Dharani
ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. నవంబర్ నెలలో వరుస నోటిఫికేషన్లు ఇవ్వనున్నట్లు వెల్లడించింది. వీటిల్లో గ్రూప్-1, గ్రూప్-2 పోస్టులు కూడా ఉన్నట్లు తెలిపింది. ఆ వివరాలు..
ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. నవంబర్ నెలలో వరుస నోటిఫికేషన్లు ఇవ్వనున్నట్లు వెల్లడించింది. వీటిల్లో గ్రూప్-1, గ్రూప్-2 పోస్టులు కూడా ఉన్నట్లు తెలిపింది. ఆ వివరాలు..
Dharani
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. నవంబర్ నెలలో భారీగా ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సర్కార్ నిర్ణయం వల్ల ప్రభుత్వ శాఖల్లో పలు పోస్టుల భర్తీకి ఈ నెలలో వరుసగా నోటిఫికేషన్లు జారీ చేయనున్నట్లు ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ వెల్లడించారు. ఇలా భర్తీ చేసే పోస్టుల్లో.. 900 వరకు గ్రూప్–2 ఖాళీలుండగా.. వందకుపైగా గ్రూప్–1 పోస్టులున్నాయి. ఇక ఇవే కాక.. డిగ్రీ, పాలిటెక్నిక్, జూనియర్ కాలేజీ లెక్చరర్ల పోస్టులతో కలిపి ఈనెలలో మొత్తం 23 నోటిఫికేషన్లను విడుదల చేయనున్నట్టు గౌతమ్ సవాంగ్ తెలిపారు. ఇప్పటికే నోటిఫికేషన్ వెలువడిన యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి గాను.. వచ్చె నెల అనగా డిసెంబర్‌లో సర్వీస్ కమిషన్ ద్వారా పరీక్షలు నిర్వహించనున్నట్టు వెల్లడించారు.
గతేడాది ఎలాంటి వివాదాలకు తావు లేకుండా గ్రూప్–1 నోటిఫికేషన్ జారీ చేసి 11 నెలల వ్యవధిలో పారదర్శకంగా ఇంటర్వ్యూలు కూడా పూర్తి చేసినట్లు ఈ సందర్భంగా గౌతమ్ సవాంగ్ గుర్తు చేశారు. ఏఈ నియామకాలను కూడా అతి తక్కువ సమయంలోనే పూర్తి చేశామన్నారు. గత నాలుగేళ్లల్లో న్యాయపరమైన పలు వివాదాలను అధిగమించి సంస్కరణలు తీసుకొచ్చినట్లు ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ తెలిపారు.
గ్రూప్–1 పరీక్షల నిర్వహణ, మూల్యాంకనం, సమర్థంగా ఎంపిక, హేతుబద్ధంగా అభ్యర్థుల వాస్తవిక నైపుణ్యాలను అంచనా వేసేందుకు కొత్త విధానాన్ని రూపొందించినట్లు వివరించారు. ఇందుకోసం దేశంలోనే అత్యున్నత విద్యా సంస్థలైన ఐఐటీ, హెచ్‌సీయూతో పాటు రాష్ట్రంలోని పలు వర్సిటీల్లోని నిపుణులతో చర్చించి సిలబస్‌లో సమూల మార్పులు తీసుకురానున్నట్లు చెప్పుకొచ్చారు.
కొన్ని పత్రికలు ఉద్దేశపూర్వకంగా సర్వీస్ కమిషన్‌పై తప్పుడు కథనాలను వెలువరిస్తూ నిరుద్యోగులను ఆందోళననకు గురి చేస్తున్నాయని ఏపీపీఎస్సీ పేర్కొంది. అసిస్టెంట్ ప్రొఫెసర్లు, గ్రూప్–1, గ్రూప్–2 నోటిఫికేషన్ల జారీపై తప్పుడు వార్తలు ప్రచురించడాన్ని బోర్డు ఖండించడమే కాక.. అవన్ని తప్పుడు వార్తలని.. ఓ ప్రకటన విడుదల చేసింది. గ్రూప్ 2 విషయంలో ఇప్పటికే దాదాపు 900 ఖాళీల భర్తీకి ఆర్థికశాఖ నుంచి అనుమతులు లభించాయని, 54 శాఖల నుంచి జోన్ల వారీగా జీవో నం.77కు అనుగుణంగా సమాచారం రావడం ఆలస్యమైందని పేర్కొంది. దీనిపై కసరత్తు పూర్తయ్యిందని.. ఈ నెలలోనే నోటిఫికేషన్ ఇవ్వనున్నట్టు ప్రకటించింది.