉంటాయి. ఈ శిబిరాల ద్వారా వైద్య సేవలు అందించడమే గాక బెటర్ ట్రీట్మెంట్ అవసరమైన వారిని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు రిఫర్ చేస్తారు. మరి.. 6 నెలల పాటు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.