ఏపీ RTC బస్సుల్లో ఉచిత ప్రయాణం.. వారికి మాత్రమే

SSC Exams 2024: పదో తరగతి పరీక్షలు రాయబోతున్న విద్యార్థులకు ఆర్టీసీ అధికారులు శుభవార్త చెప్పారు. వారికి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తూ.. ఆదేశాలు జారీ చేశారు. ఆ వివరాలు..

SSC Exams 2024: పదో తరగతి పరీక్షలు రాయబోతున్న విద్యార్థులకు ఆర్టీసీ అధికారులు శుభవార్త చెప్పారు. వారికి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తూ.. ఆదేశాలు జారీ చేశారు. ఆ వివరాలు..

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తోన్న సంగతి తెలిసిందే. వయసుతో సంబంధం లేకుండా మహిళలు ఎవరైనా తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీగా ప్రయాణించవచ్చు. కేవలం ఆధార్‌ కార్డ్‌, ఓటర్‌ ఐడీ చూపిస్తే చాలు. ఈ పథకానికి చాలా మంచి ఆదరణ లభిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఆర్టీసీ అధికారులు.. పదో తరగతి విద్యార్థులకు శుభవార్త చెప్పారు. పరీక్షలు రాయబోతున్న 10వ తరగతి విద్యార్థులు.. ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. ఆ వివరాలు..

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షలు రాయబోతున్న విద్యార్థులకు ఏపీఎస్‌ఆర్‌టీసీ శుభవార్త చెప్పింది. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు.. ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించవచ్చని తెలిపింది. పరీక్ష రాసేవారు తమ హాల్‌టికెట్లు చూపించి.. ఇంటి నుంచి పరీక్ష కేంద్రాలకు.. ఆ తర్వాత ఇళ్లకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చిన పేర్కొంది. పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ బస్సుల్లో ఈ ఉచిత ప్రయాణ సదుపాయం అందుబాటులో ఉందని.. విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించింది.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా 2023-24 విద్యా సంవత్సరానికి గానూ నిర్వహించనున్న 10వతరగతి, ఇంటర్‌ వార్షిక పరీక్షల షెడ్యూళ్లను 2023, డిసెంబర్ 14న ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన సంగతి తెలిసిందే. మార్చిలో 10వ తరగతి, ఇంటర్ పరీక్షలు నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్‌ విద్యాశాఖ నిర్ణయించింది. మార్చి 18వ తేదీ నుంచి 30వ తేదీ వరకు 10వ తరగతి పరీక్షలు.. మార్చి 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఇంటర్‌ పరీక్షలు జరగనున్నాయి. పరీక్షల నేపథ్యంలో  ఏపీఎస్‌ఆర్టీసీ నిర్ణయంపై విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

పదో తరగతి షెడ్యూల్‌ ఇదే :

  • మార్చి 18- ఫస్డ్ లాంగ్వేజ్ పేపర్-1
  • మార్చి 19 – సెకండ్ లాంగ్వేజ్
  • మార్చి 20 – ఇంగ్లిష్
  • మార్చి 22 – మ్యాథ్స్‌
  • మార్చి 23 – ఫిజికల్ సైన్స్
  • మార్చి 26 – బయాలజీ
  • మార్చి 27 – సోషల్ స్టడీస్
  • మార్చి 28 – మొదటి లాంగ్వేజ్ పేపర్-2 (కాంపోజిట్ కోర్సు)/ ఓఎస్ ఎస్ ఇ మెయిన్ లాంగ్వేహ్ పేపర్ -1
  • మార్చి 30 – ఓఎస్ఎస్ ఇ మెయిన్ లాంగ్వేజ్ పేపర్ -2 ( సంస్కృతం, అరబిక్,పర్షియన్), వొకేషనల్ కోర్సు పరీక్ష ఉంటుంది.
Show comments