Arjun Suravaram
ఈ మధ్యకాలంలో అక్రమ మార్గంలో డబ్బులు సంపాదించే వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. అలానే నగదును, బంగారాన్ని అక్రమంగా సప్లయ్ చేస్తూ పోలీసుల తనిఖీల్లో దొరికిపోతున్నారు. తాజాగా కర్నూలు జిల్లాలో పోలీసులు భారీగా నగదు, బంగారం పట్టుకున్నారు.
ఈ మధ్యకాలంలో అక్రమ మార్గంలో డబ్బులు సంపాదించే వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. అలానే నగదును, బంగారాన్ని అక్రమంగా సప్లయ్ చేస్తూ పోలీసుల తనిఖీల్లో దొరికిపోతున్నారు. తాజాగా కర్నూలు జిల్లాలో పోలీసులు భారీగా నగదు, బంగారం పట్టుకున్నారు.
Arjun Suravaram
ప్రతి ఒక్కరికి డబ్బుపై ఆశ ఉంటుంది. చాలా మంది కష్టపడి ధనం సంపాదించాలని అనుకుంటారు. కానీ కొందరు మాత్రం సులభంగా సొమ్మును పొందేందుకు అడ్డదారులు తొక్కుతుంటారు. అసాంఘిక చర్యలు, చోరీలు, అక్రమంగా బంగారం తరలిస్తూ సంపాదిస్తుంటారు. అయితే ఇలాంటి ముఠాలను పట్టుకునేందుకు పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుంటారు. ఈక్రమంలోనే అనేక సందర్భాల్లో పెద్ద మొత్తంలో డబ్బులను, నగదను పోలీసులు స్వాధీనం చేసుకుంటారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో అక్రమంగా తరలిస్తున్న భారీగా బంగారం, నగదును పోలీసులు పట్టుకున్నారు ఆ వివరాల్లోకి వెళ్తే…
కర్నూలు జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న బంగారం, నగదును పోలీసులు పట్టుకున్నారు. అక్రమంగా బంగారం తరలిస్తున్నారని స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టెబుల్ ఖాజాహుసేన్ సమాచారం ఇవ్వడంతో కర్నూలు జిల్లా అమకతాడు టోల్‌ప్లాజా వద్ద కృష్ణగిరి, వెల్దుర్తి ఎస్‌ఐలు ఎం.చంద్రశేఖర్‌రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డితో కలిసి సీఐ గురువారం అర్ధరాత్రి వాహన తనిఖీ చేపట్టారు. సినీ ఫక్కీలో ఒంటిపై చొక్కా లోపల ధరించిన బనియన్లలో భారీగా బంగారం, నగదు పెట్టుకుని దర్జాగా బస్సులో నిద్రిస్తున్న నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.1.84 కోట్ల డబ్బులు , 4.565 కిలోల బంగారం, 5 కేజీల వెండి స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్ నుంచి కోయంబత్తూరుకు వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ స్లీపర్ బస్సులో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈక్రమంలో బస్సులో అక్రమంగా డబ్బులు, బంగారం తరలిస్తున్న కొందరి పోలీసులు పట్టుకున్నారు. నిందితుల్లో అమర్‌ప్రతాప్ పవార్(నంద్యాల), శబరి రాజన్(సేలం), వెంకటేష్ రాహుల్(కోయంబత్తూరు), సెంథిల్‌కుమార్ (కోయంబత్తూరు) సినీ ఫక్కీలో బంగారం తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వారు పక్క ప్రణాళిక ప్రకారం.. ఒంటిపై ధరించిన బనియన్‌కు పెద్ద జేబులు ఏర్పాటు చేసుకున్నారు. వాటిల్లో బంగారం, వెండి, నగదు పెట్టుకుని, దానిపై చొక్కా వేసుకుని ఎవరికీ అనుమానం రాకుండా బస్సులో ప్రయాణిస్తున్నారు. పోలీసులకు పక్క సమాచారం రావడంతో ఆ బస్సును ఆపి తనిఖీలు నిర్వహించారు.
బనియన్లలో డబ్బులు, బంగారం దాచుకున్న నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న బంగారం, వెండి విలువ రూ.2,74,54,800 ఉంటుంది. ఇక డబ్బుతో పాటు బంగారం, వెండిని తరలిస్తున్న వారి వద్ద ఎటువంటి పత్రాలు పోలీసులు పంచనామా నిర్వహించి సీజ్ చేశారు. ఈ భారీగా నగదను పట్టుకున్న పోలీసులును జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ అభినందించారు. కాగా, గత నెల 26న రాత్రి ఇదే టోల్‌ప్లాజా వద్ద హైదరాబాద్ నుంచి అనంతపురానికి వెళుతున్న ట్రావెల్స్ బస్సులో కూడా ఓ వ్యక్తి నుంచి రూ.43.20లక్షలు స్వాదీనం. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇలా డబ్బుల కట్టలు పట్టుబడుతుండటం అందరిలో సంచలనంగా మారింది. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.