iDreamPost

ఇన్నర్ రింగ్ రోడ్డు స్కాంలో నారాయణ ముందస్తు బెయిల్ పిటిషన్

ఇన్నర్ రింగ్ రోడ్డు స్కాంలో నారాయణ ముందస్తు బెయిల్ పిటిషన్

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టైన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ కేసులో ఏసీబీ కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించిన సంగతి విదితమే. ఈ కేసుతో పాటు ఆయనపై పలు కేసులు నమోదు అయ్యాయి. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డులో చంద్రబాబు, తదితరులు అక్రమాలకు పాల్పడ్డారంటూ సీఐడీ కేసు నమోదు చేసింది. గత ఏడాది మేలో నమోదైన ఈ కేసులో చంద్రబాబు అండ్ కోను విచారించేందుకు అనుమతి ఇవ్వాలని ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్ దాఖలు చేసింది సీఐడీ. ఈ కేసులో ఏ1గా చంద్రబాబు, ఏ2గా నారాయణ, ఏ6గా నారా లోకేష్‌ ఉన్నారు. చంద్రబాబు, నారాయణకు అత్యంత సన్నిహితులు లింగమనేని రమేశ్ ఏ3, లింగమనేని రాజశేఖర్ ఏ4, రామకృష్ణ హౌసింగ్ లిమిటెడ్ డైరెక్టర్ అంజని కుమార్ ఏ-5గా ఉన్నారు.

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు ప్రాజెక్ట్ పేరుతో పెద్ద మొత్తంలో ప్రజా ధనాన్ని దోపిడీ చేశారంటూ, తమ స్వ ప్రయోజనాల కోసం ఆ ప్లాన్ లో మార్పులు చేశారని పేర్కొంటూ గత ఏడాది మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు చేశారు. అలైన్ మెంట్ మార్చేసి.. హెరిటేజ్ ఫుడ్స్, రామకృష్ణ హౌసింగ్, ఎల్ఈపీఎల్ ప్రాజెక్ట్స్, లింగమనేని అగ్రికల్చర్ ఫామ్స్, జయని ఎస్టేట్స్‌కు లబ్ది చేకూర్చారని ఆరోపించారు. దీంతో సీఐడీ అధికారులు 420 సహా పలు సెక్షల కింద కేసు పెట్టారు.ఈ కేసు విచారణను ఏపీ ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించి. కాగా, ఈ కేసులోనే ఏ-2గా ఉన్న నారాయణకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది ఏపీ హైకోర్టు. తాజాగా ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు నారాయణ. దీనిపై నేడు కోర్టులో విచారణ జరగనుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి