ఏఆర్ సీఐ స్వర్ణలత.. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో వినిపిస్తున్న పేరు. విశాఖ పట్నంలో ఏఆర్ సీఐ గా పని చేస్తునన స్వర్ణలత.. ఇటీవలే నోట్ల మార్పిడి కేసులో అరెస్టైన సంగతి తెలిసిందే. రెండు వేల రూపాయల నోట్లను మార్పిడి చేసేందుకు ఇద్దరు మాజీ నావీ ఉద్యోగుల నుంచి డబ్బులు డిమాండ్ చేసింది. ఈక్రమంలో వారి ఫిర్యాదుతో సీఐ స్వర్ణలతో పాటు మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో తాజాగా స్వర్ణలతకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆమెతో పాటు మరో ముగ్గురికి కూడా బెయిల్ మంజూరైంది.
విశాఖపట్నంలో ఏఆర్ సీఐ స్వర్ణలత విధులు నిర్వహిస్తున్నారు. నోట్ల మార్పిడి ఘటనలో ఆమె అడ్డంగా బుక్కయ్యారు. గతంలో కూడా ఈమెపై పలు ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ నోట్ల మార్పిడి వ్యవహారంలో మాజీ నావీ ఉద్యోగులను డబ్బులు డిమాండ్ చేయడంతో ఈమె బండారం బయట పడింది. రిటైర్డ్ అధికారులు శ్రీను, శ్రీధర్ తమ వద్ద ఉన్న రూ.2 వేల నోట్లను.. మార్పిడి కోసం.. సూరిబాబు అనే మధ్యవర్తిని ఆశ్రయించారు. ఈ క్రమంలో రూ.90 లక్షల విలువైన రూ.500 నోట్లు ఇస్తే.. రూ.కోటి విలువైన రూ.2వేల నోట్లు ఇచ్చేట్లు వారి మధ్య ఒప్పందం కుదిరింది.
అయితే, నోట్ల మార్పిడిలో ఇబ్బంది రాకుండా ఉండేందుకుల మధ్యవర్తి సూరిబాబు..హోగార్డులుగా పని చేస్తున్న శ్యామ్ సుందర్, శ్రీనును ఆశ్రయించారు. వీరిద్దరు ఏఆర్ సీఐ స్వర్ణలత వద్ద హోంగార్డులుగా పనిచేస్తున్నారు. సూరిబాబు వారిని ఆశ్రయించిన తరువాతే కథ అడ్డం తిరిగింది. బాధ్యత గల విధుల్లో ఉండి నోట్ల మార్పిడి కేసులో కొందరు వ్యక్తులను బెదిరించి లక్షల్లో డబ్బులు గుంజినట్లు ఫిర్యాదులు అందడంతో స్వర్ణలతను పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆమె చేసిన అనేక అక్రమాలు వెలుగులోకి వచ్చాయి.
అంతేకాక ఆమెకు సినిమాలో నటించాలనే కోరికతో డ్యాన్స్ చేసిన వీడియోలు కూడా పోలీసులు గుర్తించారు. ఇక స్వర్ణలతతో పాటు సూరిబాబును, హోంగార్డులు శ్యామ్ సుందర్, శ్రీనులను కూడా పోలీసుల అరెస్ట్ చేశారు. ఆ తరువాత జరిగిపిన విచారణలో అనేక కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా విశాఖ మెట్రోపాలిటిన్ మేజిస్ట్రేట్ కోర్టు నలుగురికీ బెయిల్ మంజూరు చేసింది. ఈ నలుగురికి షరతులతో కూడిన బెయిల్ ను కోర్టు మంజూరు చేసింది. ఇద్దరు జామీనుతో పాటు పూచీకత్తు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. మరి.. స్వర్ణలతకు బెయిల్ మంజూరు కావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: జాతీయ స్థాయిలో సత్తా చాటిన AP యువతి.. మిస్ టీన్ గ్లోబ్ ఇండియా కిరీటం!