APSDMA Predicts Thunder Rain In AP: AP వాసులకు అలర్ట్.. 5 రోజుల పాటు పిడుగులతో కూడిన వర్షాలు

AP వాసులకు అలర్ట్.. 5 రోజుల పాటు పిడుగులతో కూడిన వర్షాలు

ఏపీ వాసులకు ఆ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కీలక అలర్ట్‌ జారీ చేసింది. రానున్న 5 రోజుల పాటు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని.. జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. ఆ వివరాలు..

ఏపీ వాసులకు ఆ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కీలక అలర్ట్‌ జారీ చేసింది. రానున్న 5 రోజుల పాటు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని.. జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. ఆ వివరాలు..

గత నెలాఖరు వరకు మండే ఎండలతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు అల్లాడిపోయారు. వేడి తీవ్రతను భరించలేక.. ఉక్కపోతతో ఉడికిపోయారు. ఏసీలు, కూలర్లు లేకపోతే ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండే పరిస్థితి లేకుండా పోయిది. ఇక ఈ ఏడాది హైదరాబాద్‌ సహా దేశవ్యాప్తంగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వేడిని తట్టుకోలేక చాలా మంది చనిపోయారు. ఇక జనాలకు ఊరట కలిగించడం కోసం వరుణుడు ఈ ఏడాది ముందుగానే వచ్చేశాడు. జనవరి 1 నుంచి దేశంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. దాంతో దేశం కాస్త చల్లబడింది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో జూన్‌ నెల ప్రారంభం నుంచి మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో వాతావరణ శాఖ అధికారులు.. ఆంధ్రప్రదేశ్‌ వాసులకు అలర్ట్‌ జారీ చేశారు. ఆ వివరాలు..

ఆంధ్రప్రదేశ్‌లో గత కొన్ని రోజులుగా వాతావరణం మారింది. మే నెల ఆఖరు వరకు మండే ఎండలతో జనాలు బెంబెలేత్తిపోయారు. ఇక జూన్‌ నెల ప్రారంభంలోనే నైరుతి రుతుపవనాల రాష్ట్రంలోకి ప్రవేశించడంతో.. ఏపీలో పగటిపూట ఉష్ణోగ్రతలు భారీగా తగ్గుముఖం పట్టాయి. అలాగే రాష్ట్రంలోని పలుచోట్ల వర్షాలు పడుతున్నాయి. ఈ క్రమంలోనే నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఏపీలో మరో ఐదురోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఈ ఐదు రోజులు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని.. పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు జాగ్రత్తగా ఉండాలని ఈ సందర్భంగా రోణంకి కూర్మనాథ్‌ సూచించారు.

మరోవైపు ఆదివారం రోజున.. విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కర్నూలు, అనంతపురం, నంద్యాల జిల్లాలలో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. దాంతో ఆయా ప్రాంతాల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని.. వర్షంలో బయటకు వెళ్లకూడదని.. ఒకవేళ అత్యవసరమై వెళ్లాల్సి వస్తే.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నేడు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉన్నందున.. ప్రజలు ఎవరూ చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండవద్దంటూ ఏపీ విపత్తుల సంస్థ ప్రజలకు సూచించింది. మరోవైపు శనివారం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పలుచోట్ల వర్షం కురిసింది. ప్రకాశం జిల్లా బెస్తవారిపేటలో అత్యధికంగా 36 మిమీ, నెల్లూరు జిల్లా దుత్తలూరులో 32.7మిమీ వర్షపాతం నమోదైంది.

తెలంగాణలో కూడా 5 రోజులు జోరు వానలే..

ఇక నైరుతి రుతుపవనాల ప్రభావం వల్ల.. రానున్న ఐదు రోజుల పాటు తెలంగాణలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. నేడు ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్గొండ, రంగారెడ్డి, మెదక్, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. మరీ ముఖ్యంగా హైదరాబాద్‌ నగర వాసులు అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణ శాఖ అధికారులు అలర్ట్‌ జారీ చేశారు.

Show comments