iDreamPost
android-app
ios-app

లోకేశ్ ని నమ్మని చంద్రబాబు! కన్న కొడుక్కే వెన్నుపోటు?

Nara Chandrababu, Lokesh: టీడీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనగానే చాలా మంది ఠక్కున చెప్పేది వెన్నుపోటు రాజకీయం. అందుకు నిదర్శనంగా అనేక ఘటనలు ఉదహరిస్తుంటారు ప్రత్యర్థి పార్టీలు. తాజాగా ఓ విషయంలో ఏకంగా కొడుకుకే బాబు వెన్నుపోటు పొడిచారనే టాక్ వినిపిస్తోంది.

Nara Chandrababu, Lokesh: టీడీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనగానే చాలా మంది ఠక్కున చెప్పేది వెన్నుపోటు రాజకీయం. అందుకు నిదర్శనంగా అనేక ఘటనలు ఉదహరిస్తుంటారు ప్రత్యర్థి పార్టీలు. తాజాగా ఓ విషయంలో ఏకంగా కొడుకుకే బాబు వెన్నుపోటు పొడిచారనే టాక్ వినిపిస్తోంది.

లోకేశ్ ని నమ్మని చంద్రబాబు! కన్న కొడుక్కే వెన్నుపోటు?

రాజకీయాల చదరంగంలో ఎన్నో ఎత్తులు పైఎత్తులు ఉంటాయి. గెలుపు కోసం, అధికారం కోసం ఎన్నో రకాల వ్యూహాలు రచిస్తుంటారు. ఈ క్రమంలో కొందరు విశ్వసనీయత, విధేయతకు పెద్దపీట వేస్తూ తమ రాజకీయాన్ని కొనసాగిస్తుంటారు. మరికొందరు మాత్రం మోసాలు, వెన్నుపోటు, వంచన వంటి వాటినే ఆధారంగా చేసుకుని తమ పొలిటికల్ జర్నీ కొనసాగిస్తుంటారు. ఇలాంటి నేతలు తమ రాజకీయ ప్రయాణంలో సొంత కుటుంబ సభ్యులు వచ్చినా సరే వెన్నుపోటు పోవడానికి కూడా వెనుకాడరు. ఇలాంటి లక్షణాలు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి ఉన్నాయని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతుంటారు. అలానే ఎవరని నమ్మని చంద్రబాబు చివరకు ఓ విషయంలో తన కొడుకును కూడా నమ్మడం లేదని టాక్ వినిపిస్తోంది.

2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ గెలుపును ఆపేందుకు ప్రతిపక్ష టీడీపీ విశ్వప్రయత్నాలు చేస్తుంది. ఈ క్రమంలోనే టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకేశ్ వివిధ కార్యక్రమాలతో రాష్ట్ర వ్యాప్తంగా సభలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఎవరికి వారే అభ్యర్థులను పరోక్షంగా ప్రకటిస్తూ వచ్చారు. ముఖ్యంగా నారా లోకేశ్ యువగళం పాదయాత్ర సమయంలో పలువురికి టికెట్లు మీకే అంటూ భరోసా కల్పించాడు. అయితే తాజాగా లోకేశ్ ప్రకటించిన అభ్యర్థులను చంద్రబాబు పక్కన పెడుతున్నట్లు తెలుస్తోంది. కొడుకుపై నమ్మకం లేకనే అతడు తీసుకున్న నిర్ణయాలను బాబు పక్కన పెట్టేస్తున్నాడని సమాచారం.

ఉదాహరణకు రాయలసీమలోనే ప్రొద్దుటూరు విషయానికివస్తే.. ఇక్కడ టీడీపీ ఇన్ ఛార్జీ జీవీ ప్రవీణ్ రెడ్డి అభ్యర్థిత్వంపై పరోక్షంగా లోకేశ్ సంకేతాలు ఇచ్చారు. అలాగే ఒక కేసు విషయంలో జైలులో ఉన్న ప్రవీణ్ ను పరామర్శించడానకి వెళ్లిన సందర్భంగాలో తమ పార్టీ ప్రొద్దుటూరు అభ్యర్థి ప్రవీణ్ రెడ్డి అని లోకేశ్ మీడియా సమక్షంలో ప్రకటించారు. కష్టకాలంలో టీడీపీ అండగా నిలబడినప్పటికీ సిట్టింగ్ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ ని తట్టుకునే సామర్థ్యం ప్రవీణ్ కి లేవని అధిష్టానం అభిప్రాయపడింది. దీంతో లోకేశ్ ప్రతిపాదించిన ప్రవీణ్ ను కాదని, వరదరాజుల రెడ్డికే టికెట్ ఇవ్వాలని బాబు ఆలోచనలో ఉన్నారంట. అలానే ఉమ్మడి విశాఖ జిల్లాలోని పాయకరావు పేట విషయంలోనూ లోకేశ్ కి చుక్కెదురైనట్లు సమాచారం.

అక్కడ వంగలపూడి అనితకు లోకేశ్ హామీ ఇచ్చారని టాక్. అయితే ఆమె విషయంలో చంద్రబాబు సానుకూలంగా లేరంట. ఇక్కడ టీడీపీ ఓడిపోతుందని సర్వే నివేదికలు చెబుతున్నాయి. దీంతో పాయకరావు పేటను సీటును జనసేనకు ఇచ్చి, చేతులు దులిపేసుకోవాలని బాబు అనుకుంటున్నారని టాక్. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ టికెట్ ను మాజీ మంత్రి భూమా అఖిల ప్రియకు ఇవ్వాలనేది లోకేశ్ అభిప్రాయం. అయితే ఆమెకు టికెట్ ఇస్తే ఓడిపోతామని బాబు భావిస్తున్నారని సమాచారం. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా లోకేశ్ తన అనుకుని అందరికీ టికెట్లు ఇప్పించే పరిస్థితి కనిపించడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. లోకేశ్ పై నమ్మకం లేకని చంద్రబాబు ఇలా నిర్ణయాలు మారుస్తున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తంగా కొడుక్కి కూడా చంద్రబాబు వెన్నుపోటు పొడుస్తున్నారనే వాదనలు వినిపిస్తోన్నాయి.