Krishna Kowshik
ఒడిశాలో బాలాసోర్ ఘటన ఎంతటి పెను విషాదాన్ని నింపిందో అందరికీ తెలుసు. ఈ ప్రమాదాానికి సిగ్నలింగ్ వ్యవస్థలో లోపమని గుర్తించిన భారతీయ రైల్వే.. ఆ వ్యవస్థను ఆధునీకరిస్తుంది. ఈ క్రమంలో విజయవాడ డివిజన్ లో పనులు ప్రారంభమయ్యాయి.
ఒడిశాలో బాలాసోర్ ఘటన ఎంతటి పెను విషాదాన్ని నింపిందో అందరికీ తెలుసు. ఈ ప్రమాదాానికి సిగ్నలింగ్ వ్యవస్థలో లోపమని గుర్తించిన భారతీయ రైల్వే.. ఆ వ్యవస్థను ఆధునీకరిస్తుంది. ఈ క్రమంలో విజయవాడ డివిజన్ లో పనులు ప్రారంభమయ్యాయి.
Krishna Kowshik
ఈ మధ్య కాలంలో అతి పెద్ద రైల్వే ప్రమాదంగా నిలిచింది ఒడిశాలోని బాలాసోర ఘటన. గత ఏడాది జూన్ 2వ తేదీన కోరమాండల్ ఎక్స్ ప్రెస్, గూడ్స్, హౌరా ఎక్స్‌ప్రెస్ ఢీ కొన్న ఘటనలో సుమారు 300 మంది మరణించారు. అలాగే 1200 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదం ఈ దశాబ్ద కాలంలో జరిగిన అతిపెద్ద దుర్ఘటనగా చరిత్రలో నిలిచిపోయింది. అయితే ఈ ప్రమాదానికి సిగ్నలింగ్ వ్యవస్థ లోపం కారణమని గుర్తించారు రైల్వే ఉన్నతాధికారులు. ఈ నేపథ్యంలో ఇలాంటి ప్రమాదాలకు తావు లేకుండా చూసుకునేందుకు ఇండియన్ రైల్వే పటిష్టమైన చర్యలు చేపట్టింది. దేశవ్యాప్తంగా రైల్వే సిగ్నలింగ్ వ్యవస్థను ఆధునికీకరించేందుకు రూట్ మ్యాప్ సిద్ధం చేసింది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పలు డివిజన్లలో పనులు చేపట్టింది. ఈ క్రమంలో పలు రైళ్లను రద్దు చేస్తోన్న సంగతి విదితమే.
విజయవాడ డివిజన్ పరిధిలో సిగ్నలింగ్ వ్యవస్థను ఆధునీకరణ పనులు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో కీలక రైళ్లను రద్దు చేయడంతో పాటు దారి మళ్లించాలని నిర్ణయించారు రైల్వే అధికారులు. మే నుండి విజయవాడ లేదా దాని మీదుగా ప్రయాణించే పలు రైళ్లు రద్దు అవుతున్నాయి. అయితే ఆగస్టు నెలలో కూడా 32 ప్రధాన రైళ్లు రద్దు చేయాలని నిర్ణయించారు. ఆగస్టు 3వ తేదీ నుండి 10 వరకు తెనాలి-విజయవాడ(ట్రైన్ నంబర్ 07630), విజయవాడ-గూడురు (07500) రైళ్లు రద్దు కానున్నాయి. అలాగే ఆగస్టు 5వ తేదీ నుండి 10 వరకు విజయవాడ-భద్రాచలం (07979), భద్రాచలం- విజయవాడ (07278/07279), తెనాలి-విజయవాడ (07575) రైళ్లను ర్దదు చేసింది. అలాగే కొన్ని రైళ్లు కూడా దారి మళ్లాయి. ఏఏ రైళ్లు రద్దు కానున్నాయో పూర్తి వివరాలు ఇవిగో
రద్దు చేసిన రైళ్ల వివరాలు ఇలా..
ఆగస్టు 3వ తేదీ నుంచి 10వరకు నర్సాపూర్-విజయవాడ (17270 )
ఆగస్టు 3వ తేదీ నుంచి 10వరకు విజయవాడ-బిట్రగుంట (07978)
ఆగస్టు 4వ తేదీ నుంచి 11వరకు గూడూరు-విజయవాడ (07458) ,
ఆగస్టు4వ తేదీ నుంచి 11వరకు బిట్రగుంట-చెన్నైసెంట్రల్ (17237)
ఆగస్టు 4వ తేదీ నుంచి 11వరకు బిట్రగుంట-చెన్నైసెంట్రల్ ( 17237/17238)
ఆగస్టు 4వ తేదీ నుంచి 10వరకు విజయవాడ-హుబ్లీ ( 17329/17330)
ఆగస్టు 5వ తేదీ నుంచి 10వరకు విజయవాడ-గుంటూరు (07464/07465)
ఆగస్టు 5వ తేదీ నుంచి 10వరకు గుంటూరు-విజయవాడ ( 07755/07756)
ఆగస్టు 5వ తేదీ నుంచి 10వరకు డోర్నకల్-విజయవాడ (07755)
ఆగస్టు 5వ తేదీ నుంచి 10వరకు విజయవాడ-చెన్నై సెంట్రల్ ( 12711/12712)
ఆగస్టు 5వ తేదీ నుంచి 10వరకు గుంటూరు-సికింద్రాబాద్ ( 17201/17202)
ఆగస్టు 5వ తేదీ నుంచి 11వరకు విజయవాడ-సికింద్రాబాద్ (12713/17214)
ఆగస్టు 5వ తేదీ నుంచి 11వరకు విజయవాడ-నర్సాపూర్ (07862)
ఆగస్టు 5వ తేదీ నుంచి 11వరకు విజయవాడ-నర్సాపూర్ (17269)
ఆగస్టు5వ తేదీ నుంచి 12వరకు విజయవాడ-తెనాలి (07629)
ఆగస్టు5వ తేదీ నుంచి 12వరకు విజయవాడ-మాచర్ల ( 07781/07782 ),
వీటితో పాటు పలు రైౌళ్లు కూడా దారి మళ్లించారు. ఆగస్టు 5,7,8,9,10 తేదీల్లో విజయవాడ-చెన్నైసెంట్రల్ ( 12077/12078) రాయనపాడు మీదుగా మరికొన్ని రైళ్లను దారి మళ్లించారు. ఆగస్టు 2వ తేదీ నుంచి 10వరకు సికింద్రాబాద్-విశాఖపట్నం (12740), ఆగస్టు 4వ తేదీన గాంధీనగర్-విశాఖపట్నం (20804), ఆగస్టు7వ తేదీన ఓక-పూరీ (20820) ఆగస్టు 4,7 తేదీల్లో నిజాముద్ధీన్-విశాఖపట్నం ( 12804), ఆగస్టు 2వ తేదీ నుంచి 10వరకు చత్రపతి శివాజీ టెర్మినల్-భువనేశ్వర్ ( 11019) రైళ్లు దారి మళ్లనున్నాయి.