ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యా, వైద్య రంగాల్లో తీసుకొస్తున్న సంస్కరణలకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలతో పాటు అవార్డులు కూడా వస్తున్నాయి. ఇటీవలే ‘నాడు-నేడు’ కార్యక్రమాన్ని ఐక్యరాజ్య సమతి ప్రశంసించిన సంగతి తెలిసిందే. పశువైద్యంలో తీసుకొచ్చిన సంస్కరణలకు గాను జాతీయ స్థాయిలో వరుసగా రెండోసారి అవార్డును అందుకుంది ఏపీ ప్రభుత్వం. తాజాగా మరో అరుదైన గౌరవం దక్కించుకుంది జగన్ సర్కార్. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కల్పిస్తున్న సౌకర్యాలను కేంద్ర ప్రభుత్వం ప్రశంసించింది. దానితో పాటుగా ఏపీలోని నాలుగు పీహెచ్ సీలకు ఎన్కాస్ సర్టిఫికెట్లు ఇచ్చింది. మరిన్ని వివరాల్లోకి వెళితే..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కల్పిస్తున్న సౌకర్యాలపై కేంద్ర ప్రభుత్వం ప్రశంసలు కురిపించింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సంతృప్తికరమైన వైద్య సదుపాయాలతో పాటుగా నాణ్యతా ప్రమాణాలను పాటించినందుకు గాను రాష్ట్రంలోని నాలుగు PHC లకు ఎన్కాస్ సర్టిఫికెట్లను అందించింది. రాష్ట్రంలోని గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఇందిరానగర్ పీహెచ్ సీ 96.2 స్కోర్ తో ఏపీలో తొలి యూపీహెచ్ సీగా గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. ఆ తర్వాత 88.2 శాతం మార్కులతో ఎన్టీఆర్ జిల్లా కండ్రిక యూపీహెచ్ సీ రెండో స్థానంలో నిలిచింది.
వీటితో పాటు నెల్లూరు జిల్లా రామతీర్థం పీహెచ్ సి, సత్యసాయి జిల్లా విఎం చెరువు పీహెచ్ సి, అల్లూరి సీతారామరాజు జిల్లా యెల్లవరం పీహెచ్ సిలతో పాటు అన్నమయ్య జిల్లా పెదమాంద్యం పీహెచ్ సికి (షరతులతో కూడిన) నాణ్యతా ప్రమాణాల సర్టిఫికెట్ లను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన అధికారుల బృందాలు జూన్ 23-24 తేదీల మధ్య PHC ను సందర్శించి అక్కడి అన్ని విభాగాల పనితీరును పరిశీలించింది. ఈ సర్టిఫికెట్లకు సంబంధించి కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి విశాల్ చౌహాన్ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ ఛీఫ్ సెక్రెటరీ MT కృష్ణబాబుకు రాసిన ఒక లేఖలో అభినందనలు తెలియజేశారు.
ఇదికూడా చదవండి: ఏపీకి పట్టిన శని చంద్రబాబు.. మంత్రి అంబటి సంచలన కామెంట్స్!