CM Jagan: వాలంటీర్లకు జగన్ సర్కార్ శుభవార్త.. జనవరి నుంచి జీతాలు పెంపు

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తనదైన పాలన కొనసాగిస్తూ ప్రజా సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నారు. సీఎం గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వాలంటీర్ల వ్యవస్థ మొదలు పెట్టి ప్రతి పేదకు సంక్షేమ పథకాలు అందేలా చేస్తున్నారు.

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తనదైన పాలన కొనసాగిస్తూ ప్రజా సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నారు. సీఎం గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వాలంటీర్ల వ్యవస్థ మొదలు పెట్టి ప్రతి పేదకు సంక్షేమ పథకాలు అందేలా చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తనదైన పాలనతో ప్రజలకు బాగా దగ్గరయ్యారు. పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. ముఖ్యంగా విద్య, వైద్య, వ్యవసాయ, మహిళా సంక్షేమానికి పెద్ద పీట వేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలుపే లక్ష్యంగా గ్రామ గ్రామాల్లో ‘గడప గడపకు మన ప్రభుత్వం ’ అనే కార్యక్రమం ద్వారా వైసీపీ నేతలు ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. సీఎంగా జగన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత కీలక నిర్ణయం తీసుకున్నారు. నిరుద్యోగ సమస్యను తగ్గించేందుకు వాలంటీర్ల వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. దీని ద్వారా ప్రజలకు ప్రభుత్వ పథకాలు నేరుగా అందించే సౌకర్యం ఉంటుంది. తాజాగా వాలంటీర్లకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. వివరాల్లోకి వెళితే..

ఏపీలో గ్రామ, వార్డు వాలంటీర్లకు సీఎం జగన్ తీపి కబురు అందించారు. నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పుట్టిన రోజు సందర్భంగా వాలంటీర్లకు జీతం పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తెలిపారు. గురువారం ఆయన తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్న తర్వాత మీడియా సమావేశంలో ఈ ప్రకటన చేశారు. సీఎం జగన్ పుట్టటిన రోజు కానుకగా జనవరి 1వ తేదీ నుంచి వాలంటీర్లకు జీతం అదనంగా రూ.750 రూపాయలు పెంచుతున్నామని ప్రకటించారు. పట్ణణాలు, గ్రామాల్లో 50 ఇళ్ల పరిధిలో వాలంటీర్లు రేషన్ పకడ్భందీగా ఇవ్వాలనే ఉద్దేశంతో ఇప్పటికే ఐదువేల జీతం ఇస్తున్నామని.. దానితో పాటు ఇప్పుడు నెలకు రూ.750 పెంచుతున్నట్లు తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ నడుస్తుంది.. దీనికి అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు.

గత ప్రభుత్వంలో ఎంతో మంది అధికారులు ప్రజలకు చేరువ అయ్యే ప్రతి పథకంలో కమీషన్లు దోచుకున్నారు.. కానీ వాలంటీర్ల వ్యవస్థ వచ్చిన తర్వాత వాటన్నింటికి చెక్ పడిందని అన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాన్ కలిసి మరోసారి ఏపీని దోచుకునే కుటిల ప్రయత్నాలు చేస్తున్నారని.. కానీ సీఎం జగన్ వాటన్నింటిని తిప్పికొడుతున్నారని.. ప్రజల దీవెనెలు ఆయనకు ఎప్పుడూ ఉంటాయని అన్నారు. రాష్ట్రంలో ప్రతి పేదవారికి సొంత ఇళ్లు ఉండాలని జగన్ కల అందుకోసం ఇప్పటికే లక్షల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. జగన్ నేతృత్వంలో రాష్ట్రం ఎంతో ముందుకు సాగుతుందని, ఎవరు ఎన్ని కుతంత్రాలు పన్నినా వచ్చే ఎన్నికల్లో వైసీపీ విజయకేతనం ఎగురవేస్తుంది.. మళ్లీ సీఎం గా వైఎస్ జగన్ పాలన కొనసాగిస్తారని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ధీమా వ్యక్తం చేశారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments