P Krishna
RTC Drivers Fight: ఈ మధ్య కాలంలో చాలా మంది చిన్న విషయాలకే కోపం, ఆవేశం, మనస్థాపానికి గురవుతూ విచక్షణ కోల్పోయి ఎదుటి వారిపై దాడులకు తెగబడుతున్నారు.
RTC Drivers Fight: ఈ మధ్య కాలంలో చాలా మంది చిన్న విషయాలకే కోపం, ఆవేశం, మనస్థాపానికి గురవుతూ విచక్షణ కోల్పోయి ఎదుటి వారిపై దాడులకు తెగబడుతున్నారు.
P Krishna
ఇటీవల చాలా మంది పని ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులు ఇతర కారణాల వల్ల తీవ్ర మనస్థాపానికి గురవుతున్నారు. ఆ క్షణంలో తాము ఏం చేస్తున్నామో తెలియని పరిస్థితిలో దారుణాలకు తెగబడుతున్నారు. దాడులు చేయడం.. బలవన్మరణాలకు పాల్పపడటం లాంటివి చేస్తున్నారు. ఏ సమస్య ఉన్నా కుటుంబ సభ్యులతో కానీ, స్నేహితులతో కానీ మాట్లాడి పరిష్కరించుకుంటా ఇలాంటి దారుణాలు జరగవని మానసిక నిపుణులు చెబుతున్నారు. ఓ బస్సులో ఇద్దరు డ్రైవర్లు తన్నుకోవడం.. అక్కడ ఉన్న ప్రయాణికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ గా మారింది. ఈ ఘటన ఎక్కడ జరిగిందీ? ఎందుకు కొట్టుకున్నారన్న విషయం గురించి తెలుసుకుందాం. వివరాల్లోకి వెళితే..
విజయవాడలో పండిట్ నెహ్రూ బస్ స్టేషన్‌లో ఇద్దరు ఆర్టీసీ డ్రైవర్ల మద్య ఘర్షణ చిలికి చిలికి గాలివానగా మారి తన్నుకునే పరిస్థితికి వచ్చింది. అసలేం జరిగిందంటే.. జమ్మలమడుగు, కళ్యాణ దుర్గం డిపోలకు సంబంధించిన సూపర్ లగ్జరీ బస్ డ్రైవర్లు.. బస్సులను ఫ్లాట్ ఫామ్ వద్దకు తీసుకువచ్చారు. బస్సు నిలిపే విషయంలో ఇద్దరి మధ్య ఘర్షణ మొదలైంది. జమ్మల మడుగు డ్రైవర్ బస్సులో ఉండగానే కళ్యాణ దుర్గం డ్రైవర్ అసభ్యుంగా తిడుతూ.. దూషిస్తూ బస్సులోకి ప్రవేశించి కాలుతో తన్నాడు. పక్కనే ప్రయాణికులు ఉన్నారన్న విచక్షణ లేకుండా గొడవ పడటం అక్కడ కొంతమంది వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఇదిలా ఉంటే ఇంజన్ ఆన్ లో ఉంచి ఇద్దరు డ్రైవర్లు గొడవ పడటంపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇద్దరు కొట్టుకునే సమయంలో గేర్ పై పడి బస్సు ముందుకు, వెనక్కి కంట్రోల్ లేకుండా కదిలితే తమ పరిస్థి ఏంటీని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు ఇద్దరు డ్రైవర్లు ఒకరిపై ఒకరు అధికారులకు ఫిర్యాదు చేసుకున్నారు. వారు ఇచ్చిన ఫిర్యాదులపై అధికారులు విచారణ జరుపుతున్నారు. బాధ్యులైన వారిపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.