తిరుమల వెళ్తున్నారా? ఇలాంటి మోసగాళ్లు కూడా ఉంటారు జాగ్రత్త!

Beware Of This Fraud In Tirumala: మీరు తిరుమల వెళ్తున్నారా? ఐతే జాగ్రత్త. ఇలాంటి మోసగాళ్లు కూడా ఉంటారు. 50 రూపాయలు, వంద రూపాయలు అయ్యేదానికి మీ దగ్గర వెయ్యి రూపాయలు వసూలు చేస్తారు. ఇప్పటికే చాలా మంది భక్తుల దగ్గర వెయ్యి రూపాయలు వసూలు చేసి మోసం చేశారు.

Beware Of This Fraud In Tirumala: మీరు తిరుమల వెళ్తున్నారా? ఐతే జాగ్రత్త. ఇలాంటి మోసగాళ్లు కూడా ఉంటారు. 50 రూపాయలు, వంద రూపాయలు అయ్యేదానికి మీ దగ్గర వెయ్యి రూపాయలు వసూలు చేస్తారు. ఇప్పటికే చాలా మంది భక్తుల దగ్గర వెయ్యి రూపాయలు వసూలు చేసి మోసం చేశారు.

తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి నిత్యం వేల మంది వెళ్తుంటారు. ఎంత రద్దీగా ఉన్నా కూడా లెక్క చేయకుండా పిల్లా, పాపలు, వృద్ధులు అందరూ ఆ స్వామి వారి దర్శనం చేసుకుని వస్తుంటారు. కాలి నడకన వెళ్ళేవాళ్ళు కూడా ఉంటారు. డబ్బులు పెట్టి టికెట్ కొనుక్కోలేక ఉచిత దర్శనం మీదుగా వెళ్తారు. కొంతమంది తక్కువ డబ్బు చెల్లించి టికెట్లు కొనుగోలు చేస్తారు. అందరూ వీఐపీ దర్శన టికెట్లు కొనలేరు కదా. బడ్జెట్ చూసుకుని.. లెక్కలు వేసుకుని మరీ తిరుమల వస్తుంటారు. ఇంత పొదుపు చేసుకునేది దళారుల చేతుల్లో మోసపోవడానికా? 50 రూపాయలు, వంద రూపాయలు అయ్యే దానికి కూడా కొంతమంది భక్తుల దగ్గర ఏకంగా వెయ్యి రూపాయలు వసూలు చేస్తున్నారు. డిమాండ్ అటువంటిది.. దొరకడం లేదు అని చెప్పి భక్తులను భారీగా మోసం చేస్తున్నారు. 

కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమలలో ఘరానా మోసం ఒకటి వెలుగు చూసింది. తిరుమల తిరుపతి దేవస్థానం కళ్లుగప్పి కొందరు అటు టీటీడీని, ఇటు భక్తులను మోసం చేస్తున్నారు. వీరి మోసం బయటపడడంతో పోలీసులు కేటుగాళ్లను అదుపులోకి తీసుకున్నారు. భక్తుల ఆధార్ కార్డులతో గదులు అద్దెకు తీసుకుని వాటిని భక్తులకు అధిక ధరకు ఇస్తున్నారు. తరచుగా వీళ్ళు గదులు తీసుకుంటుండడం సీసీటీవీ కెమెరాల్లో కనిపించడంతో టీటీడీ సిబ్బంది అనుమానంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు భక్తుల ఆధార్ కార్డుతో మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు దళారులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో ఒకరు కృష్ణా జిల్లాకు చెందిన నాగ బ్రహ్మచారి కాగా.. మరొకరు వరంగల్ కు చెందిన వెంకటేశ్వరరావుగా గుర్తించారు.

ఇద్దరి మీద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు తిరుమల పోలీసులు. విలాసాలకు అలవాటు పడిన నాగ బ్రహ్మచారి, వెంకటేశ్వరరావు ఇద్దరూ తిరుమలకు వచ్చే భక్తులను మోసం చేస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. అయితే వేరే ఎవరైనా వీరికి ఆధార్ కార్డులు ఇచ్చి సహకరిస్తున్నారా? లేక నకిలీ ఆధార్ కార్డులను సృష్టించి గదులను అద్దెకు తీసుకుంటున్నారా అనేది తెలియాల్సి ఉందని పోలీసులు వెల్లడించారు. ఆధార్ కార్డుల ద్వారా తిరుమలలో గదులను 50 రూపాయలకి, వంద రూపాయలకి అద్దెకు తీసుకుంటున్నారు. వాటిని భక్తులకు వెయ్యి రూపాయలకు అద్దెకి ఇస్తున్నారు. దళారుల్లా మారి టీటీడీకి, భక్తులకు భారీ నష్టం చేకూరుస్తున్నారు. ఈ దళారీ వ్యవస్థపై పూర్తిగా దర్యాప్తు చేస్తామని.. టీటీడీ విజిలెన్స్ తో కలిసి నిఘా పెట్టి దళారులను పట్టుకుంటామని తిరుమల పోలీసులు తెలిపారు.  

Show comments