Arjun Suravaram
Phone Rubbery In Sattenapalle: మనం నిత్యం ఎన్నో రకాల దొంగతనాలు చూస్తాము..కానీ కొన్ని చోరీలు చూస్తే మాత్రం చాలా ఆశ్చర్యం కలుగుతుంది. తాజాగా ఏపీలోని పల్నాడు జిల్లాలో అలాంటి ఓ వెరైటీ దొంగతనం చోటుచేసుకుంది. ఆ చోరీకి సంబంధించిన వీడియో చూసిన వాళ్లు సైతం ఆశ్చర్యం వ్యక్తంచ చేస్తున్నారు.
Phone Rubbery In Sattenapalle: మనం నిత్యం ఎన్నో రకాల దొంగతనాలు చూస్తాము..కానీ కొన్ని చోరీలు చూస్తే మాత్రం చాలా ఆశ్చర్యం కలుగుతుంది. తాజాగా ఏపీలోని పల్నాడు జిల్లాలో అలాంటి ఓ వెరైటీ దొంగతనం చోటుచేసుకుంది. ఆ చోరీకి సంబంధించిన వీడియో చూసిన వాళ్లు సైతం ఆశ్చర్యం వ్యక్తంచ చేస్తున్నారు.
Arjun Suravaram
నేటి సమాజంలో సులభం డబ్బులు సంపాదించాలి అని అనుకునే వారి సంఖ్య బాగా పెరిగిపోయింది. ఈ క్రమంలో ఈజీగా ధనం సంపాదించేందుకు వివిధ మార్గాలను ఎంచుకుంటారు. చోరీలు చేయడం, నమ్మించి మోసం చేయడం, బెదిరించి దోచుకోవడం వంటివి చేస్తుంటారు. అయితే కొందరు కేటుగాళ్లు..మనిషికి డబ్బుపై ఉంటే బలహీనతను తమకు అవకాశంగా మల్చుకుని విలువనై వస్తువులు కాజేస్తుంటారు. తాజాగా పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో పట్టపగలే జరిగిన ఓ చోరీ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. రూ.20ను సొరగా వేసి.. ఓ వ్యక్తి దగ్గర నుంచి వేల ఖరీదు చేసే ఫోన్ ను కొట్టేశారు. సీసీ పుటేజ్ లో రికార్డు కావడంతో ఈ వెరైటీ దొంగతనం బయట పడింది. ఈ వీడియో చూసిన వారు నొరెళ్లబెడుతున్నారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే…
పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టపగలే చోరీ జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఇక అందులో చూసినట్లు అయితే.. ఓ కిరాణ కొట్టు వద్దకు ఓ పెద్దాయన వస్తాడు. ఆయన జేబులో స్మార్ట్ ఫోన్ ఉంది. అదే సమయంలో ఇద్దరు వ్యక్తులు కూడా అదే షాపు వద్దకు వస్తారు. కాసేపు చుట్టు పక్కలా పరీక్షించిన ఆ ఇద్దరు చోరీకి రంగం సిద్ధం చేసుకున్నారు. తెల్ల చొక్క వేసుకున్న ఆ పెద్దాయన పై జేబులో ఫోన్ ఉండగా.. షాపులోని వ్యక్తితో మాట్లాడుతున్నారు. ఇదే సమయంలో ఆయన వెనుక ఓ కుర్రాడు… 20 రూపాయల నోట్లు కింద వేసి.. పెద్దాయనకు చెప్పాడు. ఆయన నిజంగా తన డబ్బులే అనుకుని వంగీ వాటిని తీసుకున్నాడు. ఇక్కడే అసలు ట్విస్ట్ చోటుచేసుకుంది.
ఆ వ్యక్తి డబ్బుల కోసం వంగే సమయంలో జేబులో ఫోన్ ఉంది. వాటిని తీసుకుని తిరిగి పైకి లేచిన క్రమంలో మాత్రం ఫోన్ లేదు. అంత చాకచక్యంగా ఫోన్ ను కొట్టేశాడు. ఇక ఈ చోరీ దృశ్యం సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ పుటేజ్ కానీ లేకుంటే.. అసలు చోరీ జరిగినట్లు కూడా ఎవరు నమ్మేవారు కాదు. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను వీక్షించన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేయడంతో పలు రకాల కామెంట్స్ చేస్తున్నారు. తాము ఎన్నో దొంగతనాలు చూశాము కానీ.. ఈ తరహా చోరీ తాము ఎప్పుడు చూడలేదంటున్నారు. మరికొందరు అయితే ఆ దొంగను కూడా పొగడుతున్నరు. ఏమి టాలెంట్ రా..బాబు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. చిన్న వాటి కోసం ఆశ పడితే.. విలువైనవి కోల్పోతారంటూ మరికొందరు అంటున్నారు. మరి.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ చోరీ వీడియోను వీక్షించి..మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
సీసీటీవీ ఫుటేజ్-
20రూపాయలు ఎరగా వేసి సెల్ ఫోన్ దొంగతనం… పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో పట్టపగలే చోరీ… pic.twitter.com/CaT207yXqb
— Telugu360 (@Telugu360) July 12, 2024