iDreamPost
android-app
ios-app

CM జగన్ అభివృద్ది సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శం : స్పీకర్ తమ్మినేని

  • Published Nov 16, 2023 | 10:02 PM Updated Updated Nov 16, 2023 | 10:02 PM

ఏపీలో అధికార పార్టీ చేస్తున్న అభివృద్ది సంక్షేమ పథకాల గురించి గడప గడపకు మన ప్రభుత్వం పేరుతో ప్రజల్లోకి వెళ్తున్నారు వైసీపీ నేతలు.

ఏపీలో అధికార పార్టీ చేస్తున్న అభివృద్ది సంక్షేమ పథకాల గురించి గడప గడపకు మన ప్రభుత్వం పేరుతో ప్రజల్లోకి వెళ్తున్నారు వైసీపీ నేతలు.

  • Published Nov 16, 2023 | 10:02 PMUpdated Nov 16, 2023 | 10:02 PM
CM జగన్ అభివృద్ది సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శం : స్పీకర్ తమ్మినేని

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు వాడీ వేడిగా కొనసాగుతున్నాయి. ఏపిలో త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి.. ఈ నేపథ్యంలో అధికార ప్రతిపక్ష నేతలు వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు తమ తమ వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు. అధికార పార్టీ తాము చేసిన అభివృద్ది సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇప్పటికే ‘గడప గడపకు మన ప్రభుత్వం’ పేరుతో ప్రజా సమస్యలపై ఫోకస్ పెడుతున్నారు. ఇక వైసీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర విజయనగరం జిల్లాలో జైత్ర యాత్రగా సాగింది. ఈ కార్యక్రమానికి హాజరైన స్పీకర్ తమ్మినేని సీతారాం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అధికార పార్టీ వైసీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గంలో ప్రజలు ఘన స్వాగతం మధ్య జైత్రయాత్రగా మొదలైంది. అడుగడుగునా ప్రజలు బస్సు యాత్రకు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు, స్పీకర్ తమ్మినేని సీతారాంతో పాలు పలువురు వైసీపీ కీలక నేతలు పాల్గొన్నారు.

ఈ సందర్బంగా స్పీకర్ తమ్మినేని సీతారామ్ మాట్లాడుతూ.. వైసీపీ పాలనలో ప్రతిపక్షాలు ఎన్నో విమర్శలు చేస్తున్నారు.. కానీ ప్రజలు సీఎం జగన్ పాలను స్వాగతిస్తున్నారు. జైత్ర యాత్ర ద్వారా ప్రతిపక్షాలకు ప్రజలు సమాధానం చెప్పాలని పిలుపునిచ్చారు. బస్సు యాత్రకు వస్తున్న స్పందన చూస్తుంటే సీఎం జగన్ పిలుపునకు ప్రజలు చూపుతున్న ఆదారాభిమానం ఎంతో అభినందనీయం అన్నారు. కుల గణన జరగాలని కేబినెట్ లో సీఎం నిర్ణయం తీసుకోవడం బీసీలకు మరింత మేలు జరిగే అంశం అని అన్నారు. వైసీపీ పాలనలో తీసుకు వచ్చిన అభివృద్ది సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని మరోసారి ఆశీర్వదించాలని కోరారు.