iDreamPost
android-app
ios-app

Byreddy Siddharth Reddy: వైఎస్ జగన్ కీలక నిర్ణయం.. బైరెడ్డి సిద్ధార్థరెడ్డికి కీలక బాధ్యతలు

  • Published Dec 13, 2023 | 12:15 PM Updated Updated Dec 13, 2023 | 12:15 PM

ఎన్నికల సమీపిస్తోన్ వేళ ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీ పార్టీ కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. తాజాగా బైరెడ్డి సిద్ధార్థరెడ్డికి కీలక బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలు..

ఎన్నికల సమీపిస్తోన్ వేళ ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీ పార్టీ కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. తాజాగా బైరెడ్డి సిద్ధార్థరెడ్డికి కీలక బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలు..

  • Published Dec 13, 2023 | 12:15 PMUpdated Dec 13, 2023 | 12:15 PM
Byreddy Siddharth Reddy: వైఎస్ జగన్ కీలక నిర్ణయం.. బైరెడ్డి సిద్ధార్థరెడ్డికి కీలక బాధ్యతలు

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో పార్టీలన్ని అందుకు రెడీ అవుతున్నాయి. ప్రస్తుతం పార్టీలన్ని ఎన్నికల ప్రణాళికలు రూపొందించడంలో బిజీగా ఉన్నాయి. ఇక ఈ విషయంలో అధికార వైసీపీ పార్టీ ఓ అడుగు ముందు ఉందనే చెప్పాలి. అనూహ్య నిర్ణాయలు తీసుకుంటూ ప్రతిపక్షాలతో పాటు.. కేడర్ కు కూడా షాక్ ఇస్తోంది. ఎన్నికలు సమీపిస్తోన్న వేళ.. పార్టీని బలోపేతం చేసుకుంటూనే.. 175కి 175 స్థానాల్లో విజయం సాధించే దిశగా అడుగులు వేస్తోంది వైసీపీ ప్రభుత్వం. దీనిలో భాగంగా తాజాగా పలు నియోజకవర్గాల్లో కొత్తవారిని ఇంచార్జీలను నియమిస్తూ సాహసోపేత నిర్ణయం తీసుకుంది. తాజాగా వైఎస్సార్సీపీ యువజన విభాగం నూతన కమిటీని ఏర్పాటుచేస్తూ మరో కీలక ప్రకటన చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆ వివరాలు..

తాజాగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నంద్యాల జిల్లాకు చెందిన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడిగా మరోసారి బాధ్యతలు అప్పగించారు. విశాఖపట్నానికి చెందిన కొండా రాజీవ్ గాంధీతో పాటు పల్నాడు జిల్లాకు చెందిన పిన్నెల్లి వెంకట్రామి రెడ్డి, అన్నమయ్య జిల్లాకు చెందిన తప్పెట సాహిత్ రెడ్డిలను ఉపాధ్యక్షులుగా నియమించారు. ఈ మేరకు మంగళవారం రాత్రి ఓ ప్రకటన విడుదల చేశారు. అలాగే వివిధ జిల్లాలకు, సామాజిక వర్గాలను దృష్టిలో వుంచుకుని యువజన కమిటీలో ఇతర పదవులను కేటాయించారు.

అలానే వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మహిళా విభాగానికి కూడా నూతన కమిటీని నియమించారు. వైఎస్సార్‌సీపీ మహిళా విభాగానికి ఎమ్మెల్సీలు పోతుల సునీత, వరుదు కళ్యాణిలు ఇద్దరినీ అధ్యక్షులుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే ఉపాధ్యక్షులుగా మంతెన మాధవీవర్మ, బండి పుణ్యశీల, డాక్టర్ శశికళను నియమించారు. మొత్తం 64 మందితో నూతన కార్యవర్గాన్ని నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.