ఊర్ల నుండి హైదరాబాద్ వస్తున్న వారికి బిగ్ అలెర్ట్! ఆ విషయంలో జాగ్రత్త!

Big Alert for Those Coming to Hyderabad: లాంగ్ వీక్ ఎండ్ రావడంతో తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ కి జనాలు పొటెత్తారు. పోలింగ్ పూర్తి కాగానే తిరుగు ప్రయాణాలు మొదలు పెట్టారు.

Big Alert for Those Coming to Hyderabad: లాంగ్ వీక్ ఎండ్ రావడంతో తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ కి జనాలు పొటెత్తారు. పోలింగ్ పూర్తి కాగానే తిరుగు ప్రయాణాలు మొదలు పెట్టారు.

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి సోమవారం 13 తో ముగిసింది. ఆంధ్రప్రదేశ్ లో ఓటు వేయడానికి తెలంగాణ నుంచి ఎంతోమంది ప్రయాణమయ్యారు. వరుస సెలవులు రావడంతో సొంతూళ్లకు వెళ్లిన వారు పోలింగ్ ముగియగానే తిరుగు ప్రయాణమయ్యారు. ఏపీ నుంచి తిరిగొస్తున్న ప్రయాణికులతో నగరంలోని మెట్రో, రైల్వే, బస్టాండ్లు రద్దీగా మారాయి. లాంగ్ వీక్ ఎండ్ రావడంతో చాలా మంది ఉద్యోగులు తమ సొంతూరుకి వెళ్లి తమవాళ్లను కలిసే ఛాన్స్ వచ్చిందని బయలుదేరారు. అలాగే ఏపిలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటు వినియోగించుకున్నారు. మంగళ వారం నుంచి ఆఫీసులు అన్నీ ఓపెన్ కావడంతో హడావుడిగా బయలుదేరుతున్నారు. అలాంటి వారు కొన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అసరవ ఉందని అంటున్నారు. వివరాల్లోకి వెళితే..

ఏపీలో ఎన్నికలు.. లాంగ్ వీకెండ్ రావడంతో చాలా మంది ఆంధ్రప్రదేశ్ కి బయలుదేరారు. చాలా గ్యాప్ తర్వాత తమ వాళ్లను కలుసుకున్నారు..అలాగే ఓటు హక్కు వినియోగించుకున్నారు. మంగళవారం నుంచి అన్ని ఆఫీసులు ఓపెన్ కావడంతో ప్రయాణికుల్లో హడావుడి మొదలైంది. ఈ క్రమంలోనే ముందుగా టికెట్స్ బుక్ చేసుకున్నవారు సోమవారం సాయంత్రం నుంచే ప్రయాణాలు మొదలు పెట్టినట్లు తెలుస్తుంది. అయితే ఏపీ  నుంచి తెలంగాణకు వచ్చే అన్ని మార్గాలు హెవీ ట్రాఫిక్ తో నిండిపోయాయి. మీరు ఒకవేళ ఆఫీస్ కి రావాలని ప్లాన్ చేసుకున్నా.. హైవేపై ఉన్న ట్రాఫిక్ వల్ల అది సాధ్యపడేలా లేదని అంటున్నారు. ఈ విషయాన్ని గుర్తుంచుకొని తిరుగు ప్రయాణాలు ప్లాన్ చేసుకోవాలని అంటున్నారు. అంతే కాదు వృద్దులు, పిల్లలు, గర్భిణీలు, ఏదైనా అనారోగ్యంతో బాధపడేవారు, డయాబెటీస్ ఉన్నవారు ప్రయాణాల విషయంలో చాలా కేర్ ఫుల్ గా ఉండాలని అంటున్నారు.

ప్రస్తుతం ఎండాకాలం కావడం వల్ల ట్రావెలింగ్ విషయంలో చాలా ఇక్కట్లు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ రెండు మూడు రోజుల ప్రయాణాల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని అంటున్నారు. రెగ్యూలర్ గా ఎల్బీ నగర్ లో మెట్రో స్టేషన్ లో ఇంత క్యూలు ఉండవు.. కానీ ఊర్లకు వెళ్లిన వారు ఒకేసారి తిరిగి రావడంలో సిటీలో విపరీతమైన ట్రాఫిక్ కి భయపడి మెట్రోని ఆశ్రయిస్తున్నారు. దీంతో ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ కిట కిటలాడుతుంది. విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే జాతీయ రహదారులు వాహనాలతో రద్దీగా మారాయి. ఏపీ ప్రజలు తిరిగి నగరంలోకి రావడం మొదలు పెట్టారు.. ఈ నేపథ్యంలో యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలంలో పంతంగి టోల్గేట్ వద్ద పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. టోల్​ప్లాజాలో 16 గేట్లు ఉండగా.. హైదరాబాద్ వైపు పది గేట్లను తెరిచారంటే రద్దీ ఎంతగా ఉందో అర్థమవుతుంది. మరి ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని ఊర్ల నుంచి వచ్చే ప్రయాణికులు తగు జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు.

Show comments