iDreamPost
android-app
ios-app

చికెన్ కొంటే టమాటాలు ఫ్రీ! ఎక్కడో కాదు మన దగ్గరే..

  • Author Soma Sekhar Published - 12:59 PM, Wed - 19 July 23
  • Author Soma Sekhar Published - 12:59 PM, Wed - 19 July 23
చికెన్ కొంటే టమాటాలు ఫ్రీ! ఎక్కడో కాదు మన దగ్గరే..

టమాటా.. టమాటా.. ప్రస్తుతం ఏ న్యూస్ ఛానల్ చూసినా, ఏ న్యూస్ పేపర్ చదివినా.. ఈ పేరు లేకుండా ఉండట్లేదు. అంతలా టమాటాల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ప్రభుత్వాలే సబ్సిడీలతో టమాటాలు అందించే పరిస్థితి వచ్చింది అంటే.. ఏ స్థాయిలో వాటి ధరలు ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు. టమాటాలతో పాటుగా ఇతర కూరగాయల ధరలు కూడా అలాగే ఉన్నాయి మార్కెట్ లో. అదీకాక టమాటాల కోసం హత్యలు కూడా జరిగాయన్న వార్తలు మనం చూసే ఉన్నాం. ఇలాంటి తరుణంలో ఓ చికెన్ వ్యాపారి వినూత్నంగా ఆలోచించి.. చికెన్ కొంటే టమాటాలు ఫ్రీ అన్న బంపర్ ఆఫర్ ను ఇచ్చాడు. ఇది దేశంలో ఎక్కడో అనుకుంటే పొరపడినట్లే.. ఈ ఆఫర్ ఎక్కడో కాదు.. మన తెలుగు రాష్ట్రంలోనే.

మార్కెట్ లో కేజీ చికెన్ కంటే.. కేజీ టమాటా ధరలే అధికంగా ఉన్నాయి. కేజీ టమాటాలు పలు ప్రాంతాల్లో రూ. 250 నుంచి రూ. 300 వరకు ధరను పలుకుతున్నాయి. దాంతో పేద, మధ్య తరగతి ప్రజలకు అందని ద్రాక్షలా మారింది టమాటా. ఈ క్రమంలోనే ఓ చికెన్ వ్యాపారి అదిరిపోయే బంపరాఫర్ ను ప్రకటించాడు. తమ షాప్ లో కేజీ చికెన్ కొంటే.. అరకేజీ టమాటాలను ఉచితంగా ఇస్తున్నాడు. అలాగని చికెన్ రేటు బయటి మార్కెట్ కంటే ఎక్కువేమీ కాదు సుమీ. వివరాల్లోకి వెళితే.. తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరంలోని చివటం గ్రామానికి చెందిన వనం శ్రీనుకు చికెన్ షాప్ ఉంది. వ్యాపారంలో పరిస్థితులను బట్టి వినూత్నంగా ఆలోచించడం అతడికి అలవాటు.

అందులో భాగంగానే తన చికెన్ షాప్ లో కేజీ చికెన్ కొంటే.. అరకేజీ టమాటాలు ఉచితంగా అందిస్తున్నాడు వనం శ్రీను. దాంతో జనాలు ఇతడి దుకాణానికి పోటెత్తుతున్నారు. అయితే ఇలా ఎందుకు చేస్తున్నారు అని అతడిని ప్రశ్నించగా.. వ్యాపార అభివృద్ధి కోసం, పబ్లిసిటీ కోసం చేస్తున్నాను అని చెప్పుకొచ్చాడు శ్రీను. అదీకాక గత మూడు వారాలుగా ఆదివారం ఉల్లిపాయలను, బుధవారం టమాటాలను ఫ్రీగా ఇస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. అలాగని మార్కెట్ రేటు కంటే ఎక్కువ ధరకు చికెన్ విక్రయించట్లేదని ఈ సందర్భంగా తెలిపారు. ఈ ఆఫర్లు పెట్టినప్పటి నుంచి తన షాపులో కోనుగోళ్లు పెరిగాయని అతడు తెలియజేశాడు. మరి టమాటాలు రేటు ఇంత మండిపోతున్నా గానీ ఇలాంటి ఆఫర్ ఇవ్వడం పట్ల మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: పరువు నష్టం కేసులో జీవిత, రాజశేఖర్ కు జైలు శిక్ష!