iDreamPost
android-app
ios-app

అమిత్ షాతో లోకేశ్, పురందేశ్వరి భేటీపై..మంత్రి బొత్స కౌంటర్!

అమిత్ షాతో లోకేశ్, పురందేశ్వరి భేటీపై..మంత్రి బొత్స కౌంటర్!

బుధవారం ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి భేటి అయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు అరెస్ట్ కు సంబంధించిన అంశాలపై లోకేశ్, పురందేశ్వరిలు అమిత్ షాతో చర్చించారు. అయితే ఈ భేటీపై వైసీపీ నేతలు ఓ రేంజ్ లో కౌంటర్లు ఇస్తున్నారు. పురందేశ్వరి మరిదిని కాపాడేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఆమె బీజేపీ అధ్యక్షురాలి కాకుండా, టీడీపీ అధ్యక్షురాలిలో వ్యవహరిస్తుందంటూ సెటైర్లు వేశారు. తాజాగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అమిత్ షాతో లోకేశ్, పురందేశ్వరి భేటీ కావడంపై కౌంటర్ ఇచ్చారు. ఏపీ బీజేపీ..టీడీపీకి బీ  టీమ్ లా వ్యవహరిస్తుందన్నారు.

గురువారం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు అరెస్ట్ బీజేపీ వాళ్లకు తెలిసే జరిగిందంటూ ఆరోపించిన టీడీపీ వాళ్లు… తాజాగా అమిత్ షాతో  నారా లోకేశ్ భేటీని ఎలా చూస్తారని ఆయన ప్రశ్నించారు. తల్లి, కొడుకులు కలిసి వెళ్లి అమిత్ షా ని కలిసి బాధలు చెప్పుకున్నట్లు అన్నారని బొత్సా అన్నారు. మా మీద చాడీలు చెప్పి, సానుభూతి పొందడానికి ప్రయత్నించి ఉంటారని, లోకేశ్ మాపై చాడీలు చెప్పకుండా, సీఎం జగన్ మమ్మల్ని బాగా ప్రేమిస్తున్నాడని చెప్తాడా ఏంటి? అని బొత్స వ్యంగ్యంగా వ్యాఖ్యనించారు. ఈ ఉగాది కి టీడీపీ, సెలబ్రిటీ పార్టీలు ఉండవని, ఎందుకుంటే.. అప్పటికి ఎన్నికలొస్తాయి. ఓటిమి పాలై కథ క్లోజ్ అవుతుందని బొత్స పేర్కొన్నారు.

ఇంకా మంత్రి బొత్సా మాట్లాడుతూ..”దొంగ ఎక్కువకాలం దొరలాగా ఉండలేరు. దొంగలు ఎప్పటికైనా దొరక్క తప్పదు. సుజనా చౌదరి వాళ్లు బీజేపీ  బీ టీమ్. టీడీపీ వాళ్లే కదా.. నిన్నటి వరకు బీజేపీ తెలిసే అరెస్ట్ చేశారని చెప్పారు. మరి ఇప్పుడెందుకు ఢిల్లీ వెళ్లి కలిశారు?. లోకేశ్  వెళ్లినప్పుడు.. పురందేశ్వరి అక్కడున్నారంటూ టీడీపీ వాళ్లు చెబుతున్నారు. మరి.. ఆ సమావేశంలో ఏం జరిగిందో ఆమెనే చెప్పాలి” అని బొత్స అన్నారు. మరి.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో పురందేశ్వరి, లోకేశ్  భేటీపై మంత్రి బొత్స ఇచ్చిన కౌంటర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి