Arjun Suravaram
Chandrababu: ఏపీ స్కిల్ స్కాం కేసులో టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఎలాంటి ఊరట దక్కలేదు. ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం భిన్న తీర్పులు వెలువరిచంచింది.
Chandrababu: ఏపీ స్కిల్ స్కాం కేసులో టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఎలాంటి ఊరట దక్కలేదు. ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం భిన్న తీర్పులు వెలువరిచంచింది.
Arjun Suravaram
ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో సుప్రీం కోర్టు ధర్మాసనం కీలక తీర్పు ఇచ్చింది. స్కిల్ స్కాం కేసులో విషయంలో చంద్రబాబుకు ఊరట లభించలేదు. ఈకేసులో ఆయన తరుపు న్యాయవాదులు వేసిన క్వాష్ పిటిషన్ పై మంగళవారం సుప్రీం కోర్టు ద్విసభ్య ధర్మాసనం తీర్పును వెలువరిచింది. ఇక్కడ ఇద్దరూ న్యాయమూర్తులు విభిన్న తీర్పులు ఇచ్చారు. ఈ కేసులో 17ఏ వర్చించదని జస్టిస్ బేలా త్రివేది తీర్పు ఇచ్చారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని నేరానికి పాల్పడిన వారికి 17 ఏ రక్షణగా ఉండకూడదని బేలా త్రివేది వ్యాఖ్యనించారు. అదే విధంగా జస్టిస్ అనిరుద్ధబోస్..జస్టిస్ బేలా వ్యాఖ్యలకు భిన్నంగా తీర్పు ఇచ్చారు.
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అరెస్టు అయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో దాదాపు 52 రోజుల పాటు ఆయన రిమాండ్ ఖైదీగా జైల్లో ఉన్నారు. అనంతరం హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో చంద్రబాబు జైలు నుంచి బయటకు వచ్చారు. అయితే ఈ కేసును క్వాష్ చేయాలని చంద్రబాబు తరపు న్యాయవాదులు సుప్రీం కోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ కేసును సుప్రీం కోర్టు ద్విసభ్య ధర్మాసనం విచారణ చేసింది. ఇప్పటికే అనేకమార్లు వాయిదా పడుతూ వస్తున్నా చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై తాజాగా సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించింది. ఈ కేసులో చంద్రబాబుకు ఊరట దక్కలేదు. ఈ ధర్మాసనంలోని ఇద్దరూ న్యాయమూర్తులు విభిన్నమైన తీర్పులు ఇచ్చారు.
ఈ నేపథ్యంలోనే చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని విస్తృత ధర్మాసనానికి బాబు క్వాష్ పిటిషన్ ను బదిలీ అయింది. అయితే ఈ ఇద్దరు న్యాయమూర్తులు కూడా రిమాండ్ కొట్టేయలేమని చెప్పడంతో బాబుకు భారీ షాక్ లాంటిదేని న్యాయ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. రిమాండ్ విధించే అధికారం ట్రయల్ కోర్టు అంటే విజయవాడలోని ఏసీపీ కోర్టుకు పూర్తిగా ఉందని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఇక స్కిల్ స్కాం కేసులో 17 ఏ విషయంలో ఇద్దరు న్యాయమూర్తులు వేరువేరు అభిప్రాయాలను వెల్లడించారు. స్కిల్ స్కాం కేసులో చంద్రబాబుకు అవినీతి నిరోధక శాఖలోని సెక్షన్ 17ఏ వర్తించదని జస్టిస్ బేలా తీర్పు ఇవ్వగా, 17 ఏ వర్తిస్తుందని జస్టిస్ అనిరుద్ధబోస్ తీర్పు ప్రకటించారు. జస్టిస్ బేలా త్రివేది తన తీర్పును చదువుతూ.. ఈ కేసులో చంద్రబాబుకు 17 ఏ వర్తించదని, 2018లో వచ్చిన సవరణ ఆధారంగా చేసుకుని ఈ కేసును క్వాష్ చేయలేం అని ఆయన తెలిపారు. ఇక ఈ న్యాయమూర్తులు ఇచ్చిన తీర్పుతో ఈ క్వాష్ పిటిషన్ చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది.
సెప్టెంబర్ 22వ తేదీన ఏపీ హైకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ కోట్టివేయబడింది. సెప్టెంబర్ 23వ తేదీన సుప్రీంలో చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్ వేశారు. సెప్టెంబర్ 25వ తేదీన చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ ధర్మాసనం ముందుకు బాబు క్వాష్ పిటిషన్ వచ్చింది. ఈ క్వాష్ పిటిషన్ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్ వీఎన్ భట్ ల ధర్మాసనం ముందుకు సెప్టెంబర్ 27వ తేదీన వచ్చింది. ధర్మాసనం నుంచి జస్టిస్ భట వైదొలగడంతో మరోసారి సీజైఐ ముందుకు ఈ పిటిషన్ వెళ్ళింది. చివరకు అక్టోబర్ 3న జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా త్రివేదిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ముందుకు బాబు క్వాష్ పిటిషన్ వెళ్లింది. చాలా రోజుల పాటు ఈ పిటిషన్ పై విచారణ కొనసాగింది. నవంబర్ 20 తేదీన క్వాష్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్ చేయబడింది. తాజాగా ఈ క్వాష్ పిటిషన్ ద్విసభ్య ధర్మాసనం నుంచి రెండు తీర్పులు వెలువడ్డాయి.