iDreamPost
android-app
ios-app

YS Jagan: జగన్‌ పాలనలో మూడింతలు పెరిగిన పెట్టుబడులు.. స్వయంగా వెల్లడించిన కేంద్రం

  • Published Feb 29, 2024 | 11:19 AM Updated Updated Feb 29, 2024 | 11:19 AM

జగన్‌ పాలనలో పెట్టుబడులు లేవు.. పరిశ్రమలు రాలేదు.. అభివృద్ధి కుంటుపడింది అనే వారికి కేంద్రం దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చింది. చంద్రబాబు పాలనతో పోలిస్తే జగన్‌ పాలనలో పెట్టుబడులు మూడింతలు పెరిగినట్లు వెల్లడించింది. ఆ వివరాలు..

జగన్‌ పాలనలో పెట్టుబడులు లేవు.. పరిశ్రమలు రాలేదు.. అభివృద్ధి కుంటుపడింది అనే వారికి కేంద్రం దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చింది. చంద్రబాబు పాలనతో పోలిస్తే జగన్‌ పాలనలో పెట్టుబడులు మూడింతలు పెరిగినట్లు వెల్లడించింది. ఆ వివరాలు..

  • Published Feb 29, 2024 | 11:19 AMUpdated Feb 29, 2024 | 11:19 AM
YS Jagan: జగన్‌ పాలనలో మూడింతలు పెరిగిన పెట్టుబడులు.. స్వయంగా వెల్లడించిన కేంద్రం

2019 ఎన్నికల్లో విజయం సాధించి.. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ప్రజా సంక్షేమం.. రాష్ట్ర అభివృద్ధి అనే లక్ష్యాలకు కట్టుబడి ఉన్నారు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. ఓ వైపు నవరత్నాల పేరుతో ప్రజలకు సంక్షేమ పాలన అందిస్తూనే.. రాష్ట్రంలోకి పెట్టుబడులు తరలి వచ్చేలా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే అంబానీ, అదానీ, బిర్లా వంటి టాప్‌ కంపెనీలు ఏపీలో పరిశ్రమల స్థాపనకు ముందుడగులు వేస్తున్నాయి. ఇక ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది. జగన్‌ పాలనలో ఏపీలో సంక్షేమం, అభివృద్ది సమంగా సాగుతున్నా.. విపక్షాలు మాత్రం విమర్శలు ఆపడం లేదు.

కేవలం పంచుడు పథకాలతో జనాలను మభ్యపెడుతున్నారని.. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపన లేదని.. పెట్టుబడులు రావడం లేదని అసత్య ప్రచారం చేస్తూ.. తమ అనుకూల మీడియా ద్వారా విష ప్రచారాన్ని జనాల బుర్రలోకి ఎక్కించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో వారికి గట్టి షాక్‌ తగిలింది. చంద్రబాబు పాలనలో కన్నా జగన్‌ హయాంలోనే ఏపీలోకి భారీ ఎత్తున పెట్టుబడులు వచ్చాయని వెల్లడయ్యింది. ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆ వివరాలు..

చంద్రబాబు పాలనకే కేవలం రూ.32,803 కోట్లు

గత చంద్రబాబు ప్రభుత్వంతో పోలిస్తే గడిచిన నాలుగున్నర ఏళ్లలో అనగా జగన్‌ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాష్ట్రంలో పెట్టుబడులు మూడు రెట్లు పెరిగాయి. ఈ విషయం వెల్లడించింది స్వయానా కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ. ఆ శాఖకు చెందిన డిపార్ట్‌మెంట్‌ ఫర్‌ ప్రమోషన్‌ ఫర్‌ ఇండ్రస్ట్రీ అండ్‌ ఇంటర్నల్‌ ట్రేడ్‌ (డీపీఐఐటీ) వెల్లడించిన వివరాల ప్రకారం.. 2014–18 మధ్య కాలంలో అనగా చంద్రబాబు పాలన రాష్ట్రంలోకి వాస్తవంగా వచ్చిన పెట్టుబడులతో పోలిస్తే 2019-2023 జూన్‌ వరకు అనగా.. వైఎస్‌ జగన్‌ పాలనలో 226.9 శాతం అధికంగా పెట్టుబడులు వచ్చాయి. 2014–18 క్యాలండర్‌ ఇయర్‌ ప్రకారం తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో వాస్తవ రూపంలోకి వచ్చి ఉత్పత్తిని ప్రారంభించిన పరిశ్రమల పెట్టుబడులు కేవలం రూ.32,803 కోట్లు మాత్రమే.

జగన్‌ పాలనలో మూడింతలు పెరిగిన పెట్టుబడులు

ఇక వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి హయాంలో రూ.1,00,103 కోట్ల పెట్టుబడులు వాస్తవరూపం దాల్చాయి. ఇక గతంలో చంద్రబాబు నాయుడు పెట్టుబడుల సదస్సు పేరుతో ప్రతి ఏటా హాడావుడి చేసి లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేశాయంటూ చేసిన ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని ఈ గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి. అంతేకాక చంద్రబాబు ఐదేళ్ల పాలనలో వివిధ పెట్టుబడుల సదస్సుల ద్వారా రూ.18.87 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చి నట్లు ఫేక్‌ ఒప్పందాలు చేసుకున్నట్లు కేంద్ర నివేదికతో బహిర్గతం అయ్యింది.

ఇక జగన్‌ ఐదేళ్ల పాలనలో వాస్తవ రూపం దాల్చి ఉత్పత్తి ప్రారంభించిన పరిశ్రమల పెట్టుబులే లక్ష కోట్ల రూపాయలకు పైగా ఉన్నాయి. కానీ వీటి గురించి జగన్‌ ఎన్నడూ ప్రచార ఆర్భాటాలు చేసుకోలేదు. తన పనేదో తాను చేసుకుంటూ పోతున్నారు. అలానే పరిశ్రమలకు అన్ని విధాలా చేయూతనిస్తున్నారు. సీఎం జగన్‌ సహకారం అందించడంతో రిలయన్స్, అదానీ, టాటా, బిర్లా, హెచ్‌యూఎల్, బ్లూస్టార్, డైకిన్, ఇన్ఫోసిస్‌ వంటి అనేక దిగ్గజ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నాయి. సాధారణంగా దేశంలో పెట్టుబడుల సదస్సులో జరిగే ఒప్పందాల్లో 16 నుంచి 17 శాతం మాత్రమే వాస్తవ రూపంలోకి వస్తాయి.

కానీ జగన్‌ పాలనో ఇందుకు భిన్నమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. విశాఖలో జరిగిన పెట్టుబడుల సదస్సు పూర్తై ఏడాది కాకుండానే 19 శాతం పెట్టుబడులు వాస్తవ రూపంలోకి వచ్చేశాయి. జీఐఎస్‌లో మొత్తం రూ.13.11 లక్షల కోట్ల విలువైన 386 ఒప్పందాలు జరగ్గా రూ.2.46 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులకు సంబంధించిన పరిశ్రమల పనులు వేర్వేరు దశల్లో ఉన్నాయి. ఇదంతా వైఎస్‌ జగన్‌ ప్రభుత్వ కృషికి నిదర్శనమని పారిశ్రామికవర్గాలు వెల్లడించాయి. ఇక తాజాగా కేంద్ర కూడా ఇదే స్పష్టం చేసింది. మరి ఇన్నాళ్లు జగన్‌ పాలనలో రాష్ట్రానికి పెట్టుబడులు రావడం లేదని గగ్గోలు పెట్టిన విపక్షాలు, వాటి అనుకూల మీడియా ఇప్పుడు ఎలా స్పందిస్తుందో చూడాలి.. తలలు ఎక్కడ పెట్టుకుంటారో అని కామెంట్స్‌ చేస్తున్నారు వైసీపీ కేడర్‌.