కుప్పం బరిలో భువనేశ్వరి!.. టీడీపీలో చర్చ.. కారణం అదేనా?

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆసక్తిని రేపే ఓ అంశం ప్రచారమవుతోంది. అదే కుప్పం నియోజకవర్గానికి సంబంధించి రానున్న ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై పలు ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి. చంద్రబాబు అరెస్టుతో కుప్పం నుంచి నారా భువనేశ్వరిని బరిలోకి దించాలని టీడీపీ వర్గాలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి టీడీపీ వర్గాలు గతంలోనే చంద్రబాబుకు సూచించినట్లు సమాచారం. దీంతో కుప్పంలో చంద్రబాబుకు ఓటమి తప్పదని టీడీపీ వర్గాలు ముందుగానే భావించాయా అనే అనుమానాలకు భువనేశ్వరీ పోటీచేయనున్నట్లు వస్తున్న వార్తలు బలాన్ని చేకూర్చేలా ఉన్నాయి. దీనికి గల కారణాలేంటో ఇప్పుడు చూద్దాం.

కుప్పం నియోజక వర్గంలో రానున్న ఎన్నికల్లో చంద్రబాబు నాయుడుకి ఓటమి తప్పదని అందుకే వేరే ఇతర నియోజక వర్గ స్థానాల్లో పోటీచేయాలని టీడీపీ వర్గాలు సూచించినట్లు సమాచారం. బాబు గెలిచే అవకాశాలు తక్కువగా ఉండడంతో ఒకానొక దశలో నారా భువనేశ్వరిని రంగంలోకి దించాలని బాబుకు సూచించినట్లు తెలుస్తోంది. దీనికి గల కారణం ఇప్పటికే అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం చంద్రబాబు ఎంఎల్ఎగా ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పంలో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ.. ప్రజలకు అండగా ఉంటూ దూసుకెళ్తుంది. వైసీపీ లీడర్ ఎంఎల్సీ భరత్ క్రియాశీలకంగా ఉంటూ ప్రజలతో మమేకమై పోతున్నారు. దీంతో పాటు అక్కడి ప్రజలు కూడా నాయకత్వ మర్పును కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. మోసకారి, అవినీతిపరుడైన చంద్రబాబుకు మద్దతిచ్చే విధంగా ప్రజలు లేరని తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ వర్గాలు చంద్రబాబుకు బదులు కుప్పంలో భువనేశ్వరిని బరిలోకి దించాలని సూచించినట్లు తెలుస్తోంది.

Show comments