Arjun Suravaram
Chandrababu: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నమ్మిన వారిని మోసం చేస్తారని ప్రత్యర్థి పార్టీల నేతలు అంటుంటారు. వారి మాటలు నిజం చేస్తూ బాబు తీసుకునే నిర్ణయాలు ఉంటాయి. తాజాగా ఇద్దరు టీడీపీ సీనియర్ నేతలకు బాబు షాకిచ్చాడనే టాక్ వినిపిస్తోంది.
Chandrababu: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నమ్మిన వారిని మోసం చేస్తారని ప్రత్యర్థి పార్టీల నేతలు అంటుంటారు. వారి మాటలు నిజం చేస్తూ బాబు తీసుకునే నిర్ణయాలు ఉంటాయి. తాజాగా ఇద్దరు టీడీపీ సీనియర్ నేతలకు బాబు షాకిచ్చాడనే టాక్ వినిపిస్తోంది.
Arjun Suravaram
ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్ది.. రాజకీయ వేడి సెగలు రేపుతోంది. సిద్ధం పేరుతో అధికార వైఎస్సార్ సీపీ ఎన్నికల యుద్ధంలో దూసుకెళ్తోంది. ఇదే సమయంలో టీడీపీ ఇంకా పూర్తి స్థాయిలో అభ్యర్థులను ఖరారు చేయలేదు. ఇదే సమయంలో సీఎం జగన్ గెలుపును అడ్డుకునే ప్రయత్నంలో తన సొంతపార్టీ నేతలనే మోసం చేస్తున్నాడనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే పార్టీ కోసం పని చేసిన వారికి కాదని కొత్త పార్టీలోకి వచ్చిన వారికి టికెట్లు ఇస్తూ బాబు.. షాకిస్తున్నాడు. తాజాగా ఇద్దరు టీడీపీ సీనియర్ నేతలు, అందులో చంద్రబాబుకు నమ్మకంగా ఉండే వ్యక్తులను కూడా ఆయన ముంచేశాడనే టాక్ వినిపిస్తోంది.
ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీలో అసమ్మతి రాగాలు వినిపిస్తోన్నాయి. తాము పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు వెన్నంటే ఉన్నామని, అలాంటి తమకు కాదని వేరేవరికో టికెట్లు కేటాయించడం ఏంటనే టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక చంద్రబాబు తన రాజకీయ అవసరలా కోసం సొంత వారిని, నమ్మిన వారిని సైతం ముంచేస్తాడనే టాక్ ఉంది. ఆ వార్తలను నిజం చేస్తూ.. చంద్రబాబు తీసుకునే నిర్ణయాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా ఇటీవలే చంద్రబాబు, మాజీ మంత్రి దేవినేని ఉమాకు షాకిచ్చినట్లు తెలుస్తోంది. ఆయనతో పాటు పెనమలూరు మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ను కూడా బాబు ముంచేశాడనే టాక్ వినిపిస్తోంది.
రెండు రోజుల క్రితం టీడీపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కి మైలవరం టికెట్ ను కేటాయించారని తెలుస్తోంది. ఇదే సమయంలో అక్కడ ఇన్ ఛార్జీగా ఉన్న దేవినేని ఉమాను పెనమలురు పంపాలనే చంద్రబాబు నిర్ణయించినట్లు తెలుస్తోంది.ఇదే సమయంలో దేవినేని ఉమా, ఎంఎస్ బేగ్, బోడే ప్రసాద్ పేర్లతో పెనమలూరులో ఐవీఆర్ఎస్ సర్వే నిర్వహించారంట. ఇలా ఆ ముగ్గురిలో ఎవరో ఒకరిని పెనమలూరు టీడీపీ అభ్యర్థిగా నిలబెడతారని అందరూ భావించారు. అయితే దేవినేని ఉమా, బోడే ప్రసాద్ లకు షాకిస్తూ.. తుమ్మల చంద్రశేఖర్ కి పెనమలూరు టికెట్ ను కేటాయించినట్లు తెలుస్తోంది. తుమ్మల చంద్రశేఖర్..వైసీపీలో కమ్మ కార్పోరేషన్ ఛైర్మన్ గా ఉండి.. ఇటీవలే టీడీపీలో చేరారు. ఆయనకు పెనమలూరు టికెట్ ను కేటాయించనట్లు సమాచారం.
ఇక ఉమ్మడి కృష్ణా జిల్లాలోనే అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులు దాదాపు ఖరారు అయ్యారు. నూజివీడు పార్థసారథికి ఇచ్చారు. నందిగామ ఎస్సీ రిజర్వుడ్, అలానే విజయవాడ సిటీలోని అన్ని స్థానాలు ఫిక్స్ అయ్యాయి. అవనిగడ్డ జనసేనాకు కేటాయిస్తారనే టాక్ వినిపిస్తోంది. గుడివాడ, గన్నవరంలో ఇప్పటికే అభ్యర్థులను బాబు ఫిక్స్ చేశారు. ఇలా ఉమా, బోడే ప్రసాద్ లకు ఏ నియోజవర్గంలోనూ అవకాశం లేకుండా పోయిందనే వార్తలు వినిపిస్తోన్నాయి. మొత్తంగా పార్టీనే నమ్ముకున్న ఉమా, బోడే ప్రసాద్ లను చంద్రబాబు నిండా ముంచేశాడనే టాక్ వినిపిస్తోంది. ఇలా సొంతవారిని మోసం చేసిన బాబుకు వేరే పార్టీల నుంచి వచ్చిన వారిని, ఇతర నేతలను మోసం చేయడం పెద్ద లెక్క కాదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.