Arjun Suravaram
మనిషికి దానం గుణం ఉండాలని ధర్మం చెబుతుంది. అయితే దానిని ఆచరణలో పెట్టే వారు చాలా తక్కువ మందే ఉన్నారు. ధనవంతులు దానం చేయండంలో వింత లేదు. అయితే తన జీవనం కోసమే భిక్షాటనం చేస్తూ వ్యక్తి..విరాళం ఇవ్వాలంటే పెద్ద మనస్సే ఉండాలి. తాజాగా ఓ వ్యక్తి అలాంటి మంచి మనస్సు చాటుకున్నారు.
మనిషికి దానం గుణం ఉండాలని ధర్మం చెబుతుంది. అయితే దానిని ఆచరణలో పెట్టే వారు చాలా తక్కువ మందే ఉన్నారు. ధనవంతులు దానం చేయండంలో వింత లేదు. అయితే తన జీవనం కోసమే భిక్షాటనం చేస్తూ వ్యక్తి..విరాళం ఇవ్వాలంటే పెద్ద మనస్సే ఉండాలి. తాజాగా ఓ వ్యక్తి అలాంటి మంచి మనస్సు చాటుకున్నారు.
Arjun Suravaram
ప్రతి మనిషికి డబ్బులు సంపాదించాలనే కోరిక ఉంటుంది. అయితే అలానే రేయింబవళ్లు కష్టపడి ధనాన్ని కూడబెడుతుంటారు. వీరిలో కొందరు దానధర్మాలు చేస్తుంటారు. ధనవంతులు దానం చేయడంలో ఆశ్చర్యం లేదు. అయితే తాను జీవించడానికే ధనం లేనప్పుడు, ఇతరులకు ఎవరైన దానం చేయాలని భావిస్తారా?. ఆ ఆలోచన కూడా ఎక్కువ మందికి రాదు. కానీ ఓ యాచకుడు మాత్రం తన మంచి మనస్సును చాటుకున్నాడు. ఆయన చేసిన పని తెలిస్తే.. ఇది కదా గొప్ప మనస్సు అని అనక మానరు. తాను యాచించిన సొమ్మును బాబా గుడికి విరాళంగా ఇచ్చారు. మరి.. ఆయన ఎవరు.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…
ఎన్టీఆర్ జిల్లా విజయవాడ లోని ముత్యాలపాడులో శ్రీ షిర్డీసాయి బాబా మందిరం వద్ద యాదిరెడ్డి అనే వృద్ధుడు భిక్షాటనం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఆయన అక్కడే భక్తులు ఇచ్చే ప్రసాదాలు స్వీకరిస్తూ కాలాన్ని గడిపేస్తున్నారు. అంతేకాక నిత్యం భక్తుల నుంచి యాచించిన సొమ్మును బాబా గుడికి అందించాలని భావించాడు. అందుకే తన సొంత అవసరాలకు తక్కువ డబ్బులు ఖర్చు చేసేవాడు. ఇలా భక్తుల నుంచి సేకరించిన సొమ్ముతో లక్ష రూపాయలు పోగు చేసి బాబా ఆలయ అభివృద్ధికి ఇవ్వాలని నిర్ణయించాకున్నాడు. ఈ క్రమంలో తాను కూడబెట్టిన ధనాన్ని బాబా మందిర గౌరవాధ్యక్షుడు డాక్టర్ పూనూరు గౌతం రెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా గౌతం రెడ్డి మాట్లాడుతూ… బాబా మందిరానికి యాదిరెడ్డి విరాళం ఇవ్వడం ఇది తొలిసారి కాదని, ఇప్పటికే పలు దఫాలుగా రూ.8.54 లక్షలు అందజేశారని తెలిపారు.
తాజాగా శుక్రవారం యాదిరెడ్డి అందజేసిన లక్ష రూపాయలతో కలిపి మొత్తం రూ.9.54 లక్షలు ఇచ్చినట్లు అయిందని ఆయన తెలిపారు. తాను భిక్షాటన చేస్తూ మందిరానికి విరాళం ఇవ్వడం అభినందనీయమన్నారు. ఇక విరాళం ఇచ్చిన యాదిరెడ్డి మాట్లాడుతూ.. బాబా మందిరం వద్ద యాచించి..సంపాదించిన డబ్బును ఆ బాబాకే ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని తెలిపాడు. ఇకపై కూడా తాను సేకరించే ప్రతి రూపాయిని దైవకార్యాలకే వినియోగిస్తానని తెలిపారు. మందిర అధ్యక్షుడు పొన్నలూరి లక్ష్మణరావు, కోశాధికారి మందులపర్తి సత్యశ్రీహరి తదితరులు యాదిరెడ్డిని అభినందించారు. అనంతరం విరాళం ఇచ్చిన దాతను బాబావారి శేషవస్త్రంతో గౌతంరెడ్డి సత్కరించారు.
ఇలా ఎంతో మంది తమ జీవనం కోసం భిక్షాటనం చేస్తుంటారు. అయితే వారిలో చాలా తక్కువ మంది మాత్రమే ఇలాంటి బలమైన నిర్ణయాలు, గొప్ప నిర్ణయాలు తీసుకుంటారు. గతంలో కూడా కొందరు తమ డబ్బులను అనాథశరణాలయాలకు, ఆలయాలు, అన్నదాన కార్యక్రమాలకు అందజేశారు. ఎవరికి దేని విషయంలో ఆసక్తి ఉంటే ఆ కార్యక్రమానికి డబ్బులు, ఇతర వస్తువులు దానం చేస్తుంటారు. మరి.. మంచి మనస్సు చాటుకున్న యాదిరెడ్డిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.