Arjun Suravaram
APSRTC: తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ సందడి మొదలైంది. సంక్రాంతి అంటే పట్టణాల్లో నివాసం ఉండే పల్లెవాసులంతా తమ సొంత గ్రామాలకు ప్రయాణమవుతారు. ఈ నేపథ్యంలోనే ఆర్టీసీ ఊరెళ్లే వారికి శుభవార్త చెప్పింది.
APSRTC: తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ సందడి మొదలైంది. సంక్రాంతి అంటే పట్టణాల్లో నివాసం ఉండే పల్లెవాసులంతా తమ సొంత గ్రామాలకు ప్రయాణమవుతారు. ఈ నేపథ్యంలోనే ఆర్టీసీ ఊరెళ్లే వారికి శుభవార్త చెప్పింది.
Arjun Suravaram
రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి మొదలైంది. పండగకు మరికొద్ది రోజులు ఉండగానే పండగ వాతావరణం ప్రారంభమైంది. ఇక పండగ కోసం పట్టణాల నుంచి పల్లెలకు పెద్ద ఎత్తున పయనం అవుతున్నారు. ఈ నేపథ్యంలో బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిసి పోతున్నాయి. రైలు రిజర్వేషన్లు అయితే వెటింగ్ లిస్టు భారీగా ఉంది. ఇక సంక్రాంతి పండగ నేపథ్యంలో ఏపీఎస్ ఆర్టీసీ కీలక నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. రాయితీ, ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయడం వంటివి చేసింది. తాజాగా సంక్రాంతికి ఊరెళ్లే వారికి మరో గుడ్ న్యూస్ చెప్పింది ఏపీఎస్ ఆర్టీసీ.
తెలుగు ప్రజలు సంక్రాంతి పండగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. కోడిపందెలు, హరిదాసు కీర్తనలు, ఇళ్ల ముందు గొబ్బెంలు.. ప్రతి పల్లె సందడి సందడిగా ఉంటుంది. కొత్త అల్లుళ్లు, కొత్త కోడలు, బంధువులతో కలిసి ఈ పండగను ఎంతో సంతోషంగా జరుపుకుంటారు. ఎన్నో రకాల వంటకాలు తయారు చేసుకుని, కొత్త బట్టలు వేసుకుని కోలాహలం చేస్తుంటారు. ఇలా ప్రతి పల్లెలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతుంటాయి. ప్రతి ఏడాది లాగానే ఈ సారి కూడా తమ సొంత ఊర్లలో జరిగే సంక్రాంతి వేడుకలను చూసేందుకు పట్టణంలో ఉండే వారు పయనం అవుతున్నారు.
ఈ నేపథ్యంలో ఇప్పటికే పెద్ద సంఖ్యలో రిజర్వేషన్లు చేయించుకున్నారు. సొంతూళ్లకు వెళ్లేందుకు సిద్ధమైన ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆర్టీసీ, రైల్వే ప్రత్యేక బస్సులు, రైళ్లను నడుపుతోంది. పండగ నేపథ్యంలోనే ఏపీఎస్ ఆర్టీసీ కూడా ప్రత్యేక బస్సులను కూడా ఏర్పాటు చేసింది. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి ఏపీలోని వివిధ ప్రాంతాలకు స్పెషల్ బస్సులను ఏర్పాటు చేసింది. ఇప్పటికే 6,795 స్పెషల్ బస్సులను ఏపీఎస్ ఆర్టీసీ సిద్ధం చేసింది. వాటిలో హైదరాబాద్ నుంచి వచ్చేవారి కోసమే 1,600 బస్సులు కేటాయించింది.
తాజాగా హైదరాబాద్ నుంచి పండుగకు సొంతూళ్లకు వచ్చే వారికి ఏపీఎస్ ఆర్టీసీ మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే కేటాయించిన స్పెషల్ బస్సులు కాకుండా అదనంగా మరో వెయ్యి బస్సులను నడిపేందుకు సిద్ధమైంది. అదే విధంగా పండుగ తరువాత తిరిగి భాగ్యనగరానికి వచ్చేవారికోసం కూడా మరికొన్ని సర్వీసులు కేటాయిస్తామని ఆర్టీసీ అధికారులు తెలిపారు. వీటన్నింటిలో సాధారణ ఛార్జీలే ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు. ప్రతి ఏటా మాదిరిగానే ప్రజలకు అదనపు ఛార్జీల భారం పడకుండా సాధారాణ ఛార్జీలే స్పెషల్ బస్సులో ఉంటాయని అధికారులు తెలిపారు.
దీంతో సంక్రాంతికి ఊరెళ్లే వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అలానే రానుపోను రిజర్వేషన్ చేయించుకుంటే 10 శాతం రిజర్వేషన్ కల్పించిన సంగతి తెలిసిందే. దీనిని కూడా చాలా మంది సద్వినియోగం చేసుకుంటున్నారు. ఏపీఎస్ ఆర్టీసీ తరహాలోనే మరోవైపు టీఎస్ ఆర్టీసీ కూడా సంక్రాంతి సందర్భంగా 4,484 ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది. వీటిలో హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ లోని వివిధ ప్రాంతాలకు సంక్రాంతి సందర్భంగా 1450 ప్రత్యేక బస్సులు నడవనున్నాయి. మరి.. ఏపీఎస్ ఆర్టీసీ మరికొన్ని అదనపు బస్సులను కేటాయిస్తూ నిర్ణయం తీసుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.