Arjun Suravaram
Chennai Super kings, Aadudam Andhra: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మట్టిలో మాణిక్యాలను వెలికి తీసేందుకు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం సఫలీకృతం అయ్యింది. అలానే ఆయన తలచిన సంకల్పం నేరవేరుతోంది.
Chennai Super kings, Aadudam Andhra: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మట్టిలో మాణిక్యాలను వెలికి తీసేందుకు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం సఫలీకృతం అయ్యింది. అలానే ఆయన తలచిన సంకల్పం నేరవేరుతోంది.
Arjun Suravaram
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం ‘ఆడుదాం ఆంధ్ర’. గ్రామీణ యువతలోని క్రీడా నైపుణ్యాన్ని వెలుగులోకి తెచ్చే సంకల్పంతో ఈ మహా క్రీడాసంగ్రామాన్ని ప్రారంభించారు. కొన్ని రోజుల పాటు సాగిన ఈ కార్యక్రమం ఇటీవలే ముగిసింది. వైజాగ్ వేదికగా ఫిబ్రవరి 9 నుంచి ఫిబ్రవరి 13 వరకు ఫైనల్స్ జరిగాయి. సీఎం జగన్ ఏ సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారో.. అది నేరవేరుతోంది. ‘ఆడుదాం ఆంధ్రా’ ద్వారా ఎంతో మంది యువత.. తమ క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించి.. రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో గుర్తింపు పొందారు. అందుకు నిదర్శనమే విజయనగరం జిల్లాకు చెందిన కె.పవన్ అనే యువకుడు. ఆడుదాం ఆంధ్రలో పాల్గొన్ని ఐపీఎల్ జట్టు అయినా చెన్నై సూపర్ కింగ్స్ దృష్టిలో పడ్డాడు.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి గ్రామీణ యువతలో విద్యాతో పాటు క్రీడా నైపుణ్యం వెలుగులోకి తేవాలని సంకల్పించారు. ఆ ఆలోచనలో నుంచి పుట్టినదే ఆడుదాం ఆంధ్రా అనే కార్యక్రమం. ఖర్చు గురించి ఎక్కడ ఆలోచించకుండా యువత క్రీడా ప్రతిభను వెలికితీయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గ్రామ, మండల, నియోజకవర్గం, జిల్లా.. ఇలా వివిధ స్థాయిలో అనేక క్రీడా పోటీలు నిర్వహించారు. ఇక్కడ చక్కటి ప్రతిభను కనబర్చిన వారిని రాష్ట్ర స్థాయిలో జరిగిన ఫైనల్స్ కి ఎంపిక చేశారు. ఇలా క్రికెట్, ఖో ఖో, కబడ్డీ, వాలీబాల్, బ్యాడ్మింటన్ వంటి వివిధ ఆటల్లో పలువురు యువత చక్కటి ప్రదర్శన చేశారు. అలా చేసిన 14 మంది ప్లేయర్లను ఏపీ ప్రభుత్వం దత్తతు తీసుకుని మరింత మెరుగైన శిక్షణ ఇచ్చేందుకు సిద్ధమైంది. అలానే పలు సంస్థలు కూడా కొందరి ప్లేయర్లను దత్తతు తీసుకుంటున్నాయి.
తాజాగా రాష్ట్ర స్థాయిలో జరిగిన క్రికెట్ ఫైనల్ మ్యాచ్ లో చక్కటి ప్రదర్శన చేసిన విజయనగరం జిల్లాకు చెందిన కె. పవన్ ను ఐపీఎల్ టీమ్స్ లో ఒకటైన చెన్నై సూపర్ కింగ్స్ దత్తత తీసుకుంది. ఫిబ్రవరి 13 వైజాగ్, ఏలూరు జట్ల మధ్య క్రికెట్ ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఏలూరు జట్టు విజయం సాధించింది. ఇక ఈ మ్యాచ్ లో పవన్ చక్కగా రాణించాడు. దీంతో పవన్ ప్రతిభను గుర్తించిన సీఎస్కే జట్టు అతడిని దత్తత తీసుకుంది. పవన్ కి చిన్నప్పటి నుంచి క్రీడలు అంటే మక్కువ. కానీ పేదరికం కారణంగా ఇంతకాలం తన ప్రతిభను ప్రదర్శించే అవకాశం రాలేదు.
గ్రామీణ క్రీడాకారులను గుర్తించాలనే సీఎం జగన్ సంకల్పంతో నిర్వహించిన ఆడుదాం ఆంధ్రా ప్రోగ్రామ్ ద్వారా పవన్ ఇప్పుడు వెలుగులోకి వచ్చాడు. సీఎం జగన్ కు యువతపై ఉన్న అపారమైన నమ్మకానికి ఇది చిన్న చక్కటి ఉదాహణ మాత్రమే. ఇక పవన్ ను దత్తత తీసుకున్న సీఎస్కే టీమ్.. అతడికి మెరుగైన శిక్షణ ఇవ్వనుంది. దీంతో అతడు రాష్ట్ర స్థాయితో పాటు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఆడుదాం ఆంధ్రా ఈవెంట్ కు విచ్చేసిన సీఎస్ కే టాలెంట్ హంట్ లో భాగంగా పవన్ ను ఎంపిక చేసింది. అదే విధంగా ఎన్టీర్ జిల్లాకు చెందిన కేవీఎం విష్ణు వర్ధినిని కూడా ఎంపిక చేసింది. సీఎం జగన్ తలపెట్టిన ప్రతిష్టాత్మ కార్యక్రమం ఆడుదాం ఆంధ్రతో ఎంతో మంది యువత వెలుగులోకి వచ్చారు. ఇలా సీఎం జగన్ తలపెట్టిన సంకల్పం నిరవేరుతుంది. మరి..ఇలా యువత ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ద్వారా గుర్తింపు పొందడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.