YS Jagan Bus Yatra: CM జగన్ బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారు! వివరాలు ఇవే!

ఏపీలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఇప్పటికే ఎన్నికల రణరంగంలో దిగిన సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. స్పీడ్ ను పెంచారు. సిద్ధం పేరుతో సభలు నిర్వహించి.. తాజాగా బస్సు యాత్ర పేరుతో మరోసారి ప్రజల్లోకి వెళ్లనున్నారు. ఈ యాత్రకు సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది.

ఏపీలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఇప్పటికే ఎన్నికల రణరంగంలో దిగిన సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. స్పీడ్ ను పెంచారు. సిద్ధం పేరుతో సభలు నిర్వహించి.. తాజాగా బస్సు యాత్ర పేరుతో మరోసారి ప్రజల్లోకి వెళ్లనున్నారు. ఈ యాత్రకు సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది.

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సమరం ప్రారంభమైన సంగతి తెలిసింది. ఇటీవలే కేంద్ర ఎన్నికల సంఘం ఎలక్షన్ షెడ్యూల్ ను విడుదల చేసింది. దీంతో ఇప్పటికే ఏపీ రసవత్తరంగా ఉన్న రాజకీయం..మరింత రంజుగా మారింది. ఇంకా చెప్పాలంటే.. ఏపీలో ఎన్నికల రణరంగం ప్రారంభమైంది. అధికార వైఎస్సార్ సీపీ, విపక్ష కూటమి  అయినా టీడీపీ, జనసేన, బీజేపీలు గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి. ఇదే సమయంలో వైఎస్సార్ సీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బస్సు యాత్రతో ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ యాత్రకు సంబంధించిన  షెడ్యూల్ ను వైఎస్సార్ సీపీ నేత  సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు.

2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ జెండా మరోసారి ఎగరాలనే లక్ష్యంతో ఆ పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రణాళికలు రచిస్తున్నారు. 175 స్థానాల్లో గెలవడమే లక్ష్యంగా పెట్టుకుని ఆ దిశగా సీఎం వైఎస్ జగన్ అడుగులు వేస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ రాకముందే సిద్ధం పేరుతో ఎన్నికల సమరానికి శంఖారావం పూరించారు. సిద్ధం పేరుతో రాష్ట్ర మొత్తం కవర్ అయ్యేలా నాలుగు సభలు నిర్వహించారు. ఈ సభలు ఒకదానిని మించి మరోకటి సూపర్ హిట్ అయ్యాయి. అలానే ఇటీవల అభ్యర్థులను ప్రకటించిన సీఎం జగన్.. తాజాగా బస్సు యాత్ర పేరుతో ప్రజల్లోకి వెళ్లనున్నారు. ఈ యాత్రకు సంబంధించిన షెడ్యూల్ ఖారారైంది.

ఈ నెల 27న ఇడుపులపాయ నుంచి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బస్సు యాత్ర ప్రారంభం కానుందని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. రూట్‌ మ్యాప్‌పై వైఎస్సార్‌సీపీ నేతలు మీడియా సమావేశంలో వెల్లడించారు. సిద్ధం సభలు జరిగిన ప్రాంతాలు కాకుండా, మిగిలిన ప్రాంతాల్లోఈ బస్సు యాత్ర జరుగుతుందని వారు తెలిపారు. సిద్ధం సభలో లక్షలాది మంది పాల్గొన్నారన్నారు. మేనిఫెస్టోలో ప్రకటించిన వాటిల్లో 99 శాతం అమలు చేశామని సజ్జల పేర్కొన్నారు. బస్సు యాత్ర ప్రారంభమయ్యే తొలి రోజు… అంటే ఈనెల 27న ఇడుపులపాయ చేరుకుని వైఎస్సార్ ఘాట్ లో సీఎం జగన్ నివాళ్లర్పించి అనంతరం యాత్ర ప్రారంభమవుతుంది.

అనంతరం ఉదయం కార్యకర్తలతో ఇంటరాక్షన్‌ అవుతారు. మార్చి 27న కడప జిల్లా ప్రొద్దుటూరులో వైఎస్‌ జగన్‌ తొలి బహిరంగ సభ జరుగుతుంది. అనంతరం మార్చి 28న నంద్యాల జిల్లాలో సీఎం జగన్ బస్సు యాత్ర కొనసాగుతోంది. పలు నియోజవర్గాల మీదుకు సాగే ఈ యాత్ర.. అదే రోజు సాయంత్రం నంద్యాలలో బహిరంగ సభ ఉంటుంది. మార్చి 30 తేదీన కర్నూలు జిల్లాలో సీఎం జగన్ బస్సు యాత్ర కొనసాగనుంది. 30న ఎమ్మిగనూరులో సీఎం జగన్‌ బహిరంగ సభ జరగనుంది.  మొత్తంగా ఉమ్మడి కర్నూలు, కడప జిల్లాలో తొలి విడత సీఎం జగన్ బస్సు యాత్ర సాగనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Show comments